Markandey Katju: ఆస్ట్రేలియా అందుకే గెలిచింది..

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

Courtesy: Twitter

Share:

Markandey Katju: ఆదివారం (19-11-23) నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా ఆస్ట్రేలియాతో(Australia) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా(Team India) ఘోరపరాజయం పాలయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ విఫలం కావడంతో ఆసీస్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. కానీ.. కొందరు ‘మేధావులు’ మాత్రం భారత్(India) ఓటమికి ఇతర కారణాలు ఉన్నాయంటూ విచిత్రమైన వాదనలు చేస్తున్నారు. ఆయా సెంటిమెంట్లు కలిసి రాకపోవడం వల్లే భారత్ ఓడిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలో తాజాగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ(Markandey Katju) కూడా చేరిపోయారు. ఆయన చెప్పిన కారణం ఏంటో తెలిస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

 పాండవుల కాలంలో(Period of Pandavas) ఆస్ట్రేలియా(Australia) మన భారతదేశానికి ఆయుధశాలగా ఉండేదని.. అందుకే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో(World Cup Final Match) ఆ జట్టు భారత్‌పై విజయం సాధించిందని జస్టిస్ కట్జూ(Markandeya Katju) పేర్కొన్నారు. ‘‘పాండవుల కాలంలో ఆస్ట్రేలియా ‘అస్త్రాల’ నిల్వ కేంద్రంగా ఉండేది. ఆ రోజుల్లో దానిని ‘అస్త్రాలయా’(Astralaya) అని పిలిచేవారు. వాళ్లు ప్రపంచకప్(World Cup ) గెలవడానికి ఇదే అసలు కారణం’’ అని తన ఎక్స్ ఖాతాలో కట్జూ పోస్ట్ చేశారు. అయితే.. ఈ వింత కారణం నిజమని నిరూపించే ఎలాంటి రుజువులు గానీ, సందర్భం గానీ ఇవ్వలేదు. కేవలం.. ఆ ఒక్క ట్వీట్ చేసి వదిలేశారు. దీంతో.. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  దీనిపై స్పందిస్తున్న కొందరు యూజర్లు.. కట్జూ వ్యాఖ్యలను సరదాగా తీసుకుంటున్నారు. మరికొందరు మాత్రం వాటికి కౌంటర్‌ వేస్తున్నారు. 

కాగా..దేశంలో సమకాలీన అంశాలపై సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ (Markandey Katju) ఎంతో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గానూ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్(Chairman Press Council of India) గానూ వ్యవహరించారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడిస్తారని ఆయనకు పేరుంది. జస్టిస్ కట్జూ తన అసాధారణ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందారు. 1970 నుండి 1991 వరకు అలహాబాద్ హైకోర్టులో(Allahabad High Court) తన న్యాయవాద అభ్యాసాన్ని ప్రారంభించారు. 2006లో భారత సుప్రీంకోర్టులో అడుగుపెట్టిన ఆయన.. 2011 సెప్టెంబర్‌లో పదవీ విరమణ పొందారు.

ఇదిలాఉంటే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో(Narendra Modi Stadium) జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో(World Cup 2023 Final Match) రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా(Australia) ఈ విజయంలో, ఎడమచేతి వాటం ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) 137 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కీలక సహకారం అందించాడు. ఇది కాకుండా లాబుస్‌చాగ్నే(Labuschagne) 58 పరుగులు చేశాడు. టైటిల్‌ మ్యాచ్‌లో భారత్‌పై తొలి నుంచి ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది.

ఆస్ట్రేలియాకు ఇది ఆరో వన్డే ప్రపంచకప్ టైటిల్(World Cup Title). ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో విజయం సాధించింది. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సహా మూడు విభాగాల్లో అద్భుతంగా ఉంది.

ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head), ఐదో నంబర్ మార్నస్ లాబుషాగ్నే(Labuschagne) జంట ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీని ముందు భారత బౌలర్లందరూ విఫలమయ్యారు. హెడ్ ​​సెంచరీ సాధించగా, లాబుషాగ్నే అర్ధ సెంచరీ ఆడాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఇన్నింగ్స్‌ను తెలివిగా నడిపించి కంగారూ జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే, మ్యాచ్ గెలవడానికి ముందు ట్రావిస్ హెడ్ 2 పరుగుల వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఆసీస్ తిరుగులేని ఆధిపత్యంతో దూసుకెళ్లింది.