దిల్లీలో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపై అత్యాచారం!

దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ఆమె తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం సృష్టించాయి.

Courtesy: IDL

Share:

దిల్లీ: దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ఆమె తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. కాగా, కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు. గత ఏడాది జూలై 23న ఉత్తర దిల్లీలోని బురారీ ప్రాంతంలో నిందితుడు నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘజియాబాద్‌ నివాసి అయిన సదరు నిందితుడు అంకిత్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌ నివాసి అయిన నిందితుడు అంకిత్ యాదవ్‌ కాంట్రాక్ట్ ప్రాతిపదికన బస్సు డ్రైవర్ గా చేస్తున్నాడు. అతడు గత ఎనిమిదేళ్లుగా బాధితురాలి తల్లితో సహజీవనం చేస్తున్నాడు. కాగా, ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జూలై 23, 2023న మహిళ తన పిల్లలను ఇంటి వద్ద వదిలి వెళ్లిందని, ఆ సమయంలో అంకిత్ యాదవ్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు బాలికను భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్షలు మరియు కౌన్సెలింగ్ నిర్వహించామని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 376 (రేప్), మరియు 506 (క్రిమినల్ బెదిరింపు), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని నిబంధనల ప్రకారం, పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.