బీజేపీ నాయకుడి కుమార్తె వివాహం.. అతిథిగా వెళ్లిన ప్రధాని మోదీ

PM Modi: రెండు రోజుల కేరళ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ త్రిస్సూర్ లో ప్రముఖ మలయాళ నటుడు, భాజపా నేత సురేశ్‌ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.

Courtesy: x

Share:

త్రిస్సూర్: రెండు రోజుల కేరళ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ త్రిస్సూర్ లో ప్రముఖ మలయాళ నటుడు, భాజపా నేత సురేశ్‌ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఉదయం కొచ్చిలో రోడ్‌ షో చేపట్టిన అనంతరం త్రిస్సూర్‌ వచ్చి, గురువాయూర్‌లోని శ్రీకృష్ణ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఆలయంలో కొత్త జంటను ఆశీర్వదించి వారిద్దరికీ వరమాలలు అందించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో దర్శనమిచ్చాయి. కాగా, కొచ్చి నుంచి హెలికాప్టర్‌లో గురువాయూర్‌లోని శ్రీకృష్ణ కళాశాల మైదానానికి చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు మైదానం వద్దకు వందలాది మంది తరలివచ్చారు. త్రిసూర్ జిల్లా యంత్రాంగం, బీజేపీ నేతలు ప్రధానికి స్వాగతం పలికారు. మోదీ దాదాపు 30 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. 

కొత్త జంటతో మాట్లాడిన మోదీ
బీజేపీ నాయకుడు మరియు ప్రముఖ నటుడు సురేష్ గోపి కుమార్తె భాగ్య వివాహానికి మోదీ హాజరు కావడం అందిరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు 20 నిమిషాల పాటు వేడుకకు హాజరైన ప్రధాని నూతన దంపతులకు పూలమాలలు వేసి ఆశీర్వదించారు. సురేశ్‌ గోపి కుటుంబం, కొత్త జంటతో మాట్లాడిన మోదీ.. వారితో ఫొటోలు తీసుకున్నారు. ఈ వేడుకలో మోహన్‌లాల్, మమ్ముట్టి, తదితర మలయాళ నటులు సందడి చేశారు. వారితోనూ ప్రధాని ముచ్చటించారు. అలాగే మరో 30 జంటలను ఆశీర్వదించారు. 

త్రిస్సూర్ నుండి బిజెపి అభ్యర్థిగా సురేష్ గోపి?
రాబోయే లోక్‌సభ ఎన్నికలు మరియు త్రిస్సూర్ నుండి బిజెపి అభ్యర్థిగా సురేష్ గోపిని బరిలోకి దించే అవకాశం ఉన్న నేపథ్యంలో సురేష్ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని మోదీ హాజరు కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కేరళలో బీజేపీ ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో త్రిసూర్ ఒకటి. కేవలం రెండు వారాల వ్యవధిలో త్రిసూర్ జిల్లాలో ప్రధాని పర్యటించడం ఇది రెండోసారి. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు జనవరి 3న బీజేపీ రాష్ట్ర విభాగం నిర్వహించిన మహిళా సదస్సుకు ఆయన హాజరయ్యారు.