ఎన్టీఆర్‌ 28వ వర్థంతి.. నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్

Senior NTR death anniversary: ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ 28వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుడిని స్మరించుకుంటున్నారు.

Courtesy: ANI

Share:

హైదరాబాద్: ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ 28వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుడిని స్మరించుకుంటున్నారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు. వాళ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్‌కి వళ్లి నివాళులు అర్పిస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే ఘాట్‌కి వెళ్లారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‎కు నివాళులు అర్పించారు. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని బాలకృష్ణ అన్నారు. బాలయ్యతోపాటు సుహాసిని, రామకృష్ణ కూడా ఎన్టీఆర్‎కి నివాళులు అర్పించారు. అటు.. బాలయ్య కంటే ముందే తెల్లవారుజామున జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌.. నందమూరి తారకరామారావు ఘాట్‌కి వెళ్లారు. తాతయ్య సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. వీరి రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు.

ఎన్టీఆర్ అంటే ప్రభంజనం.. పురంధేశ్వరీ
సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన  వ్యక్తి నందమూరి తారకరామారావు అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని.. ఒక ప్రభంజనమని పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్‌ తెలుగు కళామతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అనే పదానికి మారుపేరు ఆయనది. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నారంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరు. అందుకే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు’’ అని అన్నారు.