ముదురుతున్న పాక్, ఇరాన్ వైరం: ఇరాన్ పై వైమానిక దాడులు ప్రారంభించిన పాక్!

Iran-Pak: ఇరాన్ కు వ్యతిరేకంగా ఆ దేశంపై పాక్ ప్రతీకార దాడులకు తెగబడింది. ఇరాన్ క్షిపణి దాడులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ కూడా డ్రోన్‌లతో రెచ్చిపోయింది.

Courtesy: Top Indian news

Share:

ఇరాన్ కు వ్యతిరేకంగా ఆ దేశంపై పాక్ ప్రతీకార దాడులకు తెగబడింది. ఇరాన్ క్షిపణి దాడులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ కూడా డ్రోన్‌లతో రెచ్చిపోయింది. ఇరాన్‌ భూభాగంలోని ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌’, ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ’ స్థావరాలపై పాక్‌ గురువారం వైమానిక దాడులు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ప్రాంతంలోని బలూచిస్థాన్‌లో ఇరాన్ బుధవారం క్షిపణి, డ్రోన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అదిల్ టెర్రర్ గ్రూప్ స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. ఈ క్రమంలో 24 గంటల వ్యవధిలోనే పాక్ ప్రతీకార చర్యలు ప్రారంభించడం గమనార్హం.

గతంలో అసలేం జరిగిందంటే
2023 డిసెంబర్ లో ఇరాన్‌లోని పోలీస్‌ స్టేషన్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి పాకిస్థాన్‌ను ఇరాన్‌ మందలించింది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని రాస్క్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. 

ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఇరాన్ బుధవారం దాడులతో విరుచుకు పడింది. ఆ ప్రాంతంలో ఉన్న తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ మేరకు ఇరాన్ స్వయంగా ప్రకటన చేసింది. జైష్‌ అల్‌ అదిల్‌ అనే ఉగ్ర సంస్థకు చెందిన 2 ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఈ దాడుల్లో జైష్ అల్ అదిల్ రెండు స్థావరాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. అయితే ఇంతకు ముందు బలూచిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే అల్ అదిల్ మిలిటెంట్లు తమ భద్రతా బలగాలపై దాడి చేశారని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే బలూచిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసినట్లు తెలిపింది. అయితే, ఇరాన్‌ దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడిలో ఇద్దరు అమాయక పిల్లలు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడించింది. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇరాన్‌ (Iran) చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలుపించుకొని పాక్‌ విదేశాంగ కార్యాలయం తమ నిరసనను తెలియజేసింది. 

పాక్ లో ఇరాన్ దాడులపై భారత్ స్పందన ఇదే
పాక్‌లో ఇరాన్ దాడులపై భారత్ స్పందించింది. ఉగ్రవాద గ్రూపులపై ఇరాన్ చేసిన ఎయిర్‌ స్ట్రైక్స్‌పై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అది పూర్తిగా పాక్, ఇరాన్ అంతర్గత సమస్య అని పేర్కొంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్ సహించదని మరోసారి స్పష్టం చేసింది. భారత విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్‌ జైస్వాల్ స్పందించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌ సహించదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం విషయంలో ఎప్పటికీ రాజీ ఉండదని స్పష్టం చేశారు.