Malla Reddy: అంతటా తెలుగోళ్లే ఏలుతారు.. హైదరాబాద్‌కు రావాల్సిందే

రణ్‌బీర్ కపూర్‌పై మంత్రి మల్లారెడ్డి సంచలనం

Courtesy: Twitter

Share:

Malla Reddy: యానిమల్(Animal) ప్రీ రిలీజ్ ఈవెంట్లు మల్లారెడ్డి(Malla Reddy) బాలీవుడ్ (Bollywood) గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ పని అయిపోయిందని చెబుతూ రణబీర్ కపూర్(Ranbir Kapoor)ని హైదరాబాద్ కి వచ్చేయమని చెప్పడం హిందీ సినీ ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేస్తోంది.

రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రాబోతున్న యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్(Free release event) ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) లాంటి వారు చీఫ్ గెస్ట్లుగా రావడం విశేషం. కాగా వారిద్దరితో పాటు ఈ ఈవెంట్ కి మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

రణబీర్ కపూర్(Ranbir Kapoor) ని ఉద్దేశించి మాట్లాడుతూ మల్లారెడ్డి..“రణబీర్ కపూర్(Ranbir Kapoor) వినండి.. రానున్న ఐదు సంవత్సరాలలో తెలుగువారు హాలీవుడ్.. బాలీవుడ్ (Bollywood)ని ఏలుతారు. ఇక బాలీవుడ్..ముంబై పని అయ్యిపోయింది. బెంగళూరు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్. కాబట్టి మీరు హైదరాబాద్(Hyderabad) వచ్చేయండి. హైదరాబాద్(Hyderabad) దేశంలోని గొప్పదిగా ఎదుగుతుంది. మా దగ్గర సందీప్ వంగా, దిల్ రాజు, రాజమౌళి వంటి తెలివైన వారు ఉన్నారు. పుష్ప సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మీకు తెలుసు. ప్రస్తుతం తెలుగువారి అశ్వమేధ యాగం జరుగుతుంది” అంటూ షాకింగ్  కామెంట్స్ చేశారు మల్లారెడ్డి.

కాగా ఈ కామెంట్లపై బాలీవుడ్(Bollywood) వారు  తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా(Social Media) వేడుకగా హిందీ సినీ ప్రేమికులు మల్లారెడ్డి కామెంట్స్ పై విమర్శలు కురిపిస్తున్నారు.  బాలీవుడ్(Bollywood) వివాదాస్పద క్రిటిక్ కేఆర్‌కే కూడా ఈ విషయం గురించి ఒక ట్వీట్ చేశారు. “సార్ మీరు భ్రమపడుతున్నారు. మీ తెలుగు స్టార్స్ బాలీవుడ్ ఫిలిమ్స్ లో విలన్స్ గా నటిస్తున్నారు. వారూ హీరోలు కాదు” అంటూ ట్వీట్ చేశారు. మరికొందరేమో మల్లారెడ్డి(Malla Reddy) తాగేసి స్టేజి పైన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హిందీ సినిమా గొప్పదా తెలుగు సినిమా గొప్పదా అనే డిబేట్ సోషల్ మీడియాలో ఎంతో కాలంగా జరుగుతూ ఉండగా.. మల్లారెడ్డి కామెంట్స్ వాటికి మరింత ఆర్జ్యం పోసాయి. 

అయితే మల్లారెడ్డి (Malla Reddy)మాట్లాడిన వాటిలో కొన్ని నిజాలు లేకపోలేదు కానీ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాదు(Hyderabad) వచ్చిన ఒక టాప్ బాలీవుడ్ హీరోని మీ బాలీవుడ్ నథింగ్, మేమే తోపులం, మా తర్వాతే ఎవరైనా, మీరు కూడా ఇక్కడకి రావాల్సిందే అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మల్లా రెడ్డి స్పీచ్ విని తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry) సినిమాల పట్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే బాలీవుడ్ (Bollywood) అభిమానులకి కోపం రావడం చాలా సహజం. దీంతో అభిమానుల స్పందన కూడా ఇప్పుడు కాస్త నెగటివ్ గానే కనిపిస్తోంది. నిజానికి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మల్లా రెడ్డికి ఎటువంటి దురుద్దేశాలు లేకపోవచ్చు, కానీ ఇలా రణబీర్ (Ranbir Kapoor) పేరు ప్రస్తావిస్తూ తెలుగోళ్లు తోపులు, మిగతావారంతా డమ్మీ అని అర్ధం వచ్చేలా చేసిన ఈ స్పీచ్ లేనిపోని ప్రాంతీయ వాదాలకు దారి తీస్తుంది. ఒకరకంగా నిజమైన పాన్-ఇండియా (Pan India) చిత్రాలను రూపొందించడానికి భారీ ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీ వాళ్లంతా నార్త్ లేదు సౌత్ లేదు ఇప్పుడు ఇండియన్ సినిమా ఒక్కటే అంటుంటే, మల్లా రెడ్డి చాలా డిఫరెంట్ గా సౌత్, అందులోనూ మన తెలుగోళ్లు తోపులు అని మాట్లాడడం నష్టం కలిగించే అంశమే. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రేక్షకులు మల్లారెడ్డిపై (Malla Reddy) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.