Kashi: కాశీలో ఘోర ప్రమాదం.. కూలిన సొరంగం

లోపలికి ఆక్సిజన్ సప్లై చేసిన అధికారులు

Courtesy: Twitter

Share:

Kashi: దేవ భూమి అని పిలిచే కాశీ (Kashi)లో దారుణం జరిగింది. పండుగ పూట దేశం మొత్తం సంతోషంలో ఉండగా.. ఈ ఘటన (Incident) సంభవించింది. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ (Shock) అయింది. ఆదివారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్‌ లోని ఉత్తర కాశీ (Kashi)లో జాతీయ రహదారి పై నిర్మాణంలో ఉన్న సొరంగం (Tunnel) యొక్క కొంత భాగం కూలిపోవడంతో అందులో 40 మంది కార్మికులు (Labour) శిధిలాల కింద చిక్కుకున్నారు. సుమారు 40 నుంచి 41 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. 

ఆక్సిజన్ సరఫరా చేస్తున్న అధికారులు 

ఈ ఘటన (Incident) జరగడంతోనే అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ అక్కడ అధికారులు (Officers) వెంటనే రియాక్ట్ అయ్యారు. శిధిలాల ద్వారా ఆక్సిజన్ (Oxygen) సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు అక్కడ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ప్రాణాపాయం (Life Span) తగ్గింది. చిక్కుకున్న కార్మికులకు (Labour) టన్నెల్‌ (Tunnel) లోని బ్లాక్ చేయబడిన భాగంలో ఆక్సిజన్‌ (Oxygen)ను పంపింగ్ చేస్తున్న ట్యూబ్ ద్వారా సందేశం (Message) పంపామని, వారి భద్రత కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని హామీ ఇచ్చామని రాథోడ్ తెలిపారు. మెషీన్లు (Machines) నిరంతరం శిధిలాలను తొలగిస్తున్నందున పై నుంచి మరిన్ని శిథిలాలు వస్తున్నాయని ఆయన మీడియాకు తెలిపారు. 

ఇంకా ఏం స్పందన రాలే.. 

తాము లోపలికి మెస్సేజ్ (Message) పంపామని.. కానీ లోపలి నుంచి ఎటువంటి స్పందన (Reaction) రాలేదని ఆ అధికారి తెలిపారు. రాత్రిపూట కూడా రెస్క్యూ ఆపరేషన్ (Operation) కొనసాగింది. ఇందుకు సంబంధించిన వివరాాలను ఉత్తరకాశీ విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ తెలిపారు.నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన సొరంగంలో (Tunnel) 150 మీటర్ల పొడవు గల భాగం కూలిపోవడంతో తెల్లవారుజామున 4 గంటలకు ఈ విషాద సంఘటన జరిగింది. దేశం మొత్తందీపావళి (Deepavali) వేడుకలు చేసుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా ఈ ఘోరం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ (Shock) అయ్యారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక దళం మరియు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  ఉద్యోగులను రెస్క్యూ ఆపరేషన్‌ ల కోసం రప్పించారు.

సమాచారం అందింది అప్పుడే.. 

ఉత్తర కాశీ (Kashi) సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఈ టన్నెల్ (Tunnel) ఉదయం కూలిపోయింది. కానీ సమాచారం లోపం అక్కడ కొట్టొచ్చినట్లు కనిపించింది. జాతీయ రహదారిపై సొరంగంలో కొంత భాగం కూలిపోయిందని ఉదయం 9.15 గంటలకు మాకు సమాచారం (Information) అందిందని ఎస్ డీ ఆర్ ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సమాచారం అందిన వెంటనే మేము మా ప్రతినిధులను అక్కడికి పంపామని వెల్లడించారు. కమాండింగ్ ఆఫీసర్ నమన్ నరులా మరియు అసిస్టెంట్ కమాండెంట్ జాదవ్ వైభవ్ నేతృత్వంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మరియు ITBP బృందాలు కూడా సహాయక చర్యలలో సహాయం చేయడానికి తరువాత రంగంలోకి దిగాయి. ఈ బృందాలన్నీ సహాయక చర్యల్లో పాల్గొనడంతో అక్కడ చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

ప్రధానితో మాట్లాడా.. 

ఈ ప్రమాదం యావత్ దేశాన్ని ఒక్క సారిగా షాక్ (Shock) కు గురిచేసింది. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) స్పందించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడ మెరుగైన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన మీద తాను ప్రధాని నరేంద్ర మోదీ తో (Modi) కూడా మాట్లాడానని, ఘటనపై సమగ్ర సమాచారం, సహాయ చర్యలకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నానని మీడియాకు వివరించారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌ (Operation) ల గురించి ప్రధానికి సమగ్ర సమాచారం అందించబడిందని అధికారులు తెలిపారు. 

ఈ దుర్ఘటన (Incident)ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాన మంత్రి హామీ ఇచ్చినట్లు సీఎం (CM) తెలియజేశారు. సహాయ మరియు రెస్క్యూ ఆపరేషన్‌ లలో సహకరించాలని కేంద్ర ఏజెన్సీలను భారత ప్రభుత్వం (Indian Government) ఆదేశించింది. ఈ విషయాలను సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్విటర్ (ఎక్స్)లో షేర్ చేశారు. ఈ ప్రమాదం మీద అనేక మంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇలా జరగడం దురదృష్టం అని అంతా కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందని లేకపోతే అమాయకులైన అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారని వారు వెల్లడించారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఇది మానవ తప్పిదమా? లేక ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనా అని తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు (Detailed Enquiry) చేయాలని వారు కోరారు.