'పరశురాముడు వచ్చినాడురో' జనసేన ఎన్నికల సాంగ్ విడుదల.. చూడండి!

Janasena: ఇటీవలి కాలంలో రాజకీయ  పార్టీలకు ఎన్నికల్లో ప్రచార పాటలే ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి. వినూత్న రీతిలో కొత్త కొత్త పాటలను క్రియేట్ చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Courtesy: Top Indian News

Share:

ఇటీవలి కాలంలో రాజకీయ  పార్టీలకు ఎన్నికల్లో ప్రచార పాటలే ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి. వినూత్న రీతిలో కొత్త కొత్త పాటలను క్రియేట్ చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే సీన్ కనిపించింది. పార్టీలన్నీ పోటీ పడి పాటలను విడుదల చేశాయి. కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్బంగా ఎన్నికల సందడి కనిపిస్తోంది. పండగ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పోటీ పడి ఎన్నికల సాంగ్ లను రిలీజ్ చేస్తున్నాయి.  ఇటీవల వైఎస్సార్ సీపీ ఎన్నికల సాంగ్ ను రిలీజ్ చేయగా.. తాజాగా జనసేన(Janasena) పార్టీ కూడా తమ ప్రచార అస్త్రంగా పరశురాముడు వచ్చినడు అనే ఎన్నికల పాటను విడుదల చేసింది. 

ఈ తరుణంలో ‘సంక్రాంతి సంబరాల్లో జనసేన పల్లె పాట’ అంటూ జనసేన కొత్త పాట విడుదల చేసింది. ‘‘పరశురాముడు వచ్చినాడురో సూడన్న, ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న.. సింహమయి కదిలినాడురో మా యన్న, గాజు గ్లాసుకు ఓటు వెయ్యరో పెద్దన్న !!’’ అంటూ సాగే ప్రచార గీతం సాగింది.   

రాబోయే ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో టిడిపి జనసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలలో విజయం సాధించేలా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ఇప్పటి నుండే శ్రీకారం చుట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న పవన్ కళ్యాణ్ బన్నీ వాసును జనసేన ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించారు. గత ఎన్నికల సమయంలో రావాలి జగన్ కావాలి జగన్ అంటూ వైసీపీ చేసిన పాట దుమ్ము రేపగా ఈసారి ఏ పార్టీకి సంబంధించిన పాట ఎక్కువగా ప్రజల్లోకి వెళుతుంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొత్తంగా సంక్రాంతి పండుగకు కార్యకర్తలలో జోష్ నింపేలా పాటలు రిలీజ్ చేస్తున్నారు.

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాటలే ప్రధాన అస్త్రాలుగా పార్టీలు పోటీ పడిన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలో ఉన్న భారాస పార్టీ 'నడుం నడుం కట్టవే రామక్క' అనే పాటను తయారు చేయించి కార్యకర్తల్లో జోష్ నింపింది. మరోవైపు 'మూడు రంగుల జెండా పట్టి' అనే రేవంత్ రెడ్డి సాంగ్ కాంగ్రెస్ కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చి పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 'తెలంగాణ గడ్డ మీద కమలం జెండా' అనే పాట బాగా ప్రచారం అయింది.