NASA: చంద్రయాన్-3తో ఇస్రోపై గౌరవం మరింత పెరిగింది..

వచ్చే ఏడాది నిసార్ ప్రయోగం

Courtesy: Twitter

Share:

NASA: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో కలిసి సింథటిక్‌ ఎపర్చార్‌ రాడార్‌ (NISAR) మిషన్‌పై కలిసి పని చేస్తున్నట్లు నాసా(NASA)కు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లాబోరేటరి (JPL) డైరెక్టర్‌ లారీ లెషిన్‌(Larry Leshin) తెలిపారు. మిషన్‌ను 2024లో ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. 

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో కలిసి సింథటిక్‌ ఎపర్చార్‌ రాడార్‌ (NISAR) మిషన్‌పై కలిసి పని చేస్తున్నట్లు నాసా(NASA)కు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లాబోరేటరి (JPL) డైరెక్టర్‌ లారీ లెషిన్‌(Larry Leshin) తెలిపారు. మిషన్‌ను 2024లో ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆమె జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మిషన్‌పై ఇస్రో(ISRO)తో కలిసి సంయుక్తంగా కలిసి పని చేస్తుండడంపై సంతోషిస్తున్నామన్నారు. చంద్రయాన్‌-3 మిషన్‌(Chandrayaan-3 Mission) తర్వాత భారత్‌ అంతరిక్ష కార్యక్రమాలపై మరింత గౌరవం పెరిగిందన్నారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనల భవిష్యత్‌ ప్రణాళికలు తమను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని తెలిపారు. 

 నిసార్‌ మిషన్‌(NISAR Mission)పై స్పందిస్తూ.. వాతావరణ మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి భూమి ఉపరితలం ఎలా మారుతుందో అవగాహన చాలా ముఖ్యమన్నారు. ఉపరితలంలో చిన్న చిన్న మార్పులను నిసార్ ద్వారా అర్థం చేసుకోవచ్చని.. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే మంచు ఫలకలు కరగడం, అడవులు, చిత్తడినేలలు, భూకంపాలు, అగ్నిపర్వతాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. 

భూ ఉపరితలం(Earth's surface)పై జరిగే మార్పులను వీక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు మార్పుల వెనుక ఉన్న భౌతికతను అర్థం చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఏం జరుగుబోతుందో అంచనా చేయవచ్చని పేర్కొన్నారు. నిసార్‌పై ఇస్రో(ISRO), నాసా(NASA) కలిసి పని చేస్తుండడంపై స్పందిస్తూ.. అంతరిక్ష పరిశోధన చరిత్రలో అతిపెద్ద సహకారమన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎన్‌ఐఎస్‌ఎఆర్‌(NISAR) అనేది ఇస్రో-నాసా (ISRO-NASA) అభివృద్ధి చేసిన తక్కువ భూ కక్ష్య అబ్జర్వేటరీ(Earth Orbit Observatory). ఇది భూమిని 12 రోజుల్లో మ్యాప్‌చేస్తుంది. పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్రమట్టం పెరుగుదల, భూగర్భ జల స్థాయిలు, సహజ ప్రమాదాలలో మార్పులను అర్థం చేసుకోవడానికి స్థిరమైన డేటాను అందిస్తుంది. భూకంపాలు(Earthquakes), సునామీలు(Tsunamis), అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటంతో సహా ప్రకృతి విపత్తుల ముప్పును నిజ సమయంలో అంచనా వేస్తుంది. భూమి ఉపరితలం(Earth's surface)పై జరిగే మార్పులను వీక్షించడం వల్ల శాస్త్రవేత్తలు మార్పు వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకుంటారని, భవిష్యత్తు పరిణామాలపై కచ్చితమైన అంచనాకు ఎన్‌ఐఎస్‌ఎఆర్‌ సహాయపడుతుందని నాసా అధికారి తెలిపారు.

సహకారం, చర్చలపై ఉన్నత స్థాయి నాయకత్వం చూసుకుంటుందన్న ఆమె.. 30-40 మంది ఇంజినీర్లు బెంగళూరులో ఇస్రో(ISRO) సహోద్యోగులతో తొమ్మిది నెలలుగా భుజం భుజం కలిపి పని చేస్తున్నామన్నారు. ఇది ఎంతో ఉత్సాహకరంగా ఉందన్నారు. అద్భుతమైన సహకారం, మంచి టీమ్‌వర్క్‌తో పాటు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, బృందం చాలా బాగా కలిసి పని చేస్తోందన్నారు. నిసార్‌ శాటిలైట్‌(Nisar Satellite) భూమిపై ప్రతి భాగాన్ని కనీసం 12 రోజులకోసారి పర్యవేక్షిస్తుంది. 

ఎర్త్‌ సైన్స్‌(Earth Science)కు మించి భవిష్యత్తులో అన్ని రకాల విషయాలపై కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని లెషిన్‌ పేర్కొన్నారు. అన్ని రకాల విషయాల్లో కలిసి పని చేయానికి ఎదురుచూస్తున్నామని, ఇందులో చంద్రుడు, అంగారక గ్రహానికి సంబంధించిన భవిష్యత్‌ మిషన్లు ఉన్నాయని, అంతరిక్షంలో సక్సెస్‌ సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయని ఇస్రో (ISRO) భాగస్వామ్యం నుంచి మేము కొత్త విషయాన్ని తెలుసుకున్నాం. ఒకరి నుండి మరొకరం నేర్చుకుంటున్నాము. ఇస్రోలోని మా సహచరులతో మాట్లాడితే ఈ విషయం మీకే అర్థమవుతుంది. కొత్త ఆలోచనలు కలిసి రావడాన్ని ఇన్నోవేషన్‌ ఇష్టపడుతుంది. చంద్రయాన్‌-3 మిషన్‌(Chandrayaan-3 Mission) చారిత్రాత్మక విజయం తర్వాత భారతదేశ అంతరిక్ష కార్యక్రమం పట్ల గౌరవం పెరిగింది అని జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ డైరెక్టర్‌ తెలిపారు.

Tags :