High Court: కుక్కకాటు.. ఒక్కో 'పంటి గాటు'కు రూ.10 వేల పరిహారం

హైకోర్టు ఆసక్తికర తీర్పు..

Courtesy: Pexels

Share:

High Court: వీధి కుక్కలు(Stray dogs), ఇతర జంతువుల దాడి కేసులో బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పంజాబ్​-హరియాణా హైకోర్టు(Punjab-Haryana High Court) స్పష్టం చేసింది. కుక్కకాటు(Dog bite)కు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే రూ.20 వేల పరిహారం అందించాలని పంజాబ్‌, హరియాణాతో పాటు చండీగఢ్‌(Chandigarh) పాలనా విభాగాలను ఆదేశించింది. కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో.. అంతే ప్ర‌మాద‌క‌రంగా కూడా. కుక్క‌ల దాడి(Dog attack)లో మనుషులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు చూస్తూనే ఉన్నాం.

మ‌న దేశంలో ఏటా 2 కోట్ల మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఇందులో 18 నుంచి 20 వేల మంది రేబిస్ వైరస్ (Rabies virus) బారినపడి చనిపోతున్నారు. అంతే కాదు దేశంలో రోజు ఎక్కడో ఒక చోట వీధి కుక్కల దాడిలో చిన్నారులు బలి అవుతున్న వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్(Director Parag Desai) (49) అక్టోబర్‌లో వీధి కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. 

వీధి కుక్కలు(Stray dogs) ఆయన్ని వెంబడించగా అత‌ను అదుపు త‌ప్పి కింద‌పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆస్ప‌త్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియా(Social media)లో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్దఎత్తున చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో శునకం దాడికి సంబంధించిన కేసులో పంజాబ్‌-హరియాణా హైకోర్టు(Punjab-Haryana High Court) ఆసక్తికర తీర్పు వెలువరించింది. 

వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసు(Animal attack case)లో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కుక్కకాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10 వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే (0.2 సెం.మీ మేర కోతపడినట్లయితే) రూ.20 వేల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీధుల్లో ఉండే మూగ జీవాల దాడులకు సంబంధించి దాఖలైన 193 పిటిషన్లను పంజాబ్‌-హరియాణా హైకోర్టు(Punjab-Haryana High Court) విచారించి, తీర్పు ఇచ్చింది.

 'కుక్కల దాడులకు(Dog attacks) సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వీటిని సంబంధిత ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది' అని పంజాబ్‌-హరియాణా హైకోర్టు (Punjab-Haryana High Court) ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఆవులు, ఎద్దులు, గాడిదలు, శునకాలు, గేదెలతో పాటు అడవి, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని పంజాబ్‌, హరియాణాతో పాటు చండీగఢ్‌ పాలనా విభాగాలకు సూచించింది. క్లెయిమ్‌ దాఖలు(Filing of claim) చేసిన నాలుగు నెలల వ్యవధిలో పరిహారాన్ని ఆమోదించాలని తెలిపింది.

రోడ్లపై విచ్చలవిడిగా సంచరించే పశువులు, ఇతర జంతువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు పరిహారం చెల్లించడానికి కూడా ఒక కమిటీని వేయాలని పంజాబ్‌-హరియాణా హైకోర్టు(Punjab-Haryana High Court) ఆదేశించింది. కుక్కకాటు(Dog Bite) ఘటనలు నానాటికీ పెరుగుతున్నాయని కోర్టు పేర్కొంది. చాలా మంది చనిపోయారు. దీన్ని నియంత్రించకపోతే కేసులు మరింత పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలను రూపొందించాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ మేరకు పంజాబ్‌, హరియాణాతోపాటు చండీగఢ్‌ పాలనా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ కమిటీలో సంబంధిత జిల్లా డిప్యూటీ కమిషనర్​, డీఎస్​పీ, ఎస్​డీఎం, డీటీఓ, చీఫ్​ మెడికల్ ఆఫీసర్​ తదితరులు ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా కుక్క కాటు సంఘటనలు వేగంగా పెరిగాయి. పంజాబ్ ఆరోగ్య శాఖ(Punjab Health Department) ప్రకారం.. గత ఐదేళ్లలో 6,50,904 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,65,119 మంది గాయపడ్డారు. అయితే చండీగఢ్‌లో కుక్కకాటు 70 శాతం తగ్గింది. అదే సమయంలో హర్యానా డేటా ప్రకారం, ఒక దశాబ్దంలో 11 లక్షలకు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.