Delhi: హస్తినలో దారుణం.. బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదని 60 కత్తిపోట్లు

రూ.350 కోసం బాలుడి దారుణ హత్య..

Courtesy: Twitter

Share:

Delhi: మాయమైపోతున్నడమ్మా మనిషిన్నవాడు... అనే ఈ ప‌దం అప్పుడ‌ప్పుడూ నిజ‌మ‌వుతూ ఉంటుంది. స‌మాజంలో రోజురోజుకూ మాన‌వ‌త్వం అనేది క‌నుమ‌రుగైపోతుంది. సాటి మ‌నిషి ప‌ట్ల క‌నీస మాన‌వ‌త్వం చూపించ‌కుండా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. చిన్నచిన్న విష‌యాల‌కే కోపాలు తెచ్చుకుని చంపేసుకుంటున్నారు లేదా చ‌స్తున్నారు.. ఇలాంటి వార్త‌ల‌ను నిత్యం మ‌నం ఎక్క‌డో ఒక చోట వింటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీ(Delhi)లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. బిర్యానికి (Biryani) డ‌బ్బులు ఇవ్వ‌లేని ఓ ప‌దిహేడేళ్ల కుర్రాడిని ఓ యువ‌కుడు ఏకంగా 60 సార్లు క‌త్తితో పొడిచి మ‌రీ చంపేసాడు(Murder). ఆ త‌ర్వాత ఆ బాడీపై ఏకంగా డ్యాన్స్ (Dance)చేశాడు. 

ఈ దారుణం మ‌రెక్క‌డో కాదు దేశ రాజ‌ధాని ఢిల్లీ(Delhi)లో చోటు చేసుకుంది. బిర్యాని(Biryani) తినేందుకు 350 రూపాయ‌లు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ కుర్రాడు అత్యంత దారుణంగా పొడిచి చంపేసాడు. ఆ యువకుని మెడపై, ఛాతీపై ఏకంగా 60 సార్లు పొడిచాడు. ఆ త‌ర్వాత నిర్జీవంగా పడి ఉన్నఅతనిపై డ్యాన్స్‌(Dance) చేశాడు. డబ్బులు తీసుకున్న అనంతరం నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాడి సమయంలో నిందితుడు మద్యం(Alcohol) సేవించి, మత్తులో ఉన్నాడు. మరణించిన బాలుడిని జఫ్రాబాద్(Jaffrabad) వాసిగా గుర్తించారు.  బాధితుడు ఢిల్లీలోని(Delhi) జాఫ్రాబాద్‌(Jaffrabad) ప్రాంతంలో తన తల్లితో కలిసి ఉండేవాడు. అత‌ను రోజువారీ కూలీగా ప‌నిచేసేవాడు. రోజూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే కానీ ఆ యువ‌కుడి పొట్ట నిండ‌దు. అలాంటి యువ‌కుడిపై దాడి చేశాడు మ‌రో యువ‌కుడు. కూలీ చేసుకునే పూట గడుపుకునే ఆ యువ‌కుడు రోజు వారిలాగే మంగళవారం రాత్రి జనతా మజ్దూర్‌ (Janata Mazdoor) కాలనీ మీదుగా వెళ్లాడు. ఈ క్రమంలో అటుగా వెళ్లే ఓ ప‌ద‌హారేళ్ల కుర్రాడు అతడిని అడ్డుకున్నాడు. బిర్యానీ(Biryani) తినడానికి 350 రూపాయ‌లు కావాలి ఇవ్వూ అంటూ ఆ యువకుడిని అడిగాడు. 

దానికి ఆ కుర్రాడు తన వద్ద అంత డబ్బు లేదని చెప్పాడు. దాంతో కోపానికి గురైన ఆ యువ‌కుడు వెంట‌నే అతనిని కొట్టాడు. దీంతో ఒక్క‌సారిగా కింద‌ ప‌డి పోయాడు బాధితుడు. ఆవేశంతో నిందితుడు(Accused) ప‌డిపోయిన బాధితుడిపై కూర్చుని మెడ‌, ఛాతీపై విచక్షణారహితంగా కత్తితో 60 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్క‌డిక్క‌డే చనిపోయాడు. నిందితుడు అంత‌టితో ఆగ‌కుండా అతని బాడీపై డ్యాన్స్‌(Dance) చేశాడు. అయితే, ఈ విష‌యాన్ని గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

 అయితే అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఇదంతా ఆ ప్ర‌దేశంలో ఉన్న‌ సీసీటీవీ ఫుటేజీలో(CCTV footage) రికార్డయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఆ యువ‌కుడిపై కేసు న‌మోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మజ్దూర్ కాలనీ (Mazdoor Colony) సమీపంలో మంగళవారం రాత్రి.. ఈ ఘటన చోట చేసుకుందని  అయితే, ఆ నిందితుడు కూడా అదే కాల‌నీకి చెందిన‌ వాడ‌ని, కానీ, వారిద్ద‌రికి ముఖ ప‌రిచ‌యం కూడా లేద‌ని పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడిపై గతంలోనూ ఓ హత్య కేసు (Murder Case) ఉన్నదని, నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు వివ‌రించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు(Police Case) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన ఆ కుర్రాడు కూడా జఫ్రాబాద్‌లోని (Jaffrabad) మురికి వాడలో నివాసం ఉంటాడని, అతడు మధ్యలోనే పాఠశాల విద్యను ఆపేశాడని చెప్పారు. ఇద్దరు ఒకరికొకరు పరిచయం లేదు. గతంలోనూ అతడిపై ఓ హత్య కేసు (Murder Case) ఉందని పోలీసులు తెలిపారు.