అయోధ్య రామాలయానికి 42 భారీ బంగారు తలుపులు.. 22న యూపీలో స్కూళ్లకు సెలవు

Ayodhya: అయోధ్యలో రామమందిరం శంకుస్థాపనకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో, అక్కడ ఏర్పాటవుతున్న అధునాతన మౌలిక సదుపాయాల గురించి అనేక చిత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

Courtesy: Top Indian News

Share:

లక్నో: అయోధ్యలో రామమందిరం శంకుస్థాపనకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో, అక్కడ ఏర్పాటవుతున్న అధునాతన మౌలిక సదుపాయాల గురించి అనేక చిత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు, ఆలయంలో 12 అడుగుల ఎత్తు మరియు 8 అడుగుల వెడల్పు ఉన్న మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు.

గర్భగుడి పై అంతస్తులో ఈ భారీ బంగారు ద్వారం ఏర్పాటు చేయబడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు అక్కడ అమర్చబడతాయని సమాచారం. రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయగా, వాటిలో 42 తలుపులకి బంగారు పూత పూయనున్నట్లు సీఎంఓ తెలిపింది. రామమందిరంలో ప్రతిష్ఠ కోసం 5,500 కిలోల భారీ ఇత్తడి ధ్వజస్తంభం ఇప్పటికే గుజరాత్‌ నుంచి సోమవారం అయోధ్యకు చేరుకొంది.

గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని తీసుకురానున్న ప్రధాని
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేళ రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పూజ మండపం నుంచి గర్భగుడికి 25 సెకన్లలో మోదీ చేరుకుంటారు. కాశీకి చెందిన పండిట్‌ లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 17న అయోధ్యలో నిర్వహించతలపెట్టిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపును అధిక రద్దీ ఆలోచనతో రద్దు చేశారు. 

మకర సంక్రాంతి నుంచి జనవరి 22 వరకు అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ‘ఎక్స్‌’లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రధానితోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుందన్నారు. 

జనవరి 22న అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్?
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22న యూపీ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు ఉండవని తెలిపారు.