Baby Whale: తీరానికి కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం పిల్ల

40 గంటల తర్వాత మళ్లీ సముద్రంలోకి..

Courtesy: Pexels

Share:

Baby Whale: ఇప్పుడు వస్తున్న వాతావరణ మార్పుల కారణంగా చాలా జీవరాసులు విలువల్లాడిపోతున్న క్రమం కనిపిస్తోంది. మధ్యకాలంలో చాలా చేపలు, పెద్ద పెద్ద సముద్ర (Sea) జీవరాసులు సముద్ర (Sea) తీరానికి (Shore) కొట్టుకొచ్చిన సంఘటనలు చూసే ఉంటాం. ముఖ్యంగా కలుషిత నీరు సముద్రం (Sea)లో కలవడం వల్ల నీటికి తాళలేక చాలా జలరాశులు తట్టుకోలేక చనిపోయి తీరానికి (Shore) కొట్టుకొస్తున్నాయి. ఒక్కో సందర్భంలో, సముద్రం (Sea)లోని భారీ తుఫాన్లు ఏర్పడడం వల్ల కూడా సముద్రం (Sea)లో జీవరాసులు తీరానికి (Shore) కొట్టుకొస్తూ ఉంటాయి. ఇలాంటి ఒక సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఒక భారీ తిమింగలం పిల్ల (Baby Whale) తీరానికి (Shore) కొట్టుకు వచ్చింది.

తీరానికి కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం పిల్ల:

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని గణపతిపూలే తీరానికి (Shore) కొట్టుకు వచ్చిన 35 అడుగుల పొడవాటి తిమింగలం పిల్ల (Baby Whale)ను బుధవారం 40 గంటల ప్రయత్నాల తర్వాత తిరిగి సముద్రం (Sea)లోకి వదిలిపెట్టడం, పర్యాటక ప్రదేశంలో సందర్శకులను మరియు స్థానికులను ఆనందపరిచిందని అధికారులు తెలిపారు. దాదాపు 4 టన్నుల బరువున్న తిమింగలం పిల్ల (Baby Whale) సోమవారం తీరానికి (Shore) చేరుకోగా, అల్పపీడనం ఉండటంతో బీచ్ సమీపంలోని ఇసుకలో చిక్కుకుపోయింది.

సముద్ర (Sea) తీరంలో ఉన్న చిన్నపాటి గుంటలో ఉన్న నీటిలో.. భారీ తిమింగలం పిల్ల (Baby Whale) పోరాడుతున్నట్లు గుర్తించిన ప్రయాణికులు మరియు స్థానికులు రత్నగిరి పోలీసులు మరియు కోస్ట్ గార్డ్తో సహా అధికారులను అప్రమత్తం చేశారు, ఫలితంగా వెంటనే రెస్క్యూ ఆపరేషన్ (Operation) జరిగింది. అగ్నిమాపక దళం, పోలీసులు మరియు స్థానికులు తిమింగలం పిల్ల (Baby Whale)ను సముద్రం (Sea)లోకి వెనక్కి సముద్రం (Sea)లోకి పంపించేందుకు ప్రారంభంలో జరిగిన కొన్ని ప్రయత్నాలు విజయవంతం కాలేదు, అయితే తర్వాత తిమింగలం సంబంధించి ఆరోగ్య పరిస్థితి విషయంపైన, మనుగడ విషయంపైన అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అయితే తర్వాత నుంచి తిమింగలం తోకని కాస్త కదుపుతూ, తిమింగలానికి కావాల్సిన నీటితో హైడ్రేట్గా ఉంచడానికి సముద్రపు (Sea) నీటిని పోయడం ప్రారంభించారు. దానిని రక్షించడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించడానికి పత్తితో కప్పారని, అధికారి తెలిపారు. వెటర్నరీ వైద్యుల బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని తిమింగలం పిల్ల (Baby Whale)ను బతికించేందుకు ద్రవాన్ని అందించింది. తీరానికి (Shore) కొట్టుకు వచ్చిన భారీ తిమింగలాన్ని బెల్ట్తో కట్టి లాగడం ద్వారా నెట్టడానికి రెస్క్యూ ఆపరేషన్ (Operation)లో భాగంగా ప్రయత్నించారు, కానీ దాని తోక దగ్గర గాయాలు ఏర్పడడంతో అధికారులు పద్ధతిని విరమించుకున్నారు.

మరో ప్రయత్నం:

ఇంతలో, తిమింగలం పిల్ల (Baby Whale)కు సంబంధించిన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి సముద్ర (Sea) నిపుణులను కూడా నియమించినట్లు ఆయన చెప్పారు.

మంగళవారం రాత్రి, ఒక టగ్బోట్ను తీసుకువచ్చి, కొత్త రెస్క్యూ ప్లాన్ ప్రకారం తిమింగలం పిల్ల (Baby Whale)ను ఒక నెట్టులో పెట్టడం జరిగింది. అలల ముఖ్యంగా ఎక్కువగా ఉన్న సమయంలో అధికారులు, స్థానికులు మళ్లీ తిమింగలం పిల్ల (Baby Whale)ను నీటిలోకి నెట్టడం ప్రారంభించారు. తిమింగలం పిల్ల (Baby Whale) కూడా లోతైన నీటి వైపు జారిపోయే ప్రయత్నాలు చేయడం చూసి వారు మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరణ పొందారని అధికారి తెలిపారు. చాలా గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేసిన తరువాత, బుధవారం తెల్లవారుజామున టగ్బోట్ ద్వారా తిమింగలం పిల్ల (Baby Whale)ను 7 నుండి 8 నాటికల్ మైళ్ల దూరం సముద్రం (Sea)లోకి లాగినట్లు అధికారి తెలిపారు. అయితే తిరిగి సముద్రం (Sea)లోకి వెళ్తున్నట్లు గమనించిన తిమింగలం పిల్ల (Baby Whale), వల పగలగొట్టి తనంతట తానుగా ఈదడం ప్రారంభించిందని.. అది మరింత లోతుకు ఈదుకుంటూ సముద్రం (Sea)లోకి వెళ్లిపోయి, కనిపించనంత దూరానికి ఈదుకుంటూ వెళ్లిపోయినట్లు రత్నగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ధనజయ్ కులకర్ణి తెలిపారు.

సముద్ర జీవులను రక్షించడం చాలా ముఖ్యమైన పనని.. జిల్లా పరిపాలన, కోస్ట్ గార్డ్, ఒక ప్రైవేట్ కంపెనీ, స్థానిక గ్రామస్తులు మరియు సముద్ర నిపుణులతో సహా చాలా మంది తిమింగలం పిల్ల (Baby Whale)లు రక్షించడానికి పోలీసులతో కలిసి ఆపరేషన్ (Operation)‌లో పాల్గొన్నారు అని ఆయన చెప్పారు. సాధారణంగా, తిమింగలం పిల్ల (Baby Whale) పెద్ద జీవులు నిజానికి 35-40 గంటలకు పైగా ఒడ్డులోన్ చిక్కుకున్న తర్వాత, మనుగడకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటాయని, అయితే తిమింగలం పిల్ల (Baby Whale) ఎవరు ఊహించని విధంగా బ్రతకడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన చెప్పారు.

ఇప్పుడు తింగలం పిల్ల మళ్లీ తన సహజ జీవనాన్ని గడిపేందుకు మరొక అవకాశం కల్పించుకుని, సముద్రం (Sea)లోకి ఈదుకుంటూ వెళ్లిపోవడం, నిజంగా సముద్ర తీరంలో ఆపరేషన్ (Operation) లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంతోషంగా అనిపించినట్లు వెల్లడించారు.