Kamareddy: కామారెడ్డిలో జోరందుకున్న త్రిముఖ పోటీ

కేసిఆర్ గెలుపు అనుకున్నంత సులువేనా ?

Courtesy: Canva

Share:

Kamareddy: ఒకప్పుడు కీలక స్థానాల జాబితా ధరిదాపుల్లో కూడా కనిపించని కామారెడ్డి నియోజకవర్గానికి (Kamareddy Constituency) ఉన్నట్లుండి ఊహించనంతగా హైక్వచ్చేసింది. ఎక్కడ, మూలన ఎన్నికలపై చర్చ జరిగినా కామారెడ్డి (Kamareddy) రాజకీయమే కీలకంగా మారింది. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు ఉద్దండులు తలపడుతున్న స్థానంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. గెలు పోటములు ఎలాగున్నా.. నువ్వా నేనా.. అనే స్థాయిలో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. కారణమేమైనప్పటికీ అధికార భారాస(BRS), ప్రతిపక్ష కాంగ్రెస్‌(Congress), బిజెపి(BJP) పార్టీల సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

గత కొద్ది రోజుల నుండి బిజెపి పార్టీ(BJP) నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి(Kattipalli Venkataramana Reddy) సైతం ఎవరికి తక్కువ కాదన్నట్లు కామారెడ్డి (Kamareddy) పట్టణంలో గ్రామాలలో కుల సంఘాలకు భవనాలు, భవనాలు ఉన్నచోట్ల ప్రహరీ గోడలకు, మరి కొన్ని చోట్ల గుడుల ఆవరణంలో బోరు వేయించడం, ఆర్థిక సాయం (Financial assistance) అందించడం తదితర సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. గతంలో ఎవరిని అడిగిన హస్తం పేరు చెప్పేవారు నేడు పరిస్థితి లేదు, ఎవరిని అడిగిన కారు గుర్తు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరికీ తోడు బిజెపి అభ్యర్థి రంగంలోకి రావడంతో కమలం వికసిస్తున్నది. కామారెడ్డిలో(Kamareddy) ఎవరు గెలుస్తారనేది సర్వేలు (Survey) సైతం చెప్పలేని పరిస్థితి నెలకొంది.

కామారెడ్డిలో(Kamareddy) కేసీఆర్‌ (KCR) వర్సెస్రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళినప్పటి నుంచీ రెండు ప్రధాన పార్టీల కేడర్ప్రచార వ్యూహాలతో సమాయత్తమవుతోంది. అభివృద్ధే ఆయుధమన్న పంథాతో ఇప్పటికే ప్రచారంలో దూసుకు పోతున్న భారాస (BRS) కేడర్తమదే పైచేయి అని ఎలుగెత్తి చాటు కుంటోంది. కానీ అంతకు దీటుగా బిజెపి(BRS) ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ అన్న నినాదంతో కాంగ్రెస్‌ (Congress) ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. క్రమంలో రాజకీయ నిపుణులు, విశ్లేషకుల దృష్టి అంతా కామారెడ్డి సెగ్మెంట్‌ (Kamareddy segment) పైనే కనిపిస్తోంది. గ్రామం ఎటు వైపు..? నాయకుడి పనితీరు ఎలా..? పార్టీకి ఎన్ని ట్లు..? అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.

గతానికి భిన్నంగా కామారెడ్డి నియోజకవర్గం (Kamareddy Constituency) పేరు రాష్ట్ర రాజకీయాల్లో దేశ నాయకులు సైతం పాల్గొని నిత్యం కామారెడ్డి నియోజకవర్గం చర్చగా మారుతోంది. ప్రముఖులు కామారెడ్డి నుంచి బరిలో నిలవడంతో అసెంబ్లీ సెగ్మెంట్ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అయితే, వెంకటరమణారెడ్డి (Venkataramana Reddy) అంటే చాలా ఇష్టమని, సులువుగా చేరువయ్యారని ప్రాంత ప్రజలు చెబుతుంటారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ జెడ్పిటీసి సభ్యునిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి వైదొలిగి, కొంతకాలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యొక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) చేరారు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమానిగా ఉన్నారు. అతని తండ్రి కె. రాజి రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేగా ప్రసిద్ధి చెందారు. గత మూడేళ్లుగా ఆయన బీజేపీలోనే ఉన్నారు.

అంగన్వాడీ కార్యకర్తల వేతనాల ఆలస్యాన్ని పరిష్కరించడం ద్వారా బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి (Venkataramana Reddy) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బయటి గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలనే లక్ష్యంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ (Kamareddy Master Plan) అనే ప్రణాళికకు వ్యతిరేకంగా నిరసనలకు కూడా నాయకత్వం వహించాడు. స్థానిక నివాసితుల నుండి తీవ్ర అభ్యంతరాలు మరియు నిరసనల కారణంగా, ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను వదిలివేసింది. వెంకటరమణారెడ్డి(Venkataramana Reddy) చేసిన స్టాండ్ ఆయనకు ప్రజల నుండి చాలా మద్దతు మరియు ఆదరణను సంపాదించింది.

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మరియు కామారెడ్డిలో(Kamareddy) తన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ఆధారపడి ఉంది. అయితే, ప్రస్తుత ఎమ్మెల్యేపై అసంతృప్తి బీఆర్ఎస్‌ (BRS) అవకాశాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి (Revanthreddy) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఆకర్షిస్తోంది, అయితే మద్దతు విజయం సాధిస్తుందో లేదో అనిశ్చితంగా ఉంది. చంద్రశేఖర్ రావు(KCR) లేదా రేవంత్ రెడ్డి (Revanthreddy) వారి వారి నియోజకవర్గాల్లో గెలిస్తే, వారు కామారెడ్డిని విడిచిపెట్టి కొత్త ఎన్నికలకు దారితీసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇది వారి పార్టీలకు ఆందోళన కలిగించవచ్చు. మొత్తంమీద, కామారెడ్డి(Kamareddy) ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నారు మరియు కొత్త అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై (Venkataramana reddy) అనుభవజ్ఞులైన నాయకులు ఎలా పోటీ చేస్తారో చూడాలి.

మూడు ప్రధాన పార్టీల నాయకుల పరిస్థితి ఇలా ఉంటే, కామారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులతో అనుబంధం ఉన్న నాయకుడైన సిరిగాద సిద్ధిరాములు (Sirigada Siddhiramulu) సంవత్సరం నుండి బిఎల్ఎఫ్ పార్టీ (BLF Party)నుండి అభ్యర్థిగా ప్రకటించబడి వారం నుండి ప్రచారం సైతం ప్రారంభించాడు. కార్మిక నాయకుని బలం, బలగం అంతా బీడీ కార్మికులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు. నాయకునికి కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సుమారు ప్రతి వ్యక్తితో అనుబంధం ఉంది, కారణం నాయకుడు కామారెడ్డి నియోజకవర్గంలోని ( దోమకొండ ) బిబిపెట్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కావడం, ఇతని విద్యాభ్యాసం బిబిపేట, దోమకొండ మండలంలో కొనసాగింది. ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గం లో ప్రధాన పార్టీ అభ్యర్థులతో దీటుగా బిఎల్ఎఫ్ ప్రచారం కొనసాగుతుంది. కామారెడ్డి నుండి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.