Doctor: ఢిల్లీలో బయటపడిన దొంగ డాక్టర్ల నిర్వాకం

డాక్టర్ల పేరుతో చలామణి..

Courtesy: Twitter

Share:

Doctor: ఎక్కడ చూసినా సరే మోసమే బయటికి వస్తుంది. నకిలీ (Fake) అనే పేరుకి అద్దం పడుతున్నాయి కొన్ని సంఘటనలు. నకిలీ (Fake) పోలీసులు (Police), నకిలీ (Fake) టీచర్లు, నకిలీ (Fake) గవర్నమెంట్ ఆఫీసర్లు ఇలా ఎక్కడ చూసినా, నకిలీ (Fake) కార్యకలాపాలు బయటపడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ (Delhi)లోని నకిలీ (Fake) దొంగ డాక్టర్ల (Doctors) నిర్వాకం బయటపడింది. 

ఢిల్లీలో బయటపడిన దొంగ డాక్టర్ల నిర్వాకం: 

ఇద్దరు వైద్యులు, సర్జన్‌గా నటిస్తున్న మహిళ, ల్యాబొరేటరీ టెక్నీషియన్, పలువురు ఆల్రెడీ మృతి చెందిన పేషెంట్స్ ఉన్న ఒక దొంగ డాక్టర్ల (Doctors) ముఠా బయటపడింది. ఢిల్లీ (Delhi)లోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీ (Delhi) ప్రాంతంలోని ఓ క్లినిక్‌లో సర్జరీ చేయించుకున్న ఇద్దరు పేషెంట్ల మృతికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. నిజానికి ఆ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నకిలీ (Fake).

డాక్టర్ (Doctor) నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్ మరియు డాక్టర్ (Doctor) జస్‌ప్రీత్ సింగ్‌తో పాటు ముగ్గురు వ్యక్తులను మంగళవారం నాడు మాజీ లేబొరేటరీ టెక్నీషియన్ మహేందర్ సింగ్‌తో అరెస్టు చేసినట్లు ఢిల్లీ (Delhi) పోలీసులు (Police) తెలిపారు..

పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం, అస్గర్ అలీ అనే ఒక పేషంట్ 2022లో చికిత్స కోసం క్లినిక్‌లో చేరాడు. మొదట్లో, అలీకి సర్జరీని చేయడానికి సర్జన్ అయిన డాక్టర్ (Doctor) జస్ప్రీత్ సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే, ఆపరేషన్‌కు ముందు, డాక్టర్ (Doctor) జస్ప్రీత్ స్థానంలో పూజ మరియు మహేంద్రలు కనిపించినట్లు దర్యాప్తులో భాగంగా తేలింది. ఆపరేటింగ్ గది నుండి బయటికి వచ్చిన తర్వాత, అలీకి తీవ్రమైన నొప్పిగా అనిపించినట్లు చెప్పడంతో వెంటనే అతన్ని వేరే హాస్పటల్ కి తీసుకు వెళ్లడం జరిగింది.. కానీ అక్కడికి చేరుకోక ముందే ఆయన మరణించినట్లు తేలింది.

అగర్వాల్ మెడికల్ సెంటర్‌ను నడుపుతున్న డాక్టర్ (Doctor) అగర్వాల్ మరియు మరో ముగ్గురు వైద్య ప్రోటోకాల్‌లను పాటించకుండా, చాలామంది పేషంట్లకి కీలక అవయవాలపై సర్జరీలు చాలా వరకు చేశారని రోగుల కుటుంబాలు ఆరోపించాయి. ఫిర్యాదుదారుల ప్రకారం, డాక్టర్ (Doctor) అగర్వాల్ ఒక వైద్యుడు, అయితే అతని నకిలీ (Fake) సర్టిఫికెట్లు చూపించి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు, సర్జరీలు చేస్తున్నట్లు చెబుతున్నారు చాలామంది.

2016 నుండి డాక్టర్ (Doctor) అగర్వాల్, పూజ మరియు అగర్వాల్ మెడికల్ సెంటర్‌పై కనీసం తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని కేసు దర్యాప్తులో తేలింది. పోలీసుల ప్రకారం, మొత్తం ఏడు కేసులలో, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు మరణించినట్లు వెల్లడించారు. 

స్వాధీనం చేసుకున్న పోలీసులు:

నవంబర్ 1 న, నలుగురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును వైద్య కేంద్రాన్ని పరిశీలించడానికి పిలిచారు, అయితే ఆ పరిశీలన ప్రకారం చాలా లోపాలు ఉన్నాయని, చాలా అవకతవకలు జరుగుతున్నాయని అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) చందన్ చౌదరి చెప్పడం జరిగింది. దర్యాప్తులో అగర్వాల్ చేసిన ట్రీట్మెంట్ గురించి ఆయన సర్జరీల గురించి, ముఖ్యంగా నకిలీ (Fake) సర్టిఫికెట్ల గురించి బయటపడ్డాయి.

వైద్యులు సంతకాలు మాత్రమే ఉన్న 414 ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లను, క్లినిక్‌లో నిర్వహించబడే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP)లో భాగంగా పేషంట్ వివరాలు నమోదు చేసే రెండు రిజిస్టర్లు, మందులు మరియు ఇంజెక్షన్‌లను పోలీసులు (Police) స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్పైర్ అయిపోయిన సర్జికల్ బ్లేడ్‌లు, అనేక మంది పేషెంట్లకు సంబంధించినన ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లు, 47 వేర్వేరు బ్యాంకుల నుండి చెక్‌బుక్‌లు, వివిధ బ్యాంకుల నుండి 54 ATM కార్డులు, పోస్టాఫీసు పాస్‌బుక్‌లు, ఆరు POS టెర్మినల్ క్రెడిట్ కార్డ్ మెషీన్‌లను కూడా పోలీసులు (Police) స్వాధీనం చేసుకున్నారు.