Candidates: అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి 2,290 అభ్యర్థులు

జోరు అందుకున్న ప్రచారం..

Courtesy: Twitter

Share:

Candidates: ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల (Elections) జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana) మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Elections)కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ (Election commission) తేదీలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 30న తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు (Elections) జరగనున్నవేళ, హైదరాబాద్ నుంచి సుమారు 2,290 మంది అభ్యర్థులు (Candidates) పోటీపడుతున్నట్లు సమాచారం. 

హైదరాబాద్ నుంచి 2,290 అభ్యర్థులు: 

నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Elections)కు 2,290 మంది అభ్యర్థులు (Candidates) బరిలో ఉన్నారని, ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 48 మంది అభ్యర్థులు (Candidates) బరిలో నిలిచారని ఎలక్షన్ కమిషన్ (Eelection commission) గురువారం వెల్లడించింది. డేటా ప్రకారం, 2,898 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి, 608 మంది అభ్యర్థులు (Candidates) తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు, ప్రస్తుతానికి మొత్తం పోటీదారుల సంఖ్య 2,290 కి తగ్గింది.

అభ్యర్థుల సంఖ్య 16కు మించి ఉన్నందున 55 నియోజకవర్గాల్లో రెండు నుంచి ఐదు వరకు అదనపు ఈవీఎంలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఏర్పాటు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ (Eelection commission) ఏర్పాట్లు చేస్తుంది.

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, నాంపల్లి, అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మలక్‌పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం, సేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 16 మందికి పైగా అభ్యర్థులు (Candidates) ఎన్నికల (Elections) బరిలో ఉన్నారు. అతిపెద్ద నియోజకవర్గమైన మేడ్చల్‌లో 67 నామినేషన్లు చెల్లుబాటు కాగా 45 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 22 మంది పోటీలో ఉన్నారు. గజ్వేల్ (44), కామారెడ్డి (39), ఎల్‌బి నగర్ (48) అత్యధిక అభ్యర్థులు (Candidates) ఉన్న నియోజకవర్గాల్లో ఉండగా, బాల్కొండ (8), నరస్‌పూర్ (11), బాన్సువాడ (7) మరో చివర్లో ఉన్నాయి.

 

అధికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు:

LB నగర్: 48, గజ్వేల్: 44, కామారెడ్డి: 39, మునుగోడు: 39, పలైర్: 37, నాంపల్లి: 34, ఖమ్మం: 32, రీంనగర్: 27, ఆదిలాబాద్: 25, రామగుండం: 23, యెల్లందు(ST): 20 

అతి తక్కువ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు:

బాన్సువాడ, నారాయణపేట: 7, బాల్కొండ: 8, కంటోన్మెంట్: 10, నర్సాపూర్, దుబ్బాక మరియు మక్తల్: 11, దేవరకద్ర: 12, కొడంగల్: 13 

ఇక ఓటర్ల విషయానికి వస్తే: 

తెలంగాణ (Telangana) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (Elections) నవంబర్ 30న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న అంతేకాకుండా నవంబర్ 17న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు (Elections) జరిగాయి. నవంబర్ 23న రాజస్థాన్ ఎన్నికలు (Elections) జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది మరియు డిసెంబర్ 5 నాటికి పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మాత్రమే రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలు (Elections) సమీపిస్తున్న వేళ, తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు ఉండగా, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 5న ప్రకటించిన 2.99 కోట్ల మంది ఓటర్లకు వ్యతిరేకంగా ఈ సంఖ్య ఉండడం గమనార్హం. గత కొన్ని నెలల్లో దాదాపు 8.31 లక్షల మంది ఓటర్లు తమ ఓటుని నిర్వహించేందుకు ఓటర్ల లిస్టులో చేరారు. 1.82 లక్షల వేరే రాష్ట్రాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకుంది.

ఓటర్ల జాబితాలో 2,742 మంది ఎన్నారై ఓటర్లు, 15,337 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా, 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్ల సంఖ్య 4.76 లక్షలు. ప్రధాన ఎన్నికల (Elections) అధికారి ప్రకటించిన ఓటర్ల జాబితాల్లో ఈ సంఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికల (Elections)కు నెలరోజుల ముందు ఈ ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల (Elections) అధికారి, ఎన్నికలు (Elections) జరిగినప్పుడు పోలింగ్‌ నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసింది.