Telangana: బిజెపి బలమైన ప్రతిపక్షంగా మారుతుంది: రాజాసింగ్

ప్రభుత్వం రాకపోతే..

Courtesy: Pexels

Share:

Telangana: తెలంగాణ(Telangana)లో ఎన్నికల(Elections) జోరు రోజురోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ(Telangana)లో తన స్థానాలను నిలదొక్కుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో ఓటమిని చవిచూసిన బీజేపీ (BJP), ఇప్పుడు తెలంగాణ(Telangana)లో తప్పకుండా అధిక సీట్లను సంపాదించాలని, ముఖ్యంగా కాంగ్రెస్(Congress) నాయకత్వాన్ని మరోసారి రానివ్వకుండా, తెలంగాణలో తమ సత్తాను చాటాలని బిజెపి (BJP) ప్రయత్నం. 

ప్రభుత్వం రాకపోతే..: 

తెలంగాణ(Telangana)లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలవకపోతే, బీజేపీ (BJP) పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరిస్తుందని ఆ పార్టీ గోషామహల్ నియోజకవర్గ అభ్యర్థి, శాసనసభ్యుడు టి రాజాసింగ్ (Raja Singh) గురువారం అన్నారు. వివాదాస్పద శాసనసభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM నాయకులతో అధికార BRS పార్టీ కుమ్మక్కయ్యిందని, మరి నియోజకవర్గంలో దాదాపు 17,000 బోగస్ ఓట్లు ఉన్నాయని, అది బీజేపీ (BJP) మరియు MIM మధ్య పోరుగా మారిందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నంద కిషోర్‌ వ్యాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి మొగిలి సునీతలపై పోటీ చేస్తున్నారు.

తమ బీజేపీ (BJP) పార్టీ నిజానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్మకంతో ఉన్నామని.. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే, బిజెపి (BJP) బలమైన ప్రతిపక్షంగా మారుతుంది అని ఆయన అన్నారు. అంతే కాకుండా మరి ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో కొన్ని సర్వేలు బిజెపి (BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా లేవని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో పార్టీ అందించిన షోకాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా గోషామహల్ ఎమ్మెల్యే వివరణను పరిగణనలోకి తీసుకున్న బిజెపి (BJP) నాయకత్వం గత నెలలో అతని సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుంది.

గత ఏడాది ఆగస్టులో, రాజాసింగ్ (Raja Singh) ఒక వీడియోలో ఇస్లాం మతం గూర్చి.. మహమ్మద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు, సోషల్ మీడియా వివాదాస్ప వాక్యాలకు సంబంధించిన వీడియో అప్లోడ్ చేసిన కొద్ది గంటలకే ప్లాట్‌ఫారమ్ నుంచి తీసేయడం జరిగింది.

ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద రాజాసింగ్ (Raja Singh) ని అరెస్టు చేశారు. అయితే, తెలంగాణ(Telangana) హైకోర్టు నవంబర్ 2022లో అతనిపై ఉన్న పీడీ యాక్ట్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత అతి కష్టం మీద ఆయనకు బెయిల్ మంజూరైంది.

గత తొమ్మిదేళ్లలో రూ.500 కోట్లకు పైగా పనులు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మూడోసారి ఎన్నికల్లో గెలుస్తానని రాజాసింగ్ (Raja Singh) అన్నారు. సునీత మాట్లాడుతూ, రాజాసింగ్ (Raja Singh) గతంలో నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిగా ఉండేవారని, కానీ ఇప్పుడు కాదు అంటే మాట్లాడారు. బిజెపి (BJP), ఎంఐఎం, బిఆర్‌ఎస్‌లు ఒకటేనని ఓటర్లు అభిప్రాయపడుతున్నారని, అలాగే ధూల్‌పేట్ ప్రాంతంలో తప్ప నియోజకవర్గంలో రాజాసింగ్ (Raja Singh) చాలా అరుదుగా కనిపిస్తారని ఆమె అన్నారు. తెలంగాణ(Telangana)లో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జోరు: 

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ(Telangana) మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు గత నెలలో ఖరారు చేసింది. తెలంగాణ(Telangana) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Elections) నవంబర్ 30న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న అంతేకాకుండా నవంబర్ 17న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు(Elections) జరగనున్నాయి. నవంబర్ 23న రాజస్థాన్ ఎన్నికలు(Elections) జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది మరియు డిసెంబర్ 5 నాటికి పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మాత్రమే రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలు(Elections) సమీపిస్తున్న వేళ, తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు ఉండగా, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 5న ప్రకటించిన 2.99 కోట్ల మంది ఓటర్లకు వ్యతిరేకంగా ఈ సంఖ్య ఉండడం గమనార్హం.