Murder: నేను బ్రతికే ఉన్నా అంటూ కోర్టులో హాజరైన బాలుడు

తర్వాతే ఏమైందంటే..

Share:

Murder: కొన్ని కోర్టు (Court)లో కేసు (Case)లు వినడానికి, చూడడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని మర్డర్ మిస్టరీలలో ఎన్నో మలుపులు కోర్టు (Court)లో జరుగుతూ ఉంటాయి. ఇటీవల కోర్టు (Court)లో జరిగిన ఒక మర్డర్ కేసు (Case) విషయ విచారణలో నేను బ్రతికే ఉన్నాను అంటూ, మర్డర్ లో చనిపోయాడు అనుకున్న ఒక 11 సంవత్సరాల పిల్లవాడు కోర్టు (Court)లో ప్రత్యక్షమయ్యాడు. మరి ఆ కేసు (Case) ఏమైందో తెలుసుకోవాలంటే పూర్తిగా చదవాల్సిందే.. 

 

కొడుకుని చంపేసారంటూ ఆరోపణ: 

 

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు (Boy) సుప్రీంకోర్టు (Court) డివిజన్ బెంచ్ ముందు హాజరై, తనపై విచారణలో ఉన్న హత్య (Murder) కేసు (Case) అబద్ధమని పేర్కొన్నాడు. తన హత్య (Murder) కేసు (Case)లో తన తండ్రి, తన తాతయ్య మరియు మేనమామలపై తప్పుడు ఆరోపణలు చేశారని బాలుడు (Boy) చెప్పి కేసు (Case)లో ట్విస్ట్ తీసుకువచ్చాడు. ఈ విషయం గురించి సుప్రీం కోర్టు (Court) స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారిస్తోంది.

 

సుప్రీం కోర్టు (Court) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, పిలిభిత్‌లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌తో పాటు న్యూరియా పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పిటిషనర్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని పిటిషన్‌ను స్వీకరిస్తూ సుప్రీం కోర్టు (Court) పేర్కొంది.

 

కోర్టు (Court)లో బాలుడి (Boy) తరపున వాదిస్తున్న కుల్దీప్ జౌహరి మాట్లాడుతూ, బాలుడు (Boy) తల్లిని తన తండ్రి ఎక్కువ కట్నం కోసం వేధిస్తూ దారుణంగా కొట్టి చంపిన తరువాత నుంచి కూడా, ఆ బాలుడు (Boy), ఫిబ్రవరి 2013 నుండి వృత్తిరీత్యా రైతు అయిన తన తాతయ్యతో నివసిస్తున్నాడని చెప్పాడు.  IPC సెక్షన్ 304-B కింద బాలుడి (Boy)ని పెంచిన తాతయ్య, బాలుడి (Boy) తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తన కుమారుడిని తనకి అప్పచెప్పాలని తండ్రి ఒకప్పుడు డిమాండ్ చేశాడు, ఇది చివరికి ఇరుపక్షాల మధ్య న్యాయ పోరాటానికి దారితీసింది.

 

ఈ సంవత్సరం ప్రారంభంలో, బాలుడి (Boy)ని పెంచుతున్న తాత.. అతని నలుగురు కుమారులు కలిసి కావాలని బాలుడి (Boy) హత్య (Murder)కు పాల్పడ్డారని ఆరోపించారు. జౌహరి, తండ్రి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత, బాలుడి (Boy) తాతయ్య మరియు మేనమామలపై పోలీసులు IPC సెక్షన్ 302 హత్య (Murder) కేసు (Case) కింద, 504, 506కింద కేసు (Case)లు నమోదు చేశారు.

 

ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని బాలుడి (Boy) తాతయ్య అతని నలుగురు కుమారులు అలహాబాద్ హైకోర్టు (Court)ను ఆశ్రయించారని, అయితే కోర్టు (Court) వారి అభ్యర్థనను కొట్టివేసినందున వారు సుప్రీంకోర్టు (Court)లో హాజరు కావాల్సి వచ్చిందని జౌహరి చెప్పారు. ఈ విషయం ఇప్పుడు జనవరి 2024లో విచారణకు వస్తుంది, మరి ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. 

 

తల్లిని చంపేసిన కూతురు: 

 

ఇదిలా ఉండగా మరోవైపు ఇటీవల జరిగిన ఒక సంఘటన చూద్దాం. తమకి పిల్లలు లేకపోవడంతో, 13 ఏళ్ల క్రితం నిరుపేద బాలికను తమ కూతురు (Daughter)గా దత్తతు (Adopt) తీసుకున్నారు దంపతులు. అయితే అనారోగ్యంతో 2021లో నాగేశ్వరరావు మరణించారు. మంచి చెడ్డలు చూసే తండ్రి చనిపోయిన తర్వాత, తాము పెంచుకున్న కూతురు (Daughter) ఆగడాలు హద్దు మరాయి. ఇదంతా గమనించిన తల్లి (Mother) జూలియానా (Juliana), కూతురిని చాలాసార్లు మందలించడం కూడా జరిగింది. అప్పటినుంచి జూలియానా (Juliana) మీద కక్షను పెంచుకుంది.. కూతురు (Daughter). ఆమెను ఎలాగైనా హత్య (Murder) చేయాలని నిర్ణయించుకుంది.

 

ఇదే క్రమంలో అనుకోకుండా శనివారం జూలియానా (Juliana) బాత్‌రూమ్‌లో పడి స్పృహతప్పి పడిపోయింది. ఇదే అదునుగా తీసుకున్న కూతురు (Daughter), ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది. తన ప్రేమికుడు గార అశోక్ (19)కి సమాచారం అందించడంతో, అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి.. ఆ అమ్మాయి ఇంటికి వచ్చారు. తాము అనుకున్న విధంగా పకడ్బందీ ప్లాన్ ప్రకారం, ఆ అమ్మాయి ప్రేమికుడు అశోక్, తన ఇద్దరి స్నేహితులతో కలిసి, జూలియానా (Juliana)ను ఊపిరాడకుండా చేసి నిర్ధాక్షణంగా హత్య (Murder) చేశారు.. తర్వాత ఏమీ జరగలేనట్లు, తమకు ఏ విషయం తెలీదు అన్నట్లు.. తన తల్లి (Mother) బాత్రూంలో పడిపోయి స్పృహ తప్పి లేవలేని స్థితిలో ఉందని, తన చినాన్నకి ఫోన్ చేసి చెప్పింది జూలియానా (Juliana) కూతురు (Daughter). విషయం తెలుసుకుని అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడండి.