AP High Court: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. స్కిల్‌ కేసులో బెయిల్ మంజూరు

జస్టిస్‌ టి మల్లికార్జున్‌రావు తీర్పు

Courtesy: Twitter

Share:

AP High Court: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు(Chandrababu Naidu) స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో(Skill Development Case) బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనకు బెయిల్(Bail) మంజూరైంది. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. కోర్టు ఎలాంటి షరతులు విధించిందని క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెల 17న ఈ పిటిషన్‌పై(Petition) వాదనలు పూర్తికాగా.. కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో(Skill Development Case) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుకు(Chandrababu Naidu) ఊరట దక్కింది. ఆయనకు హైకోర్టు(High Court) రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. స్కిల్‌ కేసులో(Skill Case) టీడీపీ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు.. ఈ మేరకు చంద్రబాబుకు బెయిల్‌(Bail) మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు(Mallikharjunarao) తీర్పు వెల్లడించారు. రెగ్యులర్ బెయిల్(Regular Bail) రావడంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న కొన్ని నిబంధనలు కూడా తొలగిపోయినట్లే అని లాయర్లు అంటున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై కోర్టు ఎలాంటి షరతులు విధించింది అన్నది క్లారిటీ రావాల్సి ఉంటుంది.

ఈ పిటిషన్‌పై(Petition) వాదనలు ఈనెల 17న ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు(Chandrababu) తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా(Siddharth Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్‌(Dammalapati Srinivas).. సీఐడీ(CID) తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో(High Court) వాడీవేడి వాదనలు జరిగాయి. రాజకీయంగా పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్‌ లాయర్లు వాదించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా.. చంద్రబాబుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు నమోదు చేశాయన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో(Skill Development Case) బెయిలు మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని కోర్టులో వాదనలు వినపించారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదన్నారు చంద్రబాబు తరఫు లాయర్లు.

చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ నిబంధనల్ని ఉల్లంఘించారని సీఐడీ(CID) తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ కండిషన్స్‌ ఉల్లంఘించి ర్యాలీలు చేశారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారు. లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌(Petition) ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. బెయిలు మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు.  ల్‌ స్కామ్‌ రూ.10 నోట్లు వాడి హవాలా రూపంలో డబ్బు తరలించారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్‌కు తరలించారు. బోస్‌ అనే వ్యక్తి ఫోన్‌ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడింది. బోస్‌, కన్వేల్కర్‌ మెస్సేజ్‌ల ఆధారంగా డబ్బు హైదరాబాద్‌కు చేరినట్లు తెలిసింది.

స్కిల్‌ స్కామ్‌లో(Skill Scam) మెన్స్‌ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు. అప్పటి చీఫ్‌ సెక్రటరీ తన లెటర్‌లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్‌ సెక్రటరీకి లేఖ రాశారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు(Chandrababu) సాక్షులను ప్రభావితం చేస్తారు చట్టం ముందు అందరూ సమానులే. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదని వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వు చేయగా.. ఇవాళ నిర్ణయాన్ని వెల్లడించారు. చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నసంగతి తెలిసిందే.