Ayodhya Deepotsav: 51 ఘాట్‌లు.. 24 లక్షల దీపాలు.. అయోధ్య మ‌రో ప్రపంచ రికార్డు

Ayodhya Deepotsav: అయోధ్యలో(Ayodhya) రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో దీపావళి(Diwali) సంబరం ఈసారి అంబరాన్నంటనుంది. సరయూ నది(Sarayu River) తీరాన నిర్వహించే 'దీపోత్సవ్'(Deepotsav) కార్యక్రమంలో మొత్తం 51 ఘాట్‌లలో ఏకకాలంలో 24 లక్షల ద్వీపాలను వెలిగించనున్నారు.

Courtesy: pexels

Share:

Ayodhya Deepotsav: అయోధ్యలో(Ayodhya) రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో దీపావళి(Diwali) సంబరం ఈసారి అంబరాన్నంటనుంది. సరయూ నది(Sarayu River) తీరాన నిర్వహించే 'దీపోత్సవ్'(Deepotsav) కార్యక్రమంలో మొత్తం 51 ఘాట్‌లలో ఏకకాలంలో 24 లక్షల ద్వీపాలను వెలిగించనున్నారు. 

 

 అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో దీపావళి (Diwali) సంబరం ఈసారి అంబరాన్నంటనుంది. నభూతో నభవిష్యతి అనే రీతిలో దీపోత్సవ్(Deepotsav) జరిపేందుకు ఉత్తరప్రదేశ్‌లోని (Uttar pradesh) అయోధ్యా (Ayodhya) నగరం ముస్తాబైంది. దీపావళికి(Diwali) ఒకరోజు ముందే ఏటా సరయూ నది తీరాన నిర్వహించే 'దీపోత్సవ్'(Deepotsav) కార్యక్రమం శనివారం సాయంత్రం మొదలవుతోంది. సరయూ తీరంలోని మొత్తం 51 ఘాట్‌లలో ఏకకాలంలో 24 లక్షల ద్వీపాలను వెలిగించనున్నారు.

25 వేలమంది వాలంటీర్లు..

24 లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు(World record) నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సరయూతో పాటు 51 ఘాట్ల వద్ద 24 లక్షల దీపాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. నవంబర్ 10న  ప్రారంభమై నవంబర్ 12వ తేదీ వరకు జరిగే మూడు రోజుల దీపోత్సవాల్లో సుమారు 25,000 మంది వాలంటీర్లు ఈ దీపాలను వెలిగిస్తారు. ఈ సంవత్సరం, రామ్ కీ పౌరిలో(Ram Ki Pauri) లైట్ అండ్ సౌండ్ షో(Light and Sound Show) ప్రారంభించబడుతుంది. ఇది వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయోధ్య(Ayodhya) మరియు ఉత్తరప్రదేశ్(Uttarpradesh) చరిత్రను ప్రదర్శించడానికి దేశంలోనే అతిపెద్ద భారీ డిజిటల్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు

 

వాలంటీర్లకు(Volunteers) ఇటీవల దీపాలను వెలిగించడం, వాటి నిర్వహణపై శిక్షణ(Training) ఇచ్చారు. వాలంటీర్లు వివిధ సంస్థలు 27 కళాశాలలు మరియు అయోధ్యలోని 19 ఇంటర్మీడియట్ కళాశాలలు మరియు రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం, దీపాలను వెలిగించే నోడల్ ఏజెన్సీకి అనుబంధంగా ఉన్నాయి. రామ్ కి పౌరి(Ram Ki Pauri)లోనే దాదాపు 65,000 దీపాలు వెలిగిస్తారు. 51 ఘాట్లతో పాటు, అయోధ్య(Ayodhya)లోని ముఖ్యమైన మతపరమైన మరియు చారిత్రక ప్రదేశాలలో కూడా దీపాలను వెలిగిస్తారు. వీటిని సులభంగా లెక్కించడానికి 196 దీపాలు చొప్పున 12,500 బ్లాక్‌లలో ఉంచుతారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు(Guinness Book of Records) ప్రతినిధులు హాజరై, డ్రోన్ కెమెరాలతో దీపాలను లెక్కించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సరయూ హారతి ఇవ్వగానే 25 వేల మంది వాలంటీర్లు 24 లక్షల దీపాలను వెలిగిస్తారు.

 

కాగా, దీపోత్సవ్(Deepotsav) కార్యక్రమానికి ముందు నిర్వహించిన రాజాభిషేక్(Rajabhishek) కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్(Anandiben Patel) హాజరయ్యారు. రామ్ కథా పార్క్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాముడు, సీత, లక్ష్మణ్ వేషధారులకు సీఎం సాదర స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా రామజన్మభూమి మార్గాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా..

అయోధ్యలో 24 లక్షల దీపాలను ఏకకాలంలో వెలిగించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness Book of Records)ను సాధించాలని యూపీ ప్రభుత్వం(UP Govt) పట్టుదలగా ఉందని యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠత్(Brijesh Pathat) తెలిపారు. ఈ భారీ దీపోత్సవ్ కార్యక్రమానికి జార్ఖండ్ లోని పకూర్ జిల్లాకు చెందిన గిరిజనులతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు, 50 దేశాలకు చెందిన హైకమిషనర్లు, రాయబారులు హాజరవుతున్నట్టు చెప్పారు. కాగా, రామ్ కథా పార్క్‌కు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సర్వాంగసుదరంగా అలంరించిన శ్రీరామ శకటం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.

 

ఇక, 2019లో 4.10లక్షలు, 2020లో దాదాపు 6లక్షలు, 2021లో 9లక్షలకు పైగా దీపాలను వెలిగించి యూపీ ప్రభుత్వం గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది ఆ రికార్డును తిరగరాస్తూ 15లక్షల దీపాలను వెలిగించి మరోసారి గిన్నిస్‌ రికార్డును దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు. ఈ ఏడాది మరోసారి ఆ రికార్డును బద్దలుకొట్టి.. సరికొత్త ప్రపంచ రికార్డ్‌ను సృష్టించేందుకు అయోధ్యాపురి సిద్ధమైంది.