Kota: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

ఈ సంవత్సరంలో ఇది 28వ కేసు..

Courtesy: Twitter

Share:

Kota: చాలామంది విద్యార్థులు (Students) ముఖ్యంగా కోటా (Kota) అనే ప్రదేశానికి కోచింగ్ (Coaching) కోసం వచ్చిన చాలామంది, చదువు ఒత్తిడి (Stress) కారణంగా ఆత్మహత్య (Suicide)లు చేసుకునే క్రమం రోజురోజుకీ ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 27 ఆత్మహత్య (Suicide) కేసులు నమోదయ్యాయి. ఆత్మహత్య (Suicide)లకు ముఖ్య కారణం ఒత్తిడి (Stress) అని, సమస్యలను చెప్పుకోవడానికి పక్కన తమ ఆత్మీయులు లేకపోవడమే అని నిపుణులు భావిస్తున్నారు. అయితే మరోవైపు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కి చెందిన బెంగాలీ విద్యార్థి కోటా (Kota)లో ఆత్మహత్య (Suicide) చేసుకుని మృతి చెందాడు. ఇది ఈ సంవత్సరంలో కోటా (Kota)లో జరిగిన 28వ ఆత్మహత్య (Suicide) కేసు. 

ఈ సంవత్సరంలో ఇది 28వ కేసు..: 

రాజస్థాన్‌లోని కోటా (Kota)లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. దేశవ్యాప్తంగా విద్యార్థులను (Students) ఆకర్షించే పోటీ పరీక్షలకు ప్రముఖ కోచింగ్ (Coaching) హబ్‌గా ఉన్న కోటా (Kota)లో ఈ ఏడాది జరిగిన ఆత్మహత్య (Suicide)లలో ఇది 28వ ఆత్మహత్య (Suicide). పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫోరిడ్, కోటలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. వైద్య విద్య కోర్సులలో ప్రవేశానికి అఖిల భారత పరీక్ష అయిన నీట్‌కు సిద్ధమవుతున్నాడు.

ఇటీవల తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడని పోలీసులు తెలిపారు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఫోరిడ్ బస చేసిన అద్దె వసతి గృహంలో నివసిస్తున్న ఇతర విద్యార్థులు (Students) సాయంత్రం 4 గంటలకు అతన్ని చివరిసారిగా చూశామని పోలీసులకు చెప్పారు. రాత్రి 7 గంటల వరకు అతను తన గది నుండి బయటకు రాకపోవడంతో, వారి కాల్‌లకు సమాధానం ఇవ్వకపోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్య (Suicide) జరిగిన సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు ఆ తర్వాత పోలీసులు ఆ విద్యార్థికి (Students) సంబంధించిన బంధుమిత్రులకు సమాచారం అందించారు. కేవలం స్ట్రెస్ కారణంగానే ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు తేల్చారు. 

 

ఆత్మహత్యలకు అడ్డాగా మారిన కోటా: 

IITలు, వైద్య కళాశాలలకు అర్హత సాధించడానికి విద్యార్థులకు (Students) శిక్షణ ఇవ్వడంలో అధిక విజయాల రేటుతో ముందున్న పట్టణం కోటా (Kota).. గత కొన్నేళ్లుగా విద్యార్థుల (Students) ఆత్మహత్య (Suicide)లతో మరో రికార్డ్ సృష్టించింది.. ఈ ఏడాదిలోనే సుమారు 27 ఆత్మహత్య (Suicide)లు ఇక్కడే నమోదయ్యాయి. 

గతేడాది 15 మంది యువకులు ఆత్మహత్య (Suicide) చేసుకునే తమ ప్రాణాలు కోల్పోయారు. గతంలో కూడా, చాలా మంది తీవ్రమైన సిలబస్ ఒత్తిడి (Stress).. పనిభారం, పోటీ, కుటుంబం మరియు తాము సక్సెస్ అవ్వకపోతే సమాజం ఏమనుకుంటుందో అని అంచనాలతో నలిగిపోయి తమ జీవితాలను ముగించారు. కోటా (Kota) వ్యవస్థలో నలుగురు వాటాదారులు ఉన్నారు - వాళ్లే తల్లిదండ్రులు, ప్రభుత్వం, కోచింగ్ (Coaching) సెంటర్లు మరియు హాస్టల్ యజమానులు. కోచింగ్ (Coaching)‌ సెంటర్లు, హాస్టల్‌ యజమానులకు డబ్బుల బెడద. కోచింగ్ (Coaching) సెంటర్‌లు కొంతమంది టాపర్‌లను చూసుకునిసంబరాలు చేసుకుంటాయి.. అదే సమయంలో ఓడిపోయినవారిని పక్కన పెడతారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా సంక్షోభం ముదిరేలా మరో పక్క చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కేవలం నష్టపోయేది తల్లిదండ్రులు మాత్రమే.. తమ డబ్బు పోవడమే కాకుండా.. ప్రయోజకులవుతారని కోచింగ్ (Coaching) సెంటర్ లో జాయిన్ చేసిన బిడ్డలు, ప్రాణాలతో మిగిలి ఉండటం లేదు. 

కోటా (Kota) ప్రదేశంలో కోచింగ్ (Coaching) తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి అర్హత దొరకడం కష్టమని.. వారు కొంతమంది టాపర్స్ ని మాత్రమే ఎంచుకోవడానికి ముందుగా ఒక పోటీ పరీక్ష నిర్వహిస్తారని.. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే కోటా (Kota)లో కోచింగ్ (Coaching) తీసుకునే అవకాశం కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. సుమారు ప్రతియాట మూడు లక్షల మంది స్టూడెంట్స్ ఐఐటి, జేఈఈ, మెడికల్ ప్రవేశాల గురించి కోటా (Kota) కోచింగ్ (Coaching) సెంటర్లో జాయిన్ అవుతూ ఉంటారని, అయితే ప్రతి ఏటా 2.5 లక్షల రూపాయలు కట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కోచింగ్ (Coaching) తీసుకుంటున్నారని వెల్లడించారు.