Viral Video: దోశల కోసం ఎగబడుతున్న జనం..ఎక్కడో తెలుసా?

వీడియో వైరల్..

Courtesy: Canva

Share:

Viral Video: దోశలు(Dosa) తినడానికి చాలామంది ఇష్టపడతారు. బెంగళూరులోని(Bangalore) రెస్టారెంట్లో దోశలు తయారు చేస్తున్న ఇంటర్నెట్లో వీడియో వైరల్(Viral Video) అవుతోంది. వీడియోను చూసిన జనం మాత్రం మండిపడుతున్నారు.

వీధి పక్కన ఉండే స్టాల్స్ నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లకు(Restaurant) వెళ్తే రకరకాల దోశలు అందుబాటులో ఉంటాయి. మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, పన్నీర్ దోశ ఇలా రకరకాల దోశలు దోశ ప్రియుల(Dosa lovers) నోరూరిస్తుంటాయి. కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకంగాక కొన్ని దోశ రకాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటాయి. బెంగళూరులోని(Bangalore) రెస్టారెంట్కి సంబంధించిన వీడియో(Video) ఆన్ లైన్లో వైరల్(Viral) అవుతోంది. అయితే దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. అందుకు కారణమేంటి?

వీడియోలో రెస్టారెంట్(Restaurant) కిచెన్లో చెఫ్ దోశలు(Dosa) వేస్తుంటాడు. అతని వెనుక జనం గుంపులుగా ఉన్నారు. దోసలు తినడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చెఫ్ దోశలు వేయడానికి ముందు పెనాన్ని చీపురును(Broom) ఉపయోగించి క్లీన్ చేసాడు. తర్వాత దోశలు వేసాడు. ఆయిల్ ప్యాకెట్ తీసుకుని దోశలపై నూనె వేయడం.. కాదు కాదు పోయడం మొదలుపెట్టాడు. ప్రతి దోశపై చాలా ఎక్కువ మొత్తంలో నూనె పోసి మధ్యలో మసాలాను పెట్టాడు. తర్వాత మసాలా పొడి చల్లి దోశలను ప్లేట్లలో అందించాడు. ‘బెంగళూరులోని(Bangalore) అత్యంత హైటెక్ దోశ కోసం క్రేజీ రష్అనే క్యాప్షన్తో దోశల తయారీ వీడియో ఫేస్ బుక్‌(Facebook) షేర్(share) చేసారు.

 

మిలియన్ల సంఖ్యలో దూసుకుపోతున్న దోశ తయారీ(Dosha preparation) వీడియో చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. పెనం తుడవడానికి చెఫ్ చీపురు ఉపయోగించడంపై పలువురు విమర్శలు చేశారు. ఇంకొందరు దోశపై అంత పెద్ద మొత్తంలో నూనె వాడటంపై(Using oil) మండిపడ్డారు. ‘అత్యంత హైటెక్ ఆయిల్ హార్ట్ డిసీజ్ దోశఅని.. ‘వావ్ టేస్టీ, కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులు(Heart diseases) ప్లేట్లో వడ్డించబడ్డాయి.. అద్భుతంఅంటూ వెటకారంగా కామెంట్లు పెట్టారు. వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్(viral) అవుతోంది.

ఇక దోశల్లో(Dosha) వాడే నూనె చాలా ముఖ్యమైనది. చాలామంది టిఫిన్స్‌(Tiffins) బయట హోటళ్లలో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం, నాణ్యత లేని ఆయిల్ను(Bad quality oil) వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health problems) వస్తాయి. నూనె కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పలేం. ఒక్కో ప్రాంతం వాళ్లు ఒక్కో నూనె వాడుతున్నారు. ఉత్తరాదిన ఆవాల నూనె(Mustard oil) వాడుతున్నారు. దక్షిణాదిలో పల్లినూనె, సన్ఫ్లవర్ఆయిల్​,​ కొబ్బరి నూనె వాడతారు. ఇదే బెస్ట్ నూనె(Best Oil) అనుకోవడం కరెక్టు కాదు. ప్రతీ నూనెలో కొవ్వుతో(Fat) పాటు మరికొన్ని పదార్థాలుంటాయి. ఇవి అందరికీ మేలు చేస్తాయని చెప్పలేం. అలాగని అందరి ఆరోగ్యాలను దెబ్బతీస్తాయని కూడా అనుకోవద్దు. కొన్ని పదార్థాలు కొందరికి అవసరమైతే, మరికొందరిలో సమస్యలు సృష్టిస్తాయి. ఒక దోశ తింటే 132 క్యాలరీల శక్తి వస్తుంది. రోజూ దోశ తినే అలవాటు ఉంటే బియ్యానికి బదులుగా ఓట్స్‌, రాగితో ఇంట్లోనే హెల్తీ దోశ చేసుకోవచ్చు.

ఇక ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫిన్స్తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు వారానికి ఒకటి లేదా రెండుసార్లకు పరిమితం చేస్తే మంచిది. సౌత్ఇండియన్ఫుడ్‌(South Indian food) చాలా హెల్తీ అని లాగించేవాళ్లు కాస్త డైట్ప్రకారం మితంగా తీసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యం తప్పదంటారు న్యూట్రిషియన్లు.