వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు

Ambati Rayudu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు కాక పుట్టిస్తున్నాయి. అధికార వైకాపాకు మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీని వీడుతున్నట్లు మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రకటించారు.

Courtesy: Top Indian News

Share:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు కాక పుట్టిస్తున్నాయి. అధికార వైకాపాకు మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీని వీడుతున్నట్లు మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’’ అని తెలిపారు. ఇటీవలే సీఎం జగన్‌ సమక్షంలో అంబటి రాయుడు వైకాపాలో చేరిన విషయం తెలిసిందే. అంబటి రాయుడు వైఎస్సార్‌సీపీలో చేరిన వారానికే వీడటం సంచలనంగా మారింది.

అంబటి రాయుడు వైసీపీలో చేరికతో.. గుంటూరు ఎంపీ సీటు రాయుడుకు ఖాయమనే ప్రచారం పార్టీలో వినిపించింది. రాయుడిని గుంటూరు లేదా నర్సరావు పేట నుంచి బరిలోకి దింపే విధంగా పార్టీలో ఆలోచన జరిగింది. తాజాగా సర్వే నివేదికల్లో రాయుడకు అనుకూలంగా లేకపోవటంతో సీటు పైన హామీ దక్కలేదని తెలుస్తోంది. అభ్యర్దుల ఖరారు కసరత్తులో భాగంగా నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ క్రిష్ణదేవరాయులను గుంటూరుకు పంపి..అక్కడ అంబటి రాయుడును దింపే ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే రాయుడు ఎంత వేగంగా వైసీపీలో చేరారో..అంతే వేగంగా పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత అంబటి రాయుడు తన పొలిటికల్ ఇన్నింగ్స్ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు, నర్సరావు పేట ఎంపీల విషయంలో సీఎం జగన్ స్థానిక సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే కొత్త అభ్యర్దులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.