లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు.. 17 స్థానాలకు ఇంఛార్జిల నియామకం

Telangana BJP: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భాజపా సన్నద్దమవుతోంది. సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌ఛార్జులను నియమించింది.

Courtesy: Top Indian News

Share:

హైదరాబాద్‌: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భాజపా సన్నద్దమవుతోంది. సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌ఛార్జులను నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్‌ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భాజపా సన్నాహాలు చేస్తోంది. పార్టీలోని కీలక నేతలైన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించ లేదు.  

ఆదిలాబాద్ - పాయల్‌ శంకర్
పెద్దపల్లి - రామారావు పాటిల్
కరీంనగర్ - సూర్యనారాయణ
నిజామాబాద్ - ఏలేటి మహేశ్వరరెడ్డి
జహీరాబాద్ - కాటిపల్లి వెంకటరమణారెడ్డి
మెదక్ - పాల్వాయి హరీశ్‌ బాబు
మల్కాజిగిరి - పైడి రాకేశ్‌ రెడ్డి
సికింద్రాబాద్ - కె.లక్ష్మణ్
హైదరాబాద్ - రాజాసింగ్
చేవెళ్ల - ఏవీఎన్ రెడ్డి
మహబూబ్‌నగర్ - రామచంద్రరావు
నాగర్‌కర్నూల్ - మాగం రంగారెడ్డి
నల్లగొండ - చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
వరంగల్ - మర్రి శశిధర్‌రెడ్డి
మహబూబాబాద్ - గరికపాటి మోహనరావు
ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఇటీవల జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు స్థానాల్లో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 స్థానాల్లో, హైదరాబాద్ లో ఒక స్థానంలో విజయ ఢంకా మోగించింది. కోరుట్లలో ధర్మపురి అరవింద్, కరీంనగర్ లో బండి సంజయ్, దుబ్బాకలో రఘునందన్ రావు, హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గట్టి పోటీని ఇచ్చారు.