Blinken: రెండు దేశాలు కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి: బ్లింకన్

Canada: గత జూన్‌లో ఖలిస్తానీ (Khalistani) ఉగ్రవాది (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ

Courtesy: Image: Unsplash

Share:

Canada: గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పార్లమెంటుకు తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఈ హత్య (Murder) కేసు (Case)లో, భారత దేశ హస్తం ఉందని ఎటువంటి ఆధారాలు లేవంటూ భారత్ (India) తేల్చి చెబుతోంది. అయితే దీనికి సంబంధించి ఇరుదేశాలు కలిసికట్టుగా ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలి అంటూ, కెనడా (Canada) ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి భారతదేశం (India) తన వైపు నుంచి కూడా సహకరించాలని , US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల మాట్లాడారు. 

 

కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి: 

 

న్యూఢిల్లీ (New Delhi), ఒట్టావా మధ్య పెద్ద దౌత్య వివాదానికి దారితీసిన జూన్‌లో సిక్కు ఉగ్రవాది  (terrorist) హత్య (Murder)పై  కెనడా (Canada) జరిపిన దర్యాప్తుకు సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారతదేశానికి పిలుపునిచ్చారు. ఖలిస్తానీ (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్‌ (Hardeep Nijjar) హత్య (Murder)లో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా (Canada) ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సెప్టెంబరులో చేసిన ఆరోపణలతో భారతదేశం (India) మరియు కెనడా (Canada) మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అయితే ఇరుదేశాలు, భారత్ అలాగే కెనడా (Canada) మంచి స్నేహితులని, స్నేహితులు కలిసికట్టుగా తమ మధ్య వచ్చిన వివాదాన్ని పరిష్కరించుకోవాలని US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల మాట్లాడారు. ప్రత్యేక మీడియా సమావేశంలో, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మాట్లాడుతూ, కెనడా (Canada)లో ఖలిస్తానీ (Khalistani) అనుకూల కార్యకలాపాలు పెరుగుతున్నాయని, దీనికి సాక్ష్యం న్యూఢిల్లీ (New Delhi)లో జరుగుతున్న కొన్ని సంఘటనలే అంటూ చెప్పుకొచ్చారు. 

 

ఆధారాలు ఎక్కడ అంటున్న భారత్: 

 

జూన్‌లో జరిగిన నిజ్జర్‌ (Hardeep Nijjar) హత్య (Murder)లో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణకు మద్దతుగా కెనడా (Canada), తన మిత్రదేశాల నుంచి భారత్ (India)‌కు ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలు అందలేదని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ (Sanjay Kumar Verma) ది గ్లోబ్ అండ్ మెయిల్‌కి తెలిపారు. కెనడా (Canada) తన వైపు నుంచి చేస్తున్న దర్యాప్తులో భాగంగా తమకు ఇప్పటివరకు, హత్య (Murder) కేసు (Case)లో భారత్ (India) ప్రమేయం ఉంది అంటూ నిరూపితమయ్యే ఎటువంటి ఆధారాలు అందలేదని వర్మ (Sanjay Kumar Verma) అన్నారు. అసలు ఇప్పటివరకు దర్యాప్తులో పురోగతి ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు వర్మ (Sanjay Kumar Verma). అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా, భారతదేశ మీద ఇటువంటి నిందలు ఎలా వేస్తారు అంటూ కెనడా (Canada)ను మరొకసారి ప్రశ్నించడం జరిగింది. 

 

మళ్లీ మామూలు స్థితికి: 

 

కెనడా సెప్టెంబర్‌లో భారత్ (India)‌తో వాణిజ్య చర్చలను నిలిపివేసింది. వాణిజ్య మిషన్‌ను వాయిదా వేసింది, అయితే వాణిజ్య చర్చలను పునఃప్రారంభించేందుకు భారతదేశం (India) ఆసక్తిగా ఉందని హైకమిషనర్ తెలిపారు. ఈ విషయాలను చర్చించడానికి..కెనడియన్ వ్యాపారవేత్తల ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి న్యూఢిల్లీ (New Delhi) స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దౌత్య సంబంధాలను సరిదిద్దుకోవడానికి, వృత్తిపరమైన కమ్యూనికేషన్, సంభాషణలలో ఇరుపక్షాలు పాల్గొనవలసిన అవసరాన్ని వర్మ (Sanjay Kumar Verma) నొక్కిచెప్పారు. ఏదిఏమైనాప్పటికీ, ఎటువంటి ఆధారాలు లేకుండా నిందలు మోపడం, ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెంపాలని ప్రయత్నిస్తున్న ఎవరైనా సరే పట్టుబడక తప్పదు అంటూ, ఇటీవల కెనడా (Canada)లో మరణించిన హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Nijjar) కేసు (Case) విషయం గురించి మాట్లాడారు వర్మ (Sanjay Kumar Verma).