MLC Kavita:ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

రంజుగా ప్రచారం

Courtesy: Twitter

Share:

MLC Kavita: తెలంగాణలో ఎన్నికల (Telangana Election) వేడి (Heat) తారా స్థాయికి చేరుకుంది. ఒక పార్టీని మరో పార్టీ (Parties) దూషించడం షరా మామూలయిపోయింది. దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ రణ రంగంలా మారిపోయింది. అనేక మంది ఎన్నికల్లో (Election) తమ అభ్యర్థి గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా తమ అభ్యర్థే విజయం సాధిస్తాడని నమ్ముతున్నారు. అందుకోసం ఏమైనా చేసేందుకు వెనుకాడడం లేదు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి (CM) అయినా లేక వేరే పార్టీకి చెందిన అగ్ర నాయకుడైనా కానీ దూషణల పర్వం మొదలు పెడితే అది ఆగకుండా కొనసాగుతూనే ఉంది.  రాసేందుకు కూడా వీలు లేని మాటలను వారు ప్రయోగిస్తున్నారు. జనాలు వింటున్నారు కదా అని వారు చెబుతూ పోతున్నారు. ఇక పోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న జగిత్యాల, కోరుట్ల మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) చూస్తున్నారు. రాష్ట్రం మొత్తం పర్యటించకున్నా కానీ ఉమ్మడి నిజమాబాద్ మరియు ఉమ్మడి కరీంనగర్ లోని కొన్ని జిల్లాల్లో ప్రచారం చేస్తూ తనదైన ప్రసంగంతో ఓటర్లను (Voters) ఆకట్టుకునేందుకు ట్రై చేస్తోంది. నిన్న కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) ప్రచారం చేశారు. ప్రచారం సందర్భంగా ఆమె ఒక్కసారిగా మూర్చ వచ్చి కింద పడిపో బోయారు. కానీ అక్కడున్న వారికి తన పరిస్థితిని గురించి వివరించి బయటకు వెళ్లిపోయారు. 

మొన్న కేటీఆర్.. నిన్న కవిత.. 

బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కల్వకుంట్ల తారకరామారావు (KTR) మొన్న నిజామాబాద్ ప్రచారంలో ఉండగా.. వ్యాన్ నుంచి కింద పడిపోయారు. రోడ్ షో (Road Show) లో ఉన్న సమయంలో ఓపెన్ టాప్ వ్యాన్ రెయిలింగ్ (Railing) పట్టుకున్న కేటీఆర్ అది ఒక్కసారిగా కూలిపోవడంతో ముందుకు పడిపోయారు. వ్యాన్ రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఆ వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ (Sudden Break) వేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ గాయపడ్డారని తెలుసుకుని కేవలం రాష్ట్రంలోని వారు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక మంది ఎంక్వైరీలు చేశారు. కేటీఆర్ ఆరోగ్యం ఎలా ఉందా అని ఆరాలు (Enquiry) తీశారు. కానీ ఈ ప్రమాదంలో మాత్రం కేటీఆర్ కు ఎటువంటి గాయాలు కాలేదు. ఆయన ఎటువంటి గాయాలు కాకుండా బయట పడ్డారు. కొన్ని గాయాలతోనే తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని స్వయాన కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ ఇలా వెల్లడించిన తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. అది వరదాక కేటీఆర్ ఆరోగ్యం గురించి ఎంక్వైరీలు కొనసాగాయి. 

కవితకు సృహ తప్పింది.. 

ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavita) జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డా.. సంజయ్ కుమార్ (Sanjay Kumar) తరఫున ప్రచారం చేస్తోంది. నిన్న జగిత్యాల జిల్లాలోని ఇటిక్యాల్‌ లో రోడ్‌ షో సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత స్పృహతప్పి పడిపోయారు. మండే ఎండలో ఆమె వాహనంపై పార్టీ నేతల మధ్య నిలబడి ప్రచారం నిర్వహించారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా కవిత అకస్మాత్తుగా ఫీల్ (Feel) అవడం ప్రారంభించారు. స్థలం నుండి దూరంగా వెళ్లి కుప్పకూలింది. వెంటనే ఆమె వద్దకు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు (BRS), ఇతర నేతలు వెళ్లారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ వసంత మరియు ఇతర కార్యకర్తలు ఆమె వద్దకు చేరుకుని ఆమెకు సపర్యలు చేశారు. దీంతో ఆమె కోలుకుని వెంటనే లేచారు. కవిత లేచిన తర్వాత తన ప్రచారాన్ని అలాగే కంటిన్యూ (Continue) చేశారు. 

కోటలు దాటుతున్న మాటలు.. 

ఎన్నికల (Elections) సందర్భంగా మాటలు కోటలు దాటుతున్నాయి. ఎవరైనా సరే ఎవర్నైనా ఎలాగైనా దూషించుకోవచ్చుననే విధంగా అధికార ప్రతిపక్ష పార్టీల స్పీచ్ లు సాగుతున్నాయి. అతడు ఎటువంటి పొజిషన్ లో ఉన్నా కానీ అతడిని ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తున్నారు. ఈ తిట్ల దండకంలో ఏ పార్టీ నాయకులు వెనక్కు వెళ్లడం లేదు. ఒక పార్టీ (Parties) కంటే మరో పార్టీ నాయకుడు ఎక్కువగా దండకాన్ని ప్రయోగిస్తున్నారు. ఇక అన్ని పార్టీలు మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ప్రధాన పార్టీల మేనిఫెస్టోల్లో (Manifesto) ఎక్కువగా ఉచితాలు కనిపిస్తున్నాయని అంతా వాదిస్తున్నారు. ఇన్ని రకాల ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందని అంతా ఆందోళన చెందుతున్నారు. ఇన్ని ఉచితాలు (Free Schemes) ఇవ్వడం మంచిది కాదని చెబుతన్నారు. ఒక్క పార్టీ అని కాకుండా రాష్ట్రంలోని పెద్ద పార్టీలు అన్నీ ఉచితాల మీద ఫోకస్ చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితాలను నమ్ముకున్నాయి. ఇలా అయితే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అనేక మంది కామెంట్ చేస్తున్నారు. ఉచితాలను తగ్గించాలని కోరుతున్నారు. కేవలం ఉచితాల తోనే ఓట్లు వస్తాయని అనుకోవడం పొరపాటు అని కామెంట్ చేస్తున్నారు. ఉచితాల గురించి ప్రస్తావన లేకున్నా కానీ ప్రజలు విశ్వసిస్తే ఓటు వేసి గెలిపిస్తారని అంటున్నారు. ఇంతలా ఉచితాలు ప్రకటించాల్సిన పని లేదని అంటున్నారు.