Speaker Tammineni: ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్ కోరిక

అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

Courtesy: Twitter

Share:

Speaker Tammineni: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఏపిలో త్వరలో ఎన్నికలు(Elections) జరగబోతున్నాయి.. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల(Development of welfare schemes) గురించి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతున్నారు. ఇక వైసీపీ(YCP) చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర(Samajika Sadikara Bus Yatra) విజయనగరం జిల్లాలో జైత్ర యాత్రగా సాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస(Amadalavalasa) పరిధిలోని సరుబుజ్జిలి మండలం కొత్తకోట గ్రామంలో గురువారం మహిళలు నిర్వహిస్తున్న వెల్‌నెస్‌ సెంటర్‌, డెయిరీని ప్రారంభించారు. అనంతరం అధికార పార్టీ వైసీపీ(YCP) చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర(Samajika Sadikara Bus Yatra) విజయనగరం(Vijayanagaram) జిల్లా రాజాం నియోజకవర్గంలో(Rajam Constituency) ప్రజలు ఘన స్వాగతం మధ్య జైత్రయాత్రగా మొదలైంది. అడుగడుగునా ప్రజలు బస్సు యాత్రకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు(Budi Mutyala Naidu), స్పీకర్ తమ్మినేని సీతారాంతో(Speaker Tammineni Sitaram) పాటు పలువురు వైసీపీ(YCP) కీలక నేతలు పాల్గొన్నారు.

ఏపీలో అధికార పార్టీ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు వైసీపీ(YCP) నేతలు. ఈ సందర్బంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్(Speaker Tammineni Sitaram) మాట్లాడుతూ... వైయస్సార్ సీపీ(YSRCP) పాలనపై విమర్శలు చేస్తున్న ప్రతి పక్షాలకు సామాజిక సాధికార జైత్రయాత్ర ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. జనప్రవాహంలా బస్సు యాత్ర సభకు ప్రజలు తరలిరావడం సీఎం జగన్(CM Jagan) పిలుపునకు ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు నిదర్శనమన్నారు. తాండ్ర పాపా రాయుడు(Tandra Papa Rayudu) పుట్టిన గడ్డ కాబట్టి ఈ ప్రాంతాల్లో అన్యాయాలు చేసిన వారిపై తిరగబడి ప్రజలు వైయస్సార్ సీపీని(YSRCP) గెలిపించారన్నారు. కుల గణన జరగాలని కేబినెట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు మరింత మేలు జరగుతుందని ప్రకటించారు.

టీడీపీ(TDP) హయాంలో విద్య,వైద్యం వంటి అనేక ప్రాధాన్య రంగాలను నిర్వీర్యం చేసారని, జగన్ ముఖ్యమంత్రి కాగానే అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ సామాజిక విప్లవం తీసుకువచ్చారన్నారు. అన్ని గ్రామాల్లో వెల్ నెస్ సెంటర్లు(Wellness centers) ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ విధానంలో మొబైల్ వ్యాన్ల ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అవినీతి లేకుండా లంచగొండులకు చోటు ఇవ్వకుండా అనేక సంక్షేమ పథకాలను జగన్ బటన్ నొక్కి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందచేస్తూ, జీవన ప్రమాణాలు పెంచుతుండటం అభివృద్ధి కాదా అని స్పీకర్‌ తమ్మినేని (Speaker Tammineni) ప్రశ్నించారు.

పేదలకు ఆర్థిక సాధికారత జగన్(Jagan) పాలనలో కలగడంతో కొనుగోలు శక్తి పెరిగి దేశంలోని జీడీపీలో(GDP) గణనీయ వృద్ధి సాధించడమే కాకుండా, అనేక రంగాల కేంద్ర సూచీల్లో కూడా మెరుగైన స్థానాల్లో రాష్ట్రం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాయని, అయినా సరే ఆ పార్టీ శ్రేణులు కడిగిన ముత్యం అంటూ చంద్రబాబును చెప్పుకోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేసారు.

నిపుణులు, స్పెషలిస్ట్‌ డాక్టర్లు ప్రజల ఇంటింటికీ వెళ్తున్నారని, మరే రాష్ట్రంలోనూ చేయని విధంగా ఉచితంగా మందులు అందజేశారని స్పీకర్‌ తమ్మినేని(Speaker Tammineni) అన్నారు. సీరియస్‌ కేసులు కూడా పెద్ద ఆసుపత్రులకు రిఫర్‌ అవుతున్నాయని చెప్పారు. 104, 108లను బలోపేతం చేసిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంచి ఆరోగ్య వ్యవస్థకు శ్రీకారం చుట్టారని, ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారన్నారు. సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.