War: మానవ విలువలను కాపాడాలంటూ కాంగ్రెస్

హమాస్- ఇజ్రాయిల్ యుద్ధం ఆగాలి..

Courtesy: Twitter

Share:

War: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. హఠాత్తుగా జరిగిన హమాస్ (Hamas) ఎటాక్ (Attack) కారణంగా ఎన్నో జీవితాలు కుప్పకూలాయి. ఇప్పుడు ఇరువైపుల నుంచి యుద్ధం (War) కొన్ని వేల జీవితాలను బలిగొంది. అయితే దీనికి సంబంధించి భారత రాజకీయ పార్టీ కాంగ్రెస్ (Congress) పార్టీ కాంగ్రెస్ లీడర్ జయ్ రామ్ రమేష్, జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు, ప్రత్యేకించి గాజాలో ఇజ్రాయిల్ హింస గురించి ఆపేందుకు, తమ భారత ప్రభుత్వం అమెరికాకి విజ్ఞప్తి చేయాలంటూ పిలుపునిచ్చింది. 

మానవ విలువలను కాపాడాలంటూ కాంగ్రెస్: 

ఇజ్రాయిల్ హ‌మాస్ యుద్ధం (War) కారణంగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. యుద్ధం (War) మొదలై ఇప్పటికే నెల కావస్తున్నప్పటికీ యుద్దం ఇంకా కొనసాగుతున్న వైనం కనిపిస్తోంది. ఇటువంటి హింసను ఆపేందుకు ఇటీవల కాంగ్రెస్ (Congress), భారత ప్రభుత్వం తరఫునుంచి అమెరికా, ఇజ్రాయిల్, యూరప్ యూనియన్లకు ప్రభుత్వాలకు ఒత్తిడి తీసుకురావాలి అంటూ విజ్ఞప్తి చేస్తుంది. ఎంతో మంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు యుద్ధం (War) కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, యుద్ధం (War)లో గాయపడిన వారికి చికిత్స పొందేందుకు హాస్పిటల్లో సౌకర్యాలు కూడా కొడవయ్యాయని, ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని, హింస కారణంగా మానవ విలువలు దిగజారిపోతున్నాయని, ఈ పరిస్థితి ముందుకు వెళ్లకుండా ఇతర దేశ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, భారత ప్రభుత్వం తరఫున నుంచి ఒత్తిడి తీసుకురావాలంటూ కాంగ్రెస్ (Congress) విజ్ఞప్తి చేసింది. 

యుద్ధం కారణంగా ఆర్తనాదాలు: 

ఇజ్రాయెల్ (Israel)-హమాస్ (Hamas) యుద్ధంలో కాల్పుల విరమణ (ceasefire)కు పిలుపునివ్వాలని మసాచుసెట్స్‌లోని యుఎస్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్‌ను పాలస్తీనా మహిళ నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బోస్టన్‌లోని ఒక రెస్టారెంట్‌లో, మహిళ తనను తాను పాలస్తీనా శరణార్థిగా వారెన్‌కు పరిచయం చేసుకుంటూ, గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడుల్లో తన కుటుంబంలోని 68 మంది సభ్యులు చనిపోయారని చెప్పడం కనిపిస్తుంది. ఆమె వారెన్‌ను, 'కాల్పు విరమణకు ముందు ఇంకా ఎంతమంది చనిపోవాలి?' అని అడుగుతుంది. తమ కుటుంబంలో శోకం.. ఇంక ఎంతమంది చూడాలి అంటూ, ఆ మహిళ బాధతో వస్తున్న ఉక్రోషంతో నిలదీయడం వీడియోలో కనిపిస్తుంది. 

ఇజ్రాయెల్ (Israel), గాజా (Gaza)లో కాల్పుల విరమణ (ceasefire) కోసం వాదించాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనియన్ అనుకూల నిరసనకారుల సమూహం, బోస్టన్ సిటీ హాల్ వెలుపల సెనేటర్ వారెన్ హాజరైనవేళ ఒక మార్చ్ నిర్వహించింది. బోస్టన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం, సెనేటర్ వారెన్ మాట్లాడటం ముగించిన అనంతరం, సిటీ హాల్ మెజ్జనైన్ నుండి బయలుదేరుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఒక నిరసనకారుడు నేరుగా సెనేటర్ వారెన్‌ను ఉద్దేశించి, గాజా (Gaza)లో కాల్పుల విరమణ (ceasefire)కు మద్దతు ఇవ్వాలని ఆమెను కోరారు. చాలామంది ఆందోళనకారులు కాల్పుల విరమణ (ceasefire) కోసం నినాదాలు చేయగా పోలీసులు సంఘటనను సర్దుమనుగనిచ్చారు. 

మరో సంఘటనలో, అక్టోబర్ 7 ఉదయం 6.30 గంటలకు సూపర్‌నోవా ఉత్సవానికి చేరుకున్నప్పుడు పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని.. ఆ తర్వాత అంతా అంధకారంగా మారింది అంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). 

తనతో పాటు 14 మంది మూడు గంటలు దాకున్నప్పటికీ, చాలామంది వాళ్లని కనిపెట్టి తన బాయ్ ఫ్రెండ్ ను కాల్చి చంపారని బాధాకరమైన విషాద కథను వెల్లడించింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). ఆ సమయంలోనే చాలామంది తమని కాపాడమంటూ తమని బందీలుగా చేయొద్దు అంటూ ఆర్తనాదాలు చేసినట్లు ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model) వెల్లడించింది. ఈ ఘోరమైన సంఘటన నుంచి బయటపడేందుకు చాలామందికి ఫోన్లు చేస్తూ, భయానక సందర్భం మరొకసారి గుర్తు చేసుకుంది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model).