కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లూమ్ పరిశ్రమకు అండగా నిలవాలి: కేటీఆర్

పవర్ లూమ్ పరిశ్రమకు సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Courtesy: Top Indian News

Share:

సిరిసిల్ల: పవర్ లూమ్ పరిశ్రమకు సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్‌ లూమ్‌ పరిశ్రమకు అండగా నిలవాలని, బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు. పవర్‌ లూమ్‌ వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని కేటీఆర్‌ విజ్ణప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్ల పవర్‌ లూమ్‌ పరిశ్రమకు సంబంధించి ఆయన ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ట్వీట్ తో పాటుగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి ప్రధాన దినపత్రికలలో ప్రచురించిన కథనాలను కూడా పోస్టు చేశారు.

గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెంది. పవర్ లూమ్ ద్వారా ఎంతో నైపుణ్యం కలిగిన మన నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని తెలిపారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని కేటీఆర్‌ అన్నారు.

పవర్‌ లూమ్‌ వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని కేటీఆర్‌ డిమాండు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్‌ లూమ్‌ పరిశ్రమకు అండగా నిలవాలని.. బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని.. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళుతుందని పేర్కొన్నారు.