Elections: మైనారిటీల డిక్లరేషన్‌ను విడుదల చేసిన కాంగ్రెస్

Elections: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ (Telangana)లోని ప్రతి పార్టీ కూడా తనదైన శైలిలో మానిఫెస్టో రిలీజ్ చేయడమే కాకుండా, ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న వైనం కనిపిస్తోంది. అయితే ఇటీవల ఈ క్రమంలోనే బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎన్నికల (Elections) నియమాలను ఉల్లంఘిస్తుంది అంటూ కాంగ్రెస్ (Congress) పార్టీ ఆరోపించడం కూడా జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రయోజనాలు, పరిపాలనా చర్యల పరంగా ముస్లిం (Muslim) సమాజానికి న్యాయం చేసిందని పేర్కొంటూ, టిపిసిసి చీఫ్ […]

Share:

Elections: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ (Telangana)లోని ప్రతి పార్టీ కూడా తనదైన శైలిలో మానిఫెస్టో రిలీజ్ చేయడమే కాకుండా, ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న వైనం కనిపిస్తోంది. అయితే ఇటీవల ఈ క్రమంలోనే బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎన్నికల (Elections) నియమాలను ఉల్లంఘిస్తుంది అంటూ కాంగ్రెస్ (Congress) పార్టీ ఆరోపించడం కూడా జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రయోజనాలు, పరిపాలనా చర్యల పరంగా ముస్లిం (Muslim) సమాజానికి న్యాయం చేసిందని పేర్కొంటూ, టిపిసిసి చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురువారం మాట్లాడుతూ, తమ మైనారిటీ డిక్లరేషన్ ముస్లిం (Muslim)లకు మరిన్ని ప్రయోజనాలను అందజేస్తుందని అన్నారు. 

ముస్లింల కోసం చేయి అందిస్తున్న కాంగ్రెస్: 

గురువారం గాంధీభవన్‌లో మైనారిటీల డిక్లరేషన్‌ (Declaration)ను విడుదల చేసిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు, యువకులు, మహిళలు, మైనార్టీల కోసం డిక్లరేషన్‌ (Declaration)లు ప్రకటించిన కాంగ్రెస్‌ (Congress) అన్ని వర్గాలకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. ముస్లిం (Muslim)లకు మంత్రులు, రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్‌ (Congress) ఎన్నో అవకాశాలు కల్పించిందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ల తరహాలో మైనారిటీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ (Congress) రూ. 4 వేల కోట్లు కేటాయిస్తుందని, వక్ఫ్‌ భూముల పరిరక్షణను కాంగ్రెస్‌ (Congress) చూసుకుంటుందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.

మహ్మద్‌ జహరుద్దీన్‌ను కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థిగా పేర్కొనడంతో ఎంఐఎం (MIM) జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేయడం జరుగుతుందని ఆరోపించారు. బీజేపీ (BJP) అభ్యర్థి పోటీ చేస్తున్న గోషామహల్‌ నుంచి ఎంఐఎం (MIM) ఎందుకు పోటీ చేయలేకపోయింది.. బీఆర్‌ఎస్‌ (BRS), బీజేపీ (BJP)కి.. ప్రత్యేకంగా ఎంఐఎం (MIM) తనదైన శైలిలో పరోక్షంగా మద్దతిస్తోంది అని ఆరోపించారు. మైనారిటీ డిక్లరేషన్‌ (Declaration)లో, కాంగ్రెస్ కుల గణనకు హామీ ఇచ్చింది, నిరుద్యోగ యువకులకు రూ. 1,000 కోట్లు రుణాలు మరియు ముస్లిం (Muslim)లు, క్రైస్తవులు మరియు సిక్కులకు అబ్దుల్ కలాం తౌఫా-ఇ-తలీమ్ పథకం కింద రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించడంతోపాటు, ప్రయోజనాలను అందించడానికి హామీ ఇస్తుందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద కాంగ్రెస్ ఇంటి స్థలం.. రూ. 5 లక్షల ఆర్థిక సహాయం మరియు నూతన వధూవరులైన ముస్లిం (Muslim)లు, క్రిస్టియన్లు మరియు సిక్కులకు రూ. 1.60 లక్షలు అందిస్తుంది అని డిక్లరేషన్ పేర్కొంది. 

Also Read: KTR: సిరిసిల్లకు పెద్దపీట వేస్తున్న కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల (Elections)జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana) మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. తెలంగాణ (Telangana) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Elections) నవంబర్ 30న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న అంతేకాకుండా నవంబర్ 17న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు(Elections) జరగనున్నాయి. నవంబర్ 23న రాజస్థాన్ ఎన్నికలు(Elections) జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది మరియు డిసెంబర్ 5 నాటికి పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మాత్రమే రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. 

ఎన్నికలు (Elections) దగ్గర పడుతున్న వేళ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని పదేపదే ఉల్లంఘిస్తోందని తెలంగాణ (Telangana) కాంగ్రెస్ (Congress) ఆరోపిస్తూ, పార్టీ ఎన్నికల (Elections) సంఘానికి ఫిర్యాదు (complaint) చేసింది. టిపిసిసి అధ్య‌క్షుడు ఎ రేవంత్ రెడ్డి  (Revanth Reddy) న్యూఢిల్లీలో విలేఖ‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ, నిజానికి తమ ఆందోళన రైతులకు రైతు బంధు ప్రయోజనాలను అందించడానికి వ్యతిరేకంగా కాదని.. వాస్తవానికి, తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఈ నిధులను నవంబర్ 2 లోపు రైతుల ఖాతాలకు బదిలీ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామనీ.. అన్ని సంక్షేమ పథకాల కింద నిధులను బదిలీ చేయడానికి, లబ్ధిదారులకు భరోసా ఇవ్వడానికి ఈ పద్ధతిని అనుసరించాలని.. నామినేష‌న్ రోజు కంటే ముందే వారి హ‌క్కుల‌ను పొందాలి అని అన్నారు.

తెలంగాణ పోలింగ్ వివరాలు: 

గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ – నవంబర్ 3

నామినేషన్ దాఖలుకు చివరి తేదీ – నవంబర్ 10

నామినేషన్ల పరిశీలన తేదీ – నవంబర్ 13

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – నవంబర్ 15

పోలింగ్ తేదీ – నవంబర్ 30

కౌంటింగ్ తేదీ – డిసెంబర్ 3