BRS: బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పాల్వాయి స్రవంతి

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..

Courtesy: Twitter

Share:

BRS: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి పార్టీ కూడా తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల తేదీని ఖరారు చేసిన వైనం కనిపిస్తోంది. అయితే ఎన్నికల జోరు కొనసాగిస్తున్న వేళ, బిఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ (Shock) తగిలిన సంఘటన ఎదురయింది. సుమారు 1000 మంది పైగా బిఆర్ఎస్ (BRS) నేతలు కాంగ్రెస్ (Congress) కండువ వేసుకున్నారు. అయితే మరోవైపు కాంగ్రెస్ (Congress) నేతలు మరికొందరు బిఆర్ఎస్ లో కలవడం జరుగుతోంది. ఇటీవల పాల్వాయి స్రవంతి, కాంగ్రెస్ (Congress) నుంచి బిఆర్ఎస్ లోకి అడుగు పెట్టడం జరిగింది. 

 

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..: 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ (Congress) నేత పాల్వాయి స్రవంతి పార్టీకి రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ (Congress)‌ కమిటీ (టీపీసీసీ) అధికార ప్రతినిధి స్రవంతి మాట్లాడుతూ..కాంగ్రెస్ (Congress) పార్టీ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ (Congress) పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీ ‘బ్రోకర్ల’ చేతుల్లో ఉందని స్రవంతి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ప్రతిఒక్కరికీ కీలకమైన ఎన్నికలు. 

 

తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ : 

ఇటీవల కోదాడలో కాంగ్రెస్ (Congress)‌కు మద్దతు తెలుపుతూ, నాలుగుసార్లు ఎమ్మెల్యే (MLA)గా గెలిచిన వి.చందర్‌రావు (Chander Rao) తో పాటు సుమారు 1,000 మంది ద్వితీయశ్రేణి బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ (Congress)‌లో చేరారు. ఆయన భార్య పద్మావతి రెడ్డి 2014లో కోదాడ నుంచి పోటీ (Race) చేసి గెలుపొందారు. కాంగ్రెస్ (Congress)‌లో చేరిన వారిలో డీసీసీబీ మాజీ చైర్మన్ బూర పుల్లారెడ్డి, ఎమ్మెల్యే (MLA)గా పోటీ (Race) చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీ ఉన్నారు. 2018లో స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందిన బొల్లం మల్లయ్య యాదవ్‌ను మార్చాలనే తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌ తన స్థానంలో నిలబెట్టిందని వాపోయారు. కోదాడలో 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ (Congress) విజయం సాధిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

 

ఎన్నికల జోరు: 

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో (Manifesto) గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana) మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. అయితే ఇటీవల తెలంగాణ (Telangana) బిఆర్ఎస్(BRS) చేసిన మేనిఫెస్టో (Manifesto) రిలీజ్ చేసిన తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కెసిఆర్. 


 

BRS మేనిఫెస్టో, కెసిఆర్ ఇచ్చిన హామీలు:

 

సౌభాగ్యలక్ష్మి పథకం (scheme) ద్వారా అర్హులైన నిరుపేద మహిళలందరికీ నెలకు 3000 అందజేయడం.

1. అన్ని అర్హత కలిగిన BPL కుటుంబాలకు 400 గ్యాస్ సిలిండర్.

2. ఆసరా పింఛన్లను 5000లకు పెంచడంతోపాటు వార్షిక పెంపుదల 500.

3. ఆరోగ్యశ్రీ భీమా పథకం (scheme) కవరేజీని 15 లక్షలకు పెంచేందుకు కేసీఆర్ (KCR) ఆరోగ్య రక్ష పథకం (scheme).

4. రైతు బంధు పథకం (scheme) ప్రారంభ పెంపు 11000తో ఎకరానికి సంవత్సరానికి 16000 పెంచబడుతుంది.

5. ప్రభుత్వం 100% ప్రీమియం చెల్లించి బీపీఎల్ కార్డుదారులందరికీ, 5 లక్షల బీమా పథకాన్ని (scheme) అందజేస్తామని కేసీఆర్ (KCR) భీమా ప్రతి ఇంటికి ధీమా వ్యక్తం చేశారు.

6. గృహలక్ష్మి పథకం (scheme) కింద హైదరాబాద్‌లో 1లక్ష, 2బిహెచ్‌కె ఇళ్లను నిర్మిస్తున్నారు.

7. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 119 రెసిడెన్షియల్ పాఠశాలలు,

మైనారిటీ జూనియర్ కాలేజీలను రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చాలి.

8. మహిళా స్వశక్తి గ్రూపులకు సొంత భవనాలు.

9. వారిని రాష్ట్ర పిల్లలుగా అరిగినలోకి తీసుకుని తెలంగాణ (Telangana) ప్రభుత్వం అనాథ పిల్లల పథకాన్ని (scheme) అమలు చేయడం.

10. అసైన్డ్ భూములపై ఆంక్షల తొలగింపు.

11. సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్ పెన్షన్లపై ప్రత్యేక రీసెర్చ్.

12. రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అందించేందుకు తెలంగాణ (Telangana) అన్నపూర్ణ పథకం (scheme) అమలు.

Tags :