Delhi: కృత్రిమ వర్షానికి ముందే మోస్తరు వాన.. ఢిల్లీ వాసులకు స్వల్ప ఊరట

Delhi: రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో(Air Pollution) తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ(Delhi) వాసులకు తాజాగా స్వల్ప ఊరట కలిగింది. ఢిల్లీతో సహ నోయిడా

Share:

Delhi: రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో(Air Pollution) తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ(Delhi) వాసులకు తాజాగా స్వల్ప ఊరట కలిగింది. ఢిల్లీతో సహ నోయిడా, గురుగ్రామ్‌, ఎన్సీఆర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఓ మోస్తారు వాన పడింది. ఇది రాజధానానిలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పుకు దారితీసింది. గాలిలో ఉన్న విష‌పూరిత వాయులు కొంత వ‌ర‌కు క్లీన్ అయ్యాయి. గాలి నాణ్యత సూచి కూడా స్పల్పంగా మెరుగుపడింది.  

 

దిల్లీ-ఎన్‌సీఆర్‌ (Delhi-NCR) వర్షాల తరువాత గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం(Air Pollution), పొగమంచు నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వర్షం తర్వాత దిల్లీలో(Delhi) గాలి నాణ్యత సూచికలో(Air Quality Index) క్షీణత నమోదైంది. కానీ గాలి నాణ్యత(Air quality) ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆనంద్ విహార్‌లో శనివారం ఉదయం 282, ఆర్‌కే పురంలో 220, పంజాబీ బాగ్‌లో 236, ఐటీఓలో 263గా ఏక్యూఐ (AQI) స్థాయిలు ఉన్నాయి. దిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. వర్షాలు కురిసిన తర్వాత కాలుష్యం(Pollution) కాస్త తగ్గుముఖం పట్టిందని, అయితే గాలి నాణ్యత ఇంకా పూర్తిస్థాయిలో మెరుగుపడలేదని చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నామని వివరించారు.

 

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో(Delhi-NCR) దాదాపు 15 రోజుల పాటు కాలుష్య స్థాయి(Pollution level) చాలా దారుణంగా ఉంది.  ప్రజలకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. వర్షం కారణంగా నోయిడా(Noida) సహా ఎన్‌సీఆర్‌లోని ప్రజలు కాలుష్యం నుంచి ఉపశమనం పొందారు. దీపావళి(Diwali) సందర్భంగా ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతున్నారు. 10 రోజుల తర్వాత దిల్లీలో కాలుష్యం స్థాయి తగ్గిందని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్(Minister Gopal Roy) అన్నారు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. దిల్లీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ సహా వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని ఆ విభాగం సీనియర్ శాస్త్రవేత్త కుల్దీప్ శ్రీవాస్తవ(Kuldeep Srivastava) తెలిపారు.

 

దిల్లీలో గత వారం రోజులుగా వాయు నాణ్యత విపరీతంగా క్షీణించి ప్రమాదకర స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. దిల్లీ(Delhi) అంతటా విషపూరిత పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడమే దిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు(Pollution control) చర్యలు చేపట్టిన దిల్లీ ప్రభుత్వం.. ఈ నెల 20న కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించాలని యోచించింది. ఐఐటీ కాన్పుర్‌తో(IIT Kanpur) కలిసి మేఘమథనం(Cloud Formation) జరిపే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఈలోగానే వర్షాలు కురుస్తుండటం ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కల్పించింది.

సరి-బేసితో రద్దీ తగ్గుతుంది..

ఇదిలా ఉండగా.. దిల్లీలో వాయు కాలుష్యంపై(Air pollution) ఇటీవల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు(Supreme Court).. కాలుష్య నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని దిల్లీ సహా పొరుగు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలోనే దిల్లీ ప్రభుత్వం ప్రకటించిన ‘సరి-బేసి’ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి విధానాలు తక్కువ ఫలితాలను ఇస్తాయని పేర్కొన్న సుప్రీం.. దానిపై వివరణ ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆప్‌ సర్కారు(Aap Govt) న్యాయస్థానానికి అఫిడవిట్‌ దాఖలు చేసింది.

 

సరి-బేసి విధానం వల్ల రహదారులపై రద్దీ తగ్గుతుందని దిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ‘‘సరి-బేసి విధానం సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి. దీని ద్వారా ప్రజా రవాణా వినియోగం పెరగడంతో పాటు 15శాతం ఇంధన వినియోగం తగ్గుతుంది. రోడ్లపై రద్దీ కూడా తగ్గడంతో కాలుష్యం కూడా నియంత్రణలో ఉంటుంది’’ అని కోర్టుకు తెలియజేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపనుంది.

 

ఢిల్లీలోని గాలి నాణ్యత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజధాని నగరాల్లో అధ్వాన్నంగా ఉంది, చికాగో విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం వాయు కాలుష్యం దాదాపు 12 సంవత్సరాల ఆయుర్దాయం తగ్గిస్తుందని కనుగొన్నారు.