క్రాకర్ బ్యాన్ పని చేస్తే ఢిల్లీ 8 సంవత్సరాలలో ఉత్తమ దీపావళి ఎయిర్ క్వాలిటీని నమోదు చేయవచ్చు

కాలుష్యం అరికట్టడానికి..

Courtesy: Twitter

Share:

New Delhi: ఢిల్లీ (New Delhi)లో రోజురోజుకీ కాలుష్యం (Pollution) అధికంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ (New Delhi) కాలుష్యం (Pollution) కారణంగా అనారోగ్య సమస్యలు  (Problem) వాటిల్లుతాయి అంటూ కొన్ని విషయాలు పాటించవలసిందిగా కోరుతుంది ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే పాఠశాలలకు (School) సెలవులు ప్రకటించింది ఢిల్లీ (New Delhi). కాలుష్యం (Pollution) తారస్థాయికి చేరడంతో శ్వాసకోశ  (Respiratory) సమస్యలు  (Problem) ఎదురవుతాయి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంటూ ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. దీపావళి (Diwali) నాడు ఉదయం ఏడు గంటలకు, ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు కారణంగా ఢిల్లీ (New Delhi)లో కాలుష్యం (Pollution) కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. 

ఢిల్లీలో క్రాకర్స్ కాల్చడం బ్యాన్: 

ఢిల్లీ (New Delhi)లోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించింది ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం. తీవ్రమైన వాయు కాలుష్యం (Pollution)తో పోరాడుతున్నందున పాఠశాలలు (School) ఇప్పటికే తాత్కాలికంగా సెలవులు ప్రకటించింది. మరోవైపు కార్యాలయాలను మూసివేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని కాలుష్య కారణంగా పలు ఆంక్షలు తీసుకోవాలి అంటూ నిర్ణయాలు చేస్తున్నారు. గత మూడేళ్ల కాలుష్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రాజధాని నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం మరియు వినియోగంపై సమగ్ర నిషేధాన్ని ఢిల్లీ (New Delhi) ప్రకటించింది.

అయితే, రాజధానిలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి అక్కడక్కడ పటాకులు కాల్చిన సంఘటనలు నమోదయ్యాయి. అయితే ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఎయిర్ క్వాలిటీ 200 ఉండగా, తక్కువ ఉష్ణోగ్రతలు మరియు బాణసంచా కాల్చడం వల్ల ఆదివారం రాత్రి ఢిల్లీ (New Delhi)లో కాలుష్య స్థాయిలు కాస్త పెరిగినట్లే తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఢిల్లీ (New Delhi) కాలుష్యం (Pollution) లో తిరగడం అనేది, రోజుకి 12 నుంచి 13 సిగరెట్లు కాల్చడంతో సమానమని డాక్టర్లు వెల్లడించారు. అయితే ఢిల్లీ (New Delhi)లో వర్షపాతం నమోదు అయితే తప్పకుండా కాలుష్య పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అంటూ అధికారులు అంచనా వేస్తున్నారు.

బడులకు సెలవులు పెంపు: 

ఢిల్లీ (New Delhi)లో కాలుష్యం  (Pollution) కారణంగా ప్రైమరీ స్కూల్లకు (School) సెలవులు ప్రకటించగా, మరోవైపు 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు స్కూల్లో (School) విద్యా బోధన నిర్వహించవచ్చు, లేదంటే ఆన్లైన్ తరగతులు నిర్వహించిన పర్లేదు అంటూ ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా ఢిల్లీ (New Delhi)లో ఎటువంటి కన్స్ట్రక్షన్ పనులు జరగకుండా, డీజిల్ బళ్ళు నిషేధించడం, చెత్తను తగలబెట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహించకుండా.. చర్యలు తీసుకుంటామని ఢిల్లీ (New Delhi) పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) ప్రకటించారు. ఇప్పటికీ కూడా ఢిల్లీ (New Delhi)లోని కాలుష్యం  (Pollution) అరికట్టడంలో భాగంగా నిరంతరం 18 వేల ట్యాంకర్ల నీళ్లు, రోడ్ల మీద, చెట్ల మీద చల్లడం జరుగుతుంది.

ఎయిర్ క్వాలిటీ, AQI 0-50 వరకు ఉంటే, కాలుష్యం (Pollution) లేనట్టు. AQI 400 నుంచి 500 మధ్యలో ఉంటే, ప్రజల ఆరోగ్యానికి (Health) ముప్పు వాటిల్లుతున్నట్టు. ఇప్పుడు న్యూఢిల్లీ (New Delhi)లో AQI 483, పాకిస్తాన్ లాహోర్ లో AQI 371, తర్వాత కోల్ కత్త (Kolkata)లో AQI 206గా ఉండగా ఈ మూడు నగరాలు (City) అత్యధిక కాలుష్యం (Pollution)తో నిండిన నగరాలుగా (City) జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తరువాత బంగ్లాదేశ్, చైనా, కువైట్ కి చెందిన నగరాలు (City) అత్యధిక కాలుష్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా న్యూ ఢిల్లీ (New Delhi), పాకిస్తాన్ దేశంలో లాహోర్ (Lahore), కోల్ కత్త (Kolkata), ముంబై వంటి ప్రధాన నగరాల (City)లో ఎయిర్ క్వాలిటీ రేట్ పూర్తిగా పడిపోయింది. ప్రజలను బయటికి రావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. శీతాకాలం (Winter)లో ఎక్కువ గాలులు లేకపోవడం వల్ల, ఎక్కడ కాలుష్యం (Pollution) అక్కడే నిలిచిపోయి ఉంటుంది. ఈ పరిస్థితుల కారణంగా భారతదేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో సుమారు రెండు కోట్ల మంది ప్రజలు కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.