భారత ఇంధన రంగంలో విశేష సేవలందించిన డా.సేతురత్నం ఇకలేరు

Dr TS Sethuratnam Passes Away: భారత దేశం గొప్ప వ్యక్తిని కోల్పోయింది. దేశ ఇంధన రంగంలో విశేష సేవలు అందించి, తనదైన ముద్ర వేసిన డాక్టర్ టీఎస్ సేతురత్నం  95 ఏళ్ల వయసులో బుధవారం కన్నుమూశారు.

Courtesy: Top Indian News

Share:

దిల్లీ: భారత దేశం గొప్ప వ్యక్తిని కోల్పోయింది. దేశ ఇంధన రంగంలో విశేష సేవలు అందించి, తనదైన ముద్ర వేసిన డాక్టర్ టీఎస్ సేతురత్నం  95 ఏళ్ల వయసులో బుధవారం కన్నుమూశారు. దిల్లీలోని సాకేత్‌లోని కుమారుడు రవి నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ ఛైర్మన్ ఎస్ రవికి తండ్రి. గత కొన్ని వారాలుగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సేతురత్నం బుధవారం తుది శ్వాస విడిచారు. డాక్టర్ సేతురత్నం చివరి క్షణాలను అతని భార్య శకుంతల సేతురత్నం, కుటుంబసభ్యులతో గడిపారు. 

భారతదేశ ఇంధన రంగానికి కీలక పిల్లర్ గా పని చేసిన సేతురత్నం
డాక్టర్ సేతురత్నం తన 80 ఏళ్ల వయసు వరకు దేశ ఇంధన రంగంలో వివిధ పదవుల్లో చురుకుగా పని చేసి తనదైన ముద్ర వేశారు. అతను జాతీయ సంస్థల సృష్టికర్తగా మాత్రమే కాకుండా, భారతదేశ ఇంధన రంగానికి కీలకమైన వ్యక్తిగా పేరు పొందారు. మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ మరియు BSES చైర్మన్‌గా ఆయన పనిచేశారు. ఇలా తన జీవితంలో ఆయన ఎన్నో ఉన్నత స్థాయి పదవులు నిర్వర్తించారు. 

ఇంధన రంగంలో అనేక కీలకమైన పదవుల్లో సేతురత్నం పనిచేశాడు. అతను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక కమిటీలలో సభ్యుడిగా వ్యవహరించారు.  ఇంధన రంగ ప్రైవేటీకరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి కమిటీలో డాక్టర్ సేతురత్నం కూడా సభ్యుడు. జాతి నిర్మాత డాక్టర్ సేతురత్నం విశిష్ట సేవలకు గాను నేడు మొత్తం ఇంధన పరిశ్రమ మరియు దేశం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తోంది.

డాక్టర్ సేతురత్నం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) మాజీ చైర్మన్ రవికి తండ్రి. రవి దేశంలోని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ లలో ఒకరు.  అతను ఎల్‌ఐసి, ఒఎన్‌జిసి, బిహెచ్‌ఇఎల్, ఐడిబిఐ బ్యాంక్ మరియు అనేక ఇతర ప్రసిద్ధ సంస్థలతో సహా 45 కంటే ఎక్కువ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో కూడా ఉన్నారు.