అరేబియా సముద్రంలో చమురు నౌకపై దాడి.. షిప్ లో 20 మంది భారతీయులు!

Drone attack: అరేబియా సముద్రంలో భార​త్ వైపు ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకలో అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేపింది. సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తుండగా గుజరాత్‌ తీరంలో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు భారత కోస్ట్​ గార్డు  వర్గాలు తెలిపాయి.

Courtesy: Top Indian News

Share:

అరేబియా సముద్రంలో భార​త్ వైపు ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకలో అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేపింది. సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తుండగా గుజరాత్‌ తీరంలో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు భారత కోస్ట్​ గార్డు  వర్గాలు తెలిపాయి. పోర్​బందర్ ​కు నైరుతి దిశగా దాదాపు 200 కి.మీల దూరంలో ఈ ఘటన జరిగిందని యూకే మారిటైమ్‌ ఏజెన్సీ వెల్లడించింది. నౌకలో ముడి చమురు ఉన్నట్లు వెల్లడించింది. దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్‌ పేలి అగ్నిప్రమాదం జరిగినట్లు రక్షణ శాఖ వర్గాలు వివరించాయి. సమాచారం అందుకున్న  కోస్ట్​ గార్డు వెంటనే ఐసీజీఎస్‌ విక్రమ్‌ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, అయితే నౌకకు కొంచం మేర నష్టం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.

కాగా, ఈ ఘటనపై భారత నేవీ ప్రకటన విడుదల చేసింది. ఆ నౌక సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్నట్లు నేవీ తెలిపింది. ప్రస్తుతం భారత ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ వెలుపల ఉన్న ఈ వాణిజ్య నౌకకు సాయం చేసేందుకు భారత నేవీకి చెందిన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఆ నౌకపై డ్రోన్‌ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.‘‘పోర్‌బందర్‌ తీరానికి 217 నాటికల్‌ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్‌ ప్లూటోలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. డ్రోన్‌ దాడి కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్‌ విక్రమ్‌ ఘటనాస్థలానికి వెళ్లింది. వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, నౌక మాత్రం దెబ్బతింది. దీనికి సాయం చేసేందుకు ఈ ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్‌ అలర్ట్‌ చేసింది’’ అని నేవీ అధికారులు వెల్లడించారు.  

ఇటీవల ఎర్ర సముద్రంలో ఇరాన్‌ మద్దతున్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌.. వాణిజ్య నౌకలపై తరచూ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హమాస్‌కు మద్దతు ప్రకటించిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌ దాడులు, హైజాక్‌లకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హిందూ మహాసముద్రంలో నౌకపై దాడి జరగడం కలకలం రేపింది. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.

ఇటీవల జరిగిన సంఘటనలు
ఇజ్రాయెల్ అనుబంధ నౌకను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలి కాలంలో, హిందూ మహాసముద్రంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కార్గో షిప్ అనుమానాస్పద డ్రోన్ దాడిని ఎదుర్కొంది. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ దాడికి కారణమని ఆరోపణలు వచ్చాయి.