Uttarkashi: సొరంగంలో చిక్కుకున్న వారి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి..

కార్మికులు ఎలా ఉన్నారంటే..?

Courtesy: Twitter

Share:

Uttarkashi: ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలోని ఉత్తరకాశీలో(Uttarkashi) సొరంగం(Tunnel) కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న కూలీలకు సంబంధించిన విజువల్స్(Visuals) మొదటిసారి బయటకువచ్చాయి. సొరంగంలో మొత్తం 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే.

ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలోని ఉత్తరకాశీలో(Uttarkashi) సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న కూలీలకు సంబంధించిన విజువల్స్ మొదటిసారి బయటకువచ్చాయి. సొరంగంలో మొత్తం 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. కార్మికులంతా పసుపు, తెలుపు హెల్మెట్‌లు ధరించి ఉండడం విజువల్స్‌లో(Visuals) కనిపిస్తోంది. వారంతా పైప్‌లైన్(Pipe Line) ద్వారా పంపించిన ఆహార పదార్థాలను స్వీకరించడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా విజువల్స్‌లో చూడొచ్చు. కాగా ఉత్తరకాశీలో(Uttarkashi) చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్టు(Chardham Road Project) సొరంగం కూలిన ఘటనలో 41 మంది కూలీలు శిథిలాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారికి ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి 6 అంగుళాల వెడల్పున్న పైప్‌ను సొరంగంలోకి(Tunnel) పంపించారు.

 మరోవైపు సొరంగం కూలిన ఘటనలో ఇప్పటికే 10 రోజులు గడిచిపోగా.. 240 గంటలు పూర్తయ్యాయి. కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు(Assistive measures) ముమ్మరంగా కొనసాగుతున్నాయి.నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) డైరెక్టర్ అన్షు మనీష్ ఖల్ఖో(Anshu Manish Khalkho) మాట్లాడుతూ కార్మికులు ఎలా ఉన్నారో చూడడానికి పైప్‌లైన్ ద్వారా కెమెరాలను పంపిచినట్లు చెప్పారు. బయటికొచ్చిన విజువల్స్‌లో సొరంగంలో(Tunnel) చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా ఉండడంతో వారి కుటుంబసభ్యులకు పెద్ద ఊరట లభించింది. 10 రోజుల తర్వాత.. కార్మికుల మొదటి దృశ్యాలను చూసిన వారి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురైయ్యారు. "మాకు ఇంకా ఆశలు ఉన్నాయి. కానీ వారు బయకి వస్తేనే సంతృప్తి చెందుతాము," అని ఓ కార్మికుడి బంధువు వెల్లడించారు.

ఉత్తరాఖండ్(Uttarakhand) ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami) కూడా ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌(Rescue operation) గురించి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో(Social Media) అప్‌లోడ్ చేశారు. "మొదటి సారిగా ఉత్తరకాశీలోని సిల్క్యారాలో(Silkyara) నిర్మాణంలో ఉన్న సొరంగం(Tunnel) కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుల విజువల్స్ బయటకొచ్చాయి. కార్మికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు, త్వరలో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము," అని ఆయన తెలిపారు. 

వారితో కమ్యునికేట్(Communicate) కోసం మొబైల్‌లు, ఛార్జర్‌లను పైపు ద్వారా పంపిస్తామని తెలిపారు. సొరంగంలో(Tunnel) ఉన్న కార్మికులు ఇప్పటి వరకు డ్రైఫ్రూట్స్ , నీళ్లతోనే జీవిస్తున్నారు. సోమవారం వారికి గాజు సీసాలలో వేడి వేడి కిచ్డీని పంపించారు. పైప్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలు, మందులు అందిస్తున్నారు. కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) కొనసాగుతోంది.

గత 10 రోజులుగా లేదా 240 గంటలకు పైగా ఉత్తరకాశీ(Uttarkashi) సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి రెస్క్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెద్దగా ఫలితం లేకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం నిలువుగా డ్రిల్లింగ్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇది ప్రారంభంకానుంది. సొరంగంలోని చెత్త చెదారం, సొరంగం మధ్య ఉన్న అంతరాన్ని గురించిన అధ్యయనం చేయడానికి రెండు సార్లు డ్రోన్ సర్వే చేశారు. కానీ కూలిన శిథిలాలు అడ్డుగా ఉండడంతో ఆ డ్రోన్‌లు 28 మీటర్లకు మించి లోపలికి వెళ్లలేకపోయాయి. అలాగే ఒక డ్రోన్ కూడా దెబ్బతింది.

 

నవంబర్ 12 న, సొరంగం సిల్క్యారా(Silkyara) వైపున 60 మీటర్ల విస్తీర్ణంలో బురద పడిపోవడం వల్ల సిల్క్యారా నుండి బార్కోట్ వరకు నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయి 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. ఇంతలో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన రెండు రోబోటిక్స్ యంత్రాలు - 20 కిలోలు, 50 కిలోల బరువుతో సైట్‌కు చేరుకున్నాయి. చిక్కుకున్న కార్మికుల్లో జార్ఖండ్‌కు చెందిన 15 మంది, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది, ఒడిశాకు చెందిన ఐదుగురు, బీహార్‌కు(Bihar) చెందిన నలుగురు, పశ్చిమ బెంగాల్‌కు(West Bengal) చెందిన ముగ్గురు, ఉత్తరాఖండ్(Uttarakhand), అస్సాంకు(Assam) చెందిన ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌కు(Himachal Pradesh) చెందిన ఒకరు ఉన్నారు.