Revanth: అది కాంగ్రెస్ పేటెంట్ అన్న రేవంత్

సీఎం మీద సంచలన ఆరోపణలు

Courtesy: twitter

Share:

తెలంగాణ రాజకీయం (Telangana Politics) ఆరోపణలు ప్రత్యారోపణలతో రంజుగా సాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి (Election Heat) అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నియోజకవర్గాల్లో సభలు నిర్వమిస్తుంటే మరో వైపు కాంగ్రెస్ బాస్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఈ సభల్లో కాంగ్రెస్ పార్టీ బాస్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)  సీఎం కేసీఆర్ (CM KCR) మీద సంచలన ఆరోపణలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల ఉచిత కరెంట్ (Free Current) తీసేస్తుందని ప్రధానంగా ఆరోపిస్తోంది. రేవంత్ రెడ్డి ఈ ఆరోపణనను తీవ్రంగా ఖండిస్తున్నారు. 

అసలు ఆ పేటెంట్ కాంగ్రెస్ దే

ఉచిత విద్యుత్ అనే పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ రెడ్డి (Revanth Reddy)  తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ (Free Current) అందజేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)  అన్నారు. ఈ సౌకర్యాన్ని పరిమితం చేసే ఆలోచన కాంగ్రెస్‌ కు లేదని, బీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్న అబద్ధాలను (False) నమ్మవద్దని రైతులకు (Farmers) విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురిలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ.. ఈ హామీలను ఇవ్వడం మాత్రమే కాకుండా సీఎం కేసీఆర్ (CM KCR) మీద సంచలన ఆరోపణలు చేశారు. 2004లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌ పార్టీయే అని వివరించారు.. 2004లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajashekar Reddy) వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ను వర్తింపజేయాలని సంతకం చేశారని గుర్తు చేశారు. 2009 ఎన్నికల తర్వాత ఈ ఉచిత విద్యుత్ 9 గంటలకు పెరిగిందని ఆయన వివరించారు. 

సీఎం 200 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు..

సీఎం కేసీఆర్ (CM KCR) అంటేనే ఒంటి కాలుపై లేచే రేవంత్ రెడ్డి తాజా ఎన్నికల సభలలో (Election Meetings) కూడా సీఎం కేసీఆర్ (CM KCR) మీద సంచలన ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వ్యవసాయానికి కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్‌ ను అందించిందని చెబుతూనే మరో పక్క సీఎంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌ పై వేలు పెట్టే హక్కు ఏ ఇతర పార్టీకి లేదని రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)  అన్నారు.సీఎం తన ఫామ్‌హౌస్‌లో 200 ఎకరాల్లో సన్న వరి (Paddy) సాగు చేసి రూ.1.8 కోట్లు సంపాదించారని ఆరోపించారు. అటువంటి సీఎం ప్రజలను మాత్రం నాట్లు వేయొద్దని కోరతారని పేర్కొన్నారు. సీఎం తాను ఉత్పత్తి చేసిన వరిని క్వింటాలుకు రూ.4,250కి విక్రయించగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు (Paddy Buying) చేసేందుకు కనీసం రూ.2వేలు కూడా చెల్లించడం లేదని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ (Dharni Portal) తొలగిస్తే రైతుబంధు నిధులు రైతులకు చేరవని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పోర్టల్ లేని 2018 నుంచి 2020 వరకు ఎలా నిధులు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ వల్ల రైతుబంధు నిధులు ఆగిపోతాయనే ప్రచారంలో ఎటువంటి నిజం లేదని రైతులకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ను తీసి పారేసినా కానీ రైతు బంధు (Rythu bandhu) మాత్రం ఆగకుండా ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. 

రూ. 1.51 లక్షల కోట్ల వృథా..

మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ నాలుగు స్తంభాలు మునగడం, అన్నారం బ్యారేజీ పగుళ్లు రావడంతో కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు నిర్మాణానికి విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. దాదాపు రూ.1.51 లక్షల కోట్లు వృథా చేశారని రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)  మండిపడ్డారు. ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుకు (CM KCR) గెలుపుపై ​​నమ్మకం ఉంటే సింగరేణి గని కార్మిక సంఘాల ఎన్నికలు ఎందుకు నిలిపివేసి కోర్టుకు (Court) వెళ్లారని ప్రశ్నించారు. దివంగత కాంగ్రెస్ నేత 'కాకా' వెంకటస్వామి చొరవ వల్లే సింగరేణి సంస్థ మనుగడ సాగిస్తోందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న వివిధ సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు విన్నవించారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించే ముందు 'బై.. బై కేసీఆర్' అని చెప్పాలని ప్రజలను కోరారు. ఆయన బై.. బై అంటూ ప్రజలను కేసీఆర్ అని కోరాలన్నారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు ఇసుక, బొగ్గు, బూడిద మాఫియాకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రామగుండం ఎమ్మెల్యే చందర్ పటేల్ బందిపోటుగా మారి ప్రజాధనాన్ని దోచుకుని కల్వకుంట్ల కుటుంబానికి పన్ను చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చందర్ కు తగిన బుద్ది చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఎన్నో అక్రమాలు చేశారు..

2018లో ధర్మపురి ప్రజలు అడ్లూరి లక్ష్మణ్ ను ఎమ్మెల్యేగా (MLA) ఎన్నుకుని తీర్పు ఇచ్చినా బీఆర్ఎస్ నేతలు అనేక అక్రమాలు చేసి కొప్పుల ఈశ్వర్ గెలిచేలా చేశారని రేవంత్ రెడ్డి (Revanth Reddy)  ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వర్ మంత్రి (Minister) అయినా కానీ ఈ ప్రాంతానికి నిధులు తీసుకురాలేదన్నారు. ఇక మరో పక్క చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మీద కూడా ఆయన ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌ (Hyderabad) లోని సింగరేణి భూములు, ప్రభుత్వ భూములను బీఆర్‌ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమించుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని కమీషన్లు తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సుమన్ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. బెల్లంపల్లి బీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని మహిళలపై (Ladies) లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అయితే ఆయనపై చర్యలు తీసుకోకుండా సీఎం మద్దతు ఇచ్చారని ఆరోపించారు.