Jaishankar: వాక్ స్వాతంత్య్రం అందుకోసం కాదన్న జై శంకర్

Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (Jai Shankar) తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. పెద్ద నాయకుడికి ఉన్న సెలబ్రెటీ స్టేటస్ ఈ మంత్రికి సొంతం. జైశంకర్ (Jai Shankar)  ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడతారని అంతా అంటుంటారు. అంతే కాకుండా ఆయన మాట్లాడిన దాని వెనుక అర్థం కూడా ఉంటుంది. ఇటీవల ఇండియా-కెనడా (India-Canada) మధ్య దౌత్య పరమైన వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. కెనడాలో ఉన్న ఖలిస్తాన్ (Khalistan) తీవ్రవాది నిజ్జర్ […]

Share:

Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (Jai Shankar) తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. పెద్ద నాయకుడికి ఉన్న సెలబ్రెటీ స్టేటస్ ఈ మంత్రికి సొంతం. జైశంకర్ (Jai Shankar)  ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడతారని అంతా అంటుంటారు. అంతే కాకుండా ఆయన మాట్లాడిన దాని వెనుక అర్థం కూడా ఉంటుంది. ఇటీవల ఇండియా-కెనడా (India-Canada) మధ్య దౌత్య పరమైన వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. కెనడాలో ఉన్న ఖలిస్తాన్ (Khalistan) తీవ్రవాది నిజ్జర్ సింగ్ హత్య విషయంలో కెనడా ప్రధాని నోరు జారారు. నోరు జారిన ట్రూడో (Justin Trudeau) ఇండియా మీద కూడా విచారణ చేయిస్తామని చెప్పారు. దానిని సీరియస్ గా తీసుకున్న ఇండియా (India) మాటకు మాట చేతకు చేత అన్నట్లు సమాధానం ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఆ ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యతో తమకు ఏం సంబంధం లేదని భారత్ వాదిస్తున్నా కానీ కెనడా (Canda) వినపించుకోవడం లేదు. 

కెనడానే తప్పుబడుతున్న ప్రపంచ దేశాలు

ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ దేశాలు కెనడానే తప్పుబడుతున్నాయి. ఇలా నిరాధార ఆరోపణలు (Baseless) చేయడం తగదని కెనడా ప్రధానికి (Prime minister) చెబుతున్నాయి. అయినా కానీ కెనడా మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ విషయంలో తగ్గేదే లే అంటూ ముందుకు వెళ్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు కెనడా (Canada) పరువు పోతున్నా కానీ ఆ దేశం మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ దౌత్య వివాదాన్ని పరిష్కరించడం కోసం అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కానీ కెనడా వినిపంచుకోకపోవడంతో ఈ వివాదానికి ఇప్పట్లో పుల్ స్టాప్ (Full stop) పడేలా కనిపించడం లేదు. ఇరుపక్షాలు టచ్‌ లో ఉన్నాయని, వివాదాన్ని పరిష్కరించడానికి ఒక మార్గం కనుగొనబడుతుందని ఆశిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Shankar)  చెప్పారు. అదే సమయంలో, “సార్వభౌమాధికారం మరియు సున్నితత్వం” ఒకే దారిలో ఉండకూడదని పేర్కొన్నాడు. ఓ మీడియా హౌస్ (Media House) నిర్వహించిన సమ్మిట్ లో జై శంకర్(Jai Shankar)  మాట్లాడుతూ.. ఖచ్చితంగా మనం ఒక మార్గాన్ని కనుగొంటామని ఆశిస్తున్నట్లు తెలిపాడు. సార్వభౌమాధికారం మరియు సున్నితత్వం — ఇవి వన్-వే వీధులు కాకూడదన్నారు. వారికి వారి ఆందోళనలు ఉండవచ్చు. నేను ఎప్పుడూ ఏ దేశంతోనూ మాట్లాడటానికి ఇష్టపడనని చెప్పలేదని పేర్కొన్నాడు. 

వివాదం మొదలైంది ఇక్కడే.. 

శాంతియుతంగా ఉన్న భారతదేశం (India) మీద ఇటువంటి ఆరోపణలు రావడం ఇండియానే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న చాలా దేశాలను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. కెనడాలోని సర్రే పట్టణంలో జూన్‌ లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య చేయబడ్డాడు. అయితే ఈ హత్యకు భారత్ కు సంబంధం ఉందని స్వయాన కెనడా ప్రధాని అయిన ట్రూడో ఆరోపణలు చేయడం వివాదానికి దారి తీసింది. ట్రూడో ఆరోపణలకు కొన్ని దేశాలు వంత పాడడం మొదలుపెట్టాయి. ఇక భారత్ చేసేదేం లేక కెనడియన్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కొన్ని రోజులకు ప్రకటించింది. అంతే కాకుండా ఇండియాలో ఉన్న కెనడా దౌత్య వేత్తలను కూడా తగ్గించుకోవాలని కోరింది. దాంతో చేసేదేం లేక కెనడా తన దౌత్యవేత్తలను ఇండియా నుంచి ఉపసంహరించుకోవడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఆ దేశం ఇండియా నుంచి 41 మంది దౌత్యవేత్తలు మరియు వారి కుటుంబ సభ్యులను ఉపసంహరించుకుంది.

అది అందుకు కాదు.. 

ఇండియాతో పాటు అనేక దేశాలలో వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ ఈ వాక్ స్వాతంత్య్రం అనేది హింసను బెదిరింపులను సమర్ధించేందుకు కాదని విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Shankar)  స్పష్టం చేశారు. ఇది తీవ్రవాదాన్ని ప్రచారం చేసేందుకు లైసెన్స్ కాదన్నారు. కావున ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హితవు (Suggestion) పలికారు. కెనడాతో నెలకొన్ని దౌత్య సమస్యలను పరిష్కరించేందుకు ఇరు వర్గాలు కృషి చేస్తున్నాయని మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.