AI Scam: హైదరాబాద్ లో వెలుగులోకి AI స్కామ్

జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు

Courtesy: Twitter

Share:

AI Scam: టెక్నాలజీ (Technology) డెవలప్ అయిందని ఆనందపడకుండా చేస్తున్నారు స్కామర్స్ (Scammers). రోజురోజుకూ కొత్త తరహా స్కామ్ (Scams) లతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తమకు తోచిన విధంగా స్కామ్ (Scams) లు చేస్తూ అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఇన్ని రోజులు లింక్స్ (Links) పంపి స్కామ్స్ చేసిన స్కామర్స్ ఇప్పుడు కొత్త తరహా మోసాలకు తెరతీశారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  (AI) అన్ని రకాల పనులు చేసి పెడుతోంది. అసలు AI చేయని పని అంటూ ఉండడం లేదు. దీంతోనే స్కామర్స్ (Scammers) కొత్త రూటు ఆలోచించారు. సులభమైన రీతిలో ఉండే AI  స్కామ్స్ కు తెరతీశారు. ఈ స్కామ్స్ (Scams) ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

తాజాగా హైదరాబాద్ లో వెలుగులోకి.. 

ఓ AI స్కామ్ తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో వెలుగులోకి వచ్చింది. దీంతో అందరూ కేర్ ఫుల్ (Care Full)  గా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఈ AI పరికరాలతో చాలా సులభంగా మోసం (Fraud) చేస్తున్నారు. అందుకోసమే ఈ మోసాలపై మరింత జాగ్రత్త (Care) అవసరం అని పోలీసులు నొక్కి చెబుతున్నారు. ఏ మాత్రం కేర్ లెస్ గా ఉన్నా కానీ స్కామర్స్ (Scammers) మన దగ్గరి నుంచి లక్షల రూపాయలు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో తాజాగా ఒక మహిళ (Lady) AI స్కామ్ (AI Scam)  కు బలైంది. ఆ మహిళకు తన మేనల్లుడు (Nephew) కెనడా నుంచి ఫోన్ చేసినట్లు చేసిన కేటుగాళ్లు ఆ మహిళ (Lady) నుంచి దాదాపు రూ. 1.4 లక్షలను స్వాహా చేశారు. ఇటువంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ సందర్భాలు మాత్రం జరుగుతాయి కావున మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్‌ లో నివాసం ఉంటున్న 59 ఏళ్ల మహిళ AI వాయిస్ స్కామ్‌ కు గురైంది. ఈ స్కామ్ (Scam) లో ఆ మహిళ  రూ. 1.4 లక్షలు కోల్పోయింది.స్కామర్ సరిగ్గా కెనడాలో ఉన్న మహిళ మేనల్లుడిలా మాట్లాడుతూ.. తాను బాధలో ఉన్నానని తనకు అత్యవసరంగా డబ్బు అవసరమని పేర్కొన్నాడు. ఇది విన్న ఆ మహిళ వెంటనే అతడు అడిగిన డబ్బును ట్రాన్స్ ఫర్ (Money Transfer) చేసింది. 

అర్ధ రాత్రి కాల్.. 

ఆ AI స్కామర్ (AI Scam) టైమ్ ను కూడా కరెక్ట్ గా అంచనా వేశాడు. అతడు ఫోన్ కూడా అర్ధరాత్రి (Mid Night) సమయంలో చేశాడు. మహిళకు అర్థరాత్రి ఫోన్ చేసి తనకు ప్రమాదం (Accident) జరిగిందని తెలిపాడు. తనకు అర్జెంటుగా (Urgent) డబ్బు అవసరం ఉందని, ఒక వేళ తన వద్ద డబ్బులు లేకపోతే తనకు జైలు (Jail) శిక్ష పడే ప్రమాదం ఉందని ఆ మహిళకు చెప్పాడు. దీంతో కంగారు పడిన ఆ మహిళ వెంటనే స్కామర్ కోరిన మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేసింది. అంతే కాకుండా ఇలా డబ్బు ఇచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దని సీక్రెట్ గా ఉంచమని అభ్యర్థించాడు. అతను అచ్చం తన మేనల్లుడిలానే మాట్లాడాడని, తాము ఇంట్లో మాట్లాడే అన్ని విషయాలను చెప్పాడని పేర్కొంది. అలాగే అతడు పంజాబీ (Punjabi) బాషలో కూడా మాట్లాడాడని పేర్కొంది. వీటి వల్లే తను పక్కాగా నమ్మాల్సి వచ్చిందని వాపోయింది. అతడు ఈ కాల్ గురించి సీక్రెట్ గా ఉంచమన్నాడని కాబట్టి తాను ఎవరికీ చెప్పలేదని ఆ మహిళ వెల్లడించింది. 

నివాసితులు జాగ్రత్త.. 

ఇటువంటి స్కామ్స్ (Scams) పట్ల నివాసితులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు (Police) సూచిస్తున్నారు. AI  స్కామర్స్ ఎక్కువగా విదేశాల్లో (Other Countries) ఉంటున్న బంధువులం అని చెప్పి కాల్స్ చేస్తారని చెబుతున్నారు. నగర పోలీసు అధికారులు, AI వాయిస్ స్కామ్‌ (AI Scam) లు అరుదుగా జరుగుతాయని గుర్తించారు. కెనడా (Canada) మరియు ఇజ్రాయెల్ వంటి దేశాల్లో కుటుంబ సభ్యులు ఉన్న వ్యక్తులు ఇటీవల AI వాయిస్ స్కామ్‌ (AI Scam) ల ద్వారా ఎక్కువగా చీట్ చేయబడుతున్నారని సైబర్ నిపుణులు (Experts) గుర్తించారు. కావున ఈ రెండు దేశాల్లో బంధువులు ఉన్న వ్యక్తులు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ (సీఆర్‌సీఐడీఎఫ్‌) ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ పాటిబండ్ల ఈ మోసాల్లోని చిక్కుముళ్లను వెలుగులోకి తెచ్చారు. AI వాయిస్ ఇమిటేటింగ్ టూల్స్ పబ్లిక్ డొమైన్‌ లో అందుబాటులో ఉన్న సోషల్ మీడియా రికార్డింగ్‌ లు లేదా మోసగాళ్లు చేసిన సేల్స్ కాల్‌ ల వంటి డేటాను ఉపయోగించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క వాయిస్‌ ని ఖచ్చితంగా అనుకరించగలవని పేర్కొన్నాడు. అందుకోసమే చాలా జాగ్రత్తగా (Carefull) ఉండాలని  సూచించారు. ఇటువంటి AI స్కామ్ (AI Scam) లు చేసే వ్యక్తులు విదేశాల్లో తమకు అత్యవసర పరిస్థితి వచ్చిందని చెబుతూ డబ్బులు అడుగుతారని పోలీసులతో పాటుగా సైబర్ నిపుణలు కూడా చెబుతున్నారు. ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం కేర్ లెస్ గా ఉన్నా కానీ AI స్కామర్స్ (AI Scam) చేతిలో అనవసరంగా మోసపోవాల్సి ఉంటుందని అంటున్నారు.