Elections: ఎన్నికలలో పోటీ చేస్తున్న రిచెస్ట్ అభ్య‌ర్ధి ఎవరంటే..

రెండో స్థానంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Courtesy: Pexels

Share:

Elections: తెలంగాణ ఎన్నికలలో (Telangana Elections) చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల (Nomination) పర్వం ముగియడంతో ప్రధాన అభ్యర్థులు అందరూ తమ నామినేషన్లను సమర్పించారు. నామినేషన్లు వేసేటపుడు అఫిడవిట్ (Affidavit) లో ఆస్తుల వివరాలను కూడా అభ్యర్థులు సమర్పించారు. ఈ అఫిడవిట్ (Affidavit) లోనే అనేక వింతలు చోటు చేసుకున్నాయి. చాలా మంది అభ్యర్థులు తమకు అవి లేవు ఇవి లేవు అని ప్రజలకు నమ్మశక్యం కాని వివరాలు సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ (KCR) తన పేర భూమి లేదని నామినేషన్ వేశారు. కేసీఆర్ ప్రతి సభలోనూ తాను కాపోన్నే అని.. తాను ఇప్పటికీ వ్యవసాయం (Agriculture) చేస్తానని చెబుతారు. అటువంటి కేసీఆర్ తనకు సెంటు భూమి కూడా లేదని ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించే సరికి అంతా షాక్ (Shock) అయ్యారు. ఏంటిది అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన చిత్ర విచిత్రాలు ఎన్నికల అఫిడవిట్ లో మాత్రమే చూసేందుకు వీలు పడుతుందని వారు అంటున్నారు. 

 

ధనిక అభ్యర్థిగా

 

చాలా మంది మట్టుకు తమకు అది లేదు.. తమకు ఇది లేదు అని ప్రకటిస్తే కొంత మంది మాత్రం తాము ధనిక అభ్యర్థులమని ప్రకటించకున్నారు. చెన్నూరు (Chennur) అసెంబ్లీకి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వివేక్ వెంకట స్వామి ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ధనిక (Richest) అభ్యర్థిగా నిలిచారు. రూ. 600 కోట్లకు పైగా ఆస్తులను ఆయన ప్రకటించారు. ఇక రూ. 460 కోట్లకు పైగా ఆస్తులతో అదే పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి రెండో స్థానంలో (Second Place) నిలిచారు. ఈ ఇద్దరు వేరే పార్టీల నుంచి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరడం మాత్రమే కాదు.. టికెట్లు కూడా సంపాదించుకున్నారు. 

 

ఆ ఆస్తులే ఎక్కువ

 

వివేక్ (Vivek) తెలంగాణ శాసన సభకు జరిగే ఎన్నికల్లో (Elections) పోటీ చేస్తున్న ధనిక అభ్యర్థిగా నిలిచారు. ఆయనకు వంశ పారం పర్య బిజినెస్ (Business) ద్వారా వచ్చిన ఆస్తులే అధికంగా ఉన్నాయి.  వివేక్ మరియు అతని భార్య రూ. 377 కోట్ల విలువైన చరాస్తులను కలిగి ఉన్నారు , ఎక్కువగా 1981లో స్థాపించబడిన అతని సొంత కంపెనీ  అయిన విశాఖ ఇండస్ట్రీస్‌ తో సహా వివిధ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. కుటుంబం యొక్క స్థిరాస్తులు రూ. 225 కోట్లకు పైగా ఉన్నాయి. అతను దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. వివేక్ మరియు అతని భార్య రూ. 41.5 కోట్ల విలువైన అప్పులు లేదా రుణాలు (Liabilities) కలిగి ఉన్నారు. వివేక్ వార్షిక ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4.66 కోట్ల నుంచి FY19లో రూ. 6.26 కోట్లకు పెరిగింది , అదే సమయంలో అతని భార్య రూ. 6.09 కోట్ల నుండి రూ. 9.61 కోట్లకు పెరిగింది.

శ్రీనివాస్ రెడ్డి లెక్కిదీ.. 

ఖమ్మం జిల్లా పాలేరు నుంచి కాంగ్రెస్ (Congress) తరఫున పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండో ధనిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచారు. ఆయన కాంగ్రెస్ తరఫున పాలేరు నుంచి బరిలోకి నిలిచారు. శ్రీనివాస్ రెడ్డి రూ. 44 కోట్ల అప్పులతో రూ. 460 కోట్ల విలువైన స్థిరాస్తులు మరియు స్థిర ఆస్తులను ప్రకటించారు .నామినేషన్ పత్రాల దాఖలు రోజు నవంబర్ 9న ఖమ్మంలోని శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది.ఈ సోదాలు 'రాజకీయ ప్రేరేపితమైనవి' అని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మరో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తన ఆదాయం కూడా భారీగా పెరిగిందని చూపెట్టారు. 2019వ ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే రూ.  36.6 లక్షలు మాత్రమే అతనికి ఆదాయం ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం రూ. 71.17 కోట్లకు అతని ఆదాయం పెరిగింది. ఇదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారు. 

కుటుంబ ఆస్తులు రూ. 450 కోట్ల పై మాటే...

ఇక రాజగోపాల్ రెడ్డి తన కుటుంబ ఆస్తులు రూ. 459 కోట్లుఅని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు (munugode) నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తన కంపెనీ సుషీ ఇన్‌ ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌లో 1.24 కోట్ల షేర్లను కలిగి ఉన్నట్లు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ. 230 కోట్ల పైమాటే. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి తన కుటుంబానికి రూ.  227 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా రూ. 83 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు. 

సీఎంకు రూ. 25 కోట్ల అప్పులు

ఎన్నికల అఫిడవిట్ లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో (Constituencies) పోటీ చేసిన అభ్యర్థులు తమ ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలను ఎలక్షన్ కమిషన్ కు (Election Commission) సమర్పించారు. చాలా మంది నేతలు తమకు సొంతం ఇల్లు లేదు, భూమి లేదు, కారు లేదు అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కూడా తన ఆస్తుల వివరాలను సమర్పించారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ తన ఆస్తులను వెల్లడించారు. ఆయన గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీకి నిలిచారు. ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ. 59 కోట్లు అని వెల్లడించారు.  అతడి కుటుంబానికి రూ. 25 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం కేసీఆర్ కు సొంత కారు కూడా లేదట. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు వివిధ పార్టీలకు చెందిన 4,798 మంది అభ్యర్థులు 5,716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల స్క్రుటినీ ప్రక్రియ కూడా ముగిసింది. కొంత మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే తిరస్కరించబడ్డాయి (Reject). నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ముగియనుంది. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఈసీ ఇది వరకే ప్రకటించింది.