Alcohol: మద్యం షాపుని తగలబెట్టిన వైజాగ్ వాసి

ఎందుకో మీరే చదివేయండి..

Courtesy: alcohol

Share:

Alcohol: మద్యం (alcohol) బాబులకు మందు (alcohol) దొరకకపోతే విలవిల్లాడిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో అవతల వ్యక్తిని విచక్షణ రహితంగా చంపిన కేసు (Case)లు కూడా ఉన్నాయి. మద్యం (alcohol) దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. అయితే ఇలాంటి ఒక సంఘటననే విశాఖపట్నం (Visakhapatnam)లో చోటుచేసుకుంది. 

మందు షాపుని తగలబెట్టిన వైజాగ్ వాసి: 

 

విశాఖపట్నం (Visakhapatnam) మదుర్వాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మద్యం (alcohol) మత్తులో వైన్‌షాపుకు నిప్పంటించిన వ్యక్తిని విశాఖపట్నం (Visakhapatnam) పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. పోతినమల్లయ్య పాలెం ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ అందించిన సమాచారం మేరకు, మధుర్వాడ ప్రాంతంలోని ఓ వైన్‌షాప్‌లో మధు అనే వ్యక్తి మందు (alcohol) కోసం వెళ్ళగా, మూసివేసే సమయం కావడంతో షాపు సిబ్బంది మద్యం (alcohol) ఇవ్వడం కుదరదని చెప్పడం జరిగింది.

 

దీంతో నిందితులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హెచ్చరించడంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు నిందితుడు, కాని అతను ఆదివారం సాయంత్రం పెట్రోల్ (Petrol) ట్యాంక్‌తో దుకాణానికి తిరిగి వచ్చాడు, దానిని ఉపయోగించి అతను షాప్ లోపల మరియు సిబ్బందిపై కూడా పెట్రోల్ (Petrol) పోసి వెంటనే నిప్పంటించాడు. దుకాణం నుండి సిబ్బంది పారిపోయారు, కాని దుకాణం దగ్ధమైంది, కంప్యూటర్, ప్రింటర్‌తో సహా ₹ 1.5 లక్షలకు పైగా ఆస్తి దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 307, 436 సెక్షన్ల కింద కేసు (Case) నమోదు చేశామని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. 

 

హైదరాబాదులో మందు కోసం గొడవ: 

 

ఇటీవల జరిగిన మరో సంఘటన చూసుకుంటే, 22 ఏళ్ల వయసున్న వరప్రసాద్ అనే వ్యక్తి డిగ్రీ చదువుతున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున, వరప్రసాద్ అలాగే తన కాలేజీ స్నేహితుడు అయిన మరో ఫ్రెండ్, సాయి యాదవ్ కలిసి బీర్ (alcohol) బాటిల్ కొనుక్కుని వెళ్తుంటారు. అయితే వెళుతూ ఉండగా, అటుగా వెళుతున్న మరో నలుగురు యువకులు (Youth) వీరిద్దరిని స్వాగత్ గ్రాండ్ హోటల్ దగ్గర ఆపి, ఆ ఇద్దరు యువకుల చేతుల్లో ఉన్న బీర్ (alcohol) బాటిల్లను వారికిచ్చేమన్నారు. అయితే అప్పుడే వరప్రసాద్, సాయి యాదవ్ అలాగే అవతల వైపు ఉన్న నలుగురు యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. 

 

బీరు (alcohol) బాటిల్ ను ఇవ్వడానికి వరప్రసాద్ అలాగే సాయి నిరాకరించారు. మాటా మాటా పెరిగి గొడవ (fight) వరకు వెళ్ళింది. ఈ గొడవ (fight)లోనే అవతల నలుగురి వ్యక్తులలో ఒకడు ముందుకు వచ్చి, తమ దగ్గర ఉన్న ఐరన్ రాడ్లు వంటి పరికరాలతో వరప్రసాద్ ని కొట్టడం (fight) మొదలుపెట్టాడు. మరోవైపు వరప్రసాద్ స్నేహితుడు సాయి భయంతో అక్కడే నిలబడిపోయాడు. మరోపక్క నలుగురు యువకులు (Youth) కలిసి వరప్రసాద్నీ చితక బాధడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. 

 

అప్పుడే అటుగా వెళుతున్న ఒక వ్యక్తి వరప్రసాద్ రక్తం మడుగులో ఉండడం చూసి వెంటనే, తనని దగ్గరలో ఉన్న ఆర్కే హాస్పిటల్కి తరలించినప్పటికీ, ఆ హాస్పటల్ వారు తనని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరిస్తారు. అయితే ఇంక చేసేదేమీ లేక వెంటనే Owaisi హాస్పిటల్, సంతోష్ నగర్ కి తీసుకువెళ్తారు. అయితే తీవ్ర గాయాలు కారణంగా, చికిత్స తీసుకుంటూ వరప్రసాద్ మృతి చెందినట్లు పోలీసు వారు నిర్ధారించారు. 

 

సంఘటన జరిగిన అనంతరం, వరప్రసాద్ మృతికి కారణమైన నితీష్ గౌడ్, పవన్, సంతోష్ యాదవ్, కిరణ్ గౌడ్ లను మంగళవారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు పోలీసులు. అంతేకాకుండా వారిని కస్టడీలోకి తీసుకొని వారి నలుగురు మీద ఐపిసి 302 సెక్షన్ కింద మర్డర్ కేసు (Case) రిజిస్టర్ చేశారు.