ప్రపంచంలో ఏ నేతకు లేని రికార్డు Modiకి.. ప్లాట్‌ఫామ్ ఏదైనా ఆయనే టాప్!

Indian PM Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ ఖాతాలో సరికొత్త సరికొత్త రికార్డు నమోదైంది. ఆయన వ్యక్తిగత యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల (వీక్షకుల) సంఖ్య రెండు కోట్లు దాటింది. కాగా, ఇంత మంది సబ్‭స్క్రైబర్లు ఉన్న ప్రపంచంలోనే మొదటి నాయకుడిగా మోదీ నిలిచారు.

Courtesy: IDL

Share:

భారత ప్రధాని నరేంద్రమోదీ ఖాతాలో సరికొత్త సరికొత్త రికార్డు నమోదైంది. ఆయన వ్యక్తిగత యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల (వీక్షకుల) సంఖ్య రెండు కోట్లు దాటింది. కాగా, ఇంత మంది సబ్‭స్క్రైబర్లు ఉన్న ప్రపంచంలోనే మొదటి నాయకుడిగా మోదీ నిలిచారు. ప్రపంచంలో మరే ఇతర నేతకూ ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో మోదీ ఈ ఛానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ఛానల్‌లో మోదీ పోస్ట్‌ చేసిన వీడియోలకు వీక్షణలు (వ్యూస్‌) 450 కోట్ల పైమాటే అంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరిగా ఉన్న విషయం తెలిసిందే.

ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో రెండోస్థానంలో ఉన్నారు. ఆయనకు 64 లక్షల మంది వీక్షకులు ఉన్నారు. మోదీతో పోలిస్తే ఇది మూడోవంతు కంటే తక్కువే. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పోస్ట్‌ చేసిన వీడియోలకు వ్యూస్‌ 22.4 కోట్లు. ఆ విషయంలో మోదీ తర్వాత స్థానం ఆయనదే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 7.89 లక్షల మంది, తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌కు 3.16 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రధాని మోదీకి సంబంధించిన మరో యూట్యూబ్‌ ఛానల్‌ ‘యోగా విత్‌ మోదీ’కి 73,000 మంది, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఛానల్‌కు 35 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

సోషల్ మీడియా ఏదైనా మోదీనే టాప్
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఏదైనా సరే ప్రధాని మోదీ ఫాలోయింగ్ క్రేజ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రపంచంలో మరే నాయకుడికి లేని ఫాలోయింగ్ ఈయనకు ఉంటుంది. ఫాలోయింగ్ కు తగ్గట్టే ఆయన కూడా ఆయా మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటారు. ప్రధాని మోదీకి ట్విట్టర్లో 94 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 82.7 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

వాట్సాప్ ఛానెల్ లోనూ భారీ ఫాలోవర్లు
ప్రధాని మోదీ వాట్సాప్ లో కూడా ఇటీవల ఛానెల్ ను ప్రారంభించారు. అందులో కూడా ఆయనకు అతి తక్కువ కాలంలో భారీగా పాపులారిటీ సంపాదించారు. అతి తక్కువ కాలంలోనే 12 మిలియన్ల మందిని ఫాలోవర్లను సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేశారు.