సముద్రంలో ప్రధాని మోదీ సాహసం.. వైరల్ గా మారిన ఫొటోలు..!

Snorkelling: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా లక్షద్వీప్ పర్యటనలో సాహసోపేతమైన స్నార్కెలింగ్‌ (Snorkelling) చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Courtesy: x

Share:

కవరట్టి: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా లక్షద్వీప్ పర్యటనలో సాహసోపేతమైన స్నార్కెలింగ్‌ (Snorkelling) చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్వాస తీసుకునేందుకు ట్యూబ్‌తో (స్నార్కెల్) అనుసంధానించిన డైవింగ్ మాస్క్‌ను ధరించి సముద్ర జలాల్లో ఆయన స్విమ్మింగ్ చేశారు. స్నార్కెలింగ్‌ విధానంలో తల సహా పూర్తి శరీరాన్ని నీళ్లలో ఉంచి, ముఖాన్ని కిందికి ఉంచి స్విమ్మింగ్ చేస్తారు. అంతేకాదు.. సముద్రంలో స్నార్కెలింగ్‌ (సాహసంతో కూడిన స్విమ్మింగ్‌) కూడా చేశారు. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.

స్నార్కెలింగ్ కు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకున్నారు. ‘‘లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 140కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నాకు నేర్పింది. సాహసాలు చేయాలనుకునేవారు.. మీ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోండి’’ అని మోదీ రాసుకొచ్చారు.

పగడపు దీపులు, చేపల ఫొటోలను పంచుకున్నారు. ‘ఇది ఎంతో అద్భుతమైన అనుభవం’ అని పేర్కొన్నారు. స్నార్కెలింగ్‌ అనేది సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్‌ లాంటిది. స్నార్కెల్‌ అనే ట్యూబ్‌, డైవింగ్‌ మాస్క్‌ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడుతారు. ఈ స్నార్కెలింగ్‌తో సముద్ర గర్భంలో పర్యావరణాన్ని, జీవరాశులను అన్వేషించొచ్చు. లక్షద్వీప్‌లో తాను స్నార్కెలింగ్‌ (Snorkelling) కూడా ప్రయత్నించినట్లు మోదీ తెలుపుతూ ఆ చిత్రాలను కూడా షేర్‌ చేశారు.