కర్ణాటకలో టీచర్, స్టూడెంట్ ఫొటోషూట్.. సోషల్ మీడియాలో దుమారం!

కర్ణాటకలో ఓ టీచర్, స్టూడెంట్ ఫొటోషూట్ దుమారం రేపుతోంది. మురుగమల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు, పదో తరగతి చదువుతున్న విద్యార్థి స్టడీ టూర్ పేరుతో వెళ్లి తీసుకున్న ఫోటోషూట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Courtesy: x

Share:

కర్ణాటకలో ఓ టీచర్, స్టూడెంట్ ఫొటోషూట్ దుమారం రేపుతోంది. మురుగమల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు, పదో తరగతి చదువుతున్న విద్యార్థి స్టడీ టూర్ పేరుతో వెళ్లి తీసుకున్న ఫోటోషూట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సదరు ఉపాధ్యాయురాలు మరియు విద్యార్థి ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. 

 చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులంతా కలిసి ఓ స్టడీ టూర్ కి వెళ్లారు. ఆ స్ట‌డీ టూర్‌లోనే వీరి ఫోటోషూట్ జ‌రిగింది. మురుగ‌మ‌ళ్లలోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లోనే ఆ మ‌హిళా ఉపాధ్యాయురాలు ప‌ని చేస్తోంది. ఆ విద్యార్థి అదే పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోల‌ను అక్క‌డే ఉన్న మరో వ్యక్తి తీశాడు. ఇవి కాస్తా సోష‌ల్‌మీడియాలో షేర్ చేయ‌గా, అవి వైర‌ల్‌గా మారాయి. అయితే, వీటిని చూసిన నెటిజ‌న్లు మాత్రం తెగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్ద‌రిని శిక్షించాల‌ని కొంద‌రు డిమాండ్ చేయ‌గా, మ‌రికొంద‌రేమో ఉపాధ్యాయురాలి ప్ర‌వ‌ర్త‌న‌పై విచార‌ణ జ‌ర‌పాలంటున్నారు. విద్యాశాఖ అధికారి వీ ఉమాదేవి పాఠ‌శాల‌ను సంద‌ర్శించి, ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టారు.

ఇంతకీ వీడియోలో ఏం ఉందంటే
వైర‌ల్ వీడియోలో ఆ విద్యార్థి ఎల్లో క‌ల‌ర్ షేర్వానీ వేసుకుని ఉన్నాడు. ఆ మ‌హిళ ఉపాధ్యాయురాలేమో పింక్ క‌ల‌ర్ చీర ధ‌రించి ఉంది. ప‌చ్చ‌ని చెట్ల మ‌ధ్య టీచ‌ర్ స్టూడెంట్ క‌లిసి చేసిన ఫొటోషూట్ ఇది. ఇందులో ఆ స్టూడెంట్ ఏమో టీచ‌ర్ కొంగును లాగుతూ ఉంటే, ఉపాధ్యాయురాలేమో సిగ్గుప‌డుతూ రోజాపువ్వుతో త‌న ప్రేమ‌ను వెల్ల‌బుచ్చింది. అంత‌టితో ఆగ‌లేదు. ఆ స్టూడెంట్ టీచ‌ర్‌కు ముద్దుపెట్టీ మ‌రీ త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చాడు. ఆ స్టూడెంట్ టీచ‌ర్‌ను ఎత్తుకుని, తిప్ప‌డం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్ప‌డు నెట్టింట తెగ వైర‌ల్‌గా మారుతున్నాయి. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్క‌బ‌ళ్ల‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది.


ట్విటర్ లో చేసిన పోస్ట్ ప్రకారం, విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలి ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ కోసం బీఈవో వి ఉమాదేవి పాఠశాలను సందర్శించారు, అయితే విచారణ పూర్తయ్యాకే దీనిపై స్పందిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.