CM KCR : కారు గుర్తున్న పార్టీ అధినేత‌కు సొంత కారు లేదట..!

CM KCR: సీఎం కేసీఆర్(CM KCR) గజ్వేల్(Gajwel), కామారెడ్డి(Kamareddy) స్థానాల్లో నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్(Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ పత్రాల్లోని ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి. కేసీఆర్(KCR) పై మొత్తంగా 9 కేసులు ఉన్నట్టు ఆ పత్రాలు తెలిపాయి. కారు గుర్తుకు(Car Symbol) ఓటు వేయాలని, కారే గెలుస్తుందని ధీమాగా చెప్పిన సీఎం కేసీఆర్‌కు సొంతంగా తన పేరిట కారు లేదని అఫిడవిట్‌(Affidavit)లో పేర్కొన్నారు. గజ్వేల్‌(Gajwel)లో ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల […]

Share:

CM KCR: సీఎం కేసీఆర్(CM KCR) గజ్వేల్(Gajwel), కామారెడ్డి(Kamareddy) స్థానాల్లో నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్(Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ పత్రాల్లోని ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి. కేసీఆర్(KCR) పై మొత్తంగా 9 కేసులు ఉన్నట్టు ఆ పత్రాలు తెలిపాయి. కారు గుర్తుకు(Car Symbol) ఓటు వేయాలని, కారే గెలుస్తుందని ధీమాగా చెప్పిన సీఎం కేసీఆర్‌కు సొంతంగా తన పేరిట కారు లేదని అఫిడవిట్‌(Affidavit)లో పేర్కొన్నారు.

గజ్వేల్‌(Gajwel)లో ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో రెండు సెట్ల నామినేషన్ ను సీఎం కేసీఆర్(CM KCR) దాఖ‌లు చేశారు. ఆ త‌ర్వాత హెలికాఫ్టర్‌లో కామారెడ్డికి(Kamareddy) చేరుకునీ, అక్క‌డి ఆర్డీవో(RDO) కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్(Nomination) దాఖ‌లు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,  తనకు సొంతంగా కారు లేదని, బైక్ లేదని సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. ఈ విషయాన్ని సిద్దిపేట(Siddipet) జిల్లా గజ్వేల్‌(Gajwel) అసెంబ్లీ సెగ్మెంట్‌కు గురువారం సీఎం కేసీఆర్‌ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌(Affidavit) స్పష్టం చేస్తోంది. 

కేసీఆర్‌కు వార్షికాదాయం రూ.1.6 కోట్లు కాగా.. ఆయన భార్య శోభ(Shobha) వార్షికాదాయాన్ని రూ.8.38 లక్షలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ చేతిలో రూ.2.96 లక్షల నగదు ఉండగా.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(Fixed Deposits) రూపంలో రూ.11.16 కోట్లు, భార్య శోభ పేరిట రూ.6.29 కోట్ల ఎఫ్‌డీలు ఉన్నాయి. కేసీఆర్‌కు రూ.24.51 కోట్ల మేర అప్పులుండగా.. వీటిలో రూ.1.06 కోట్లను మాజీ ఎంపీ వివేక్‌(Vivek) వద్ద తీసుకోవడం గమనార్హం..!

టీ న్యూస్‌లో(T News) కేసీఆర్‌కు రూ.2.31 కోట్లు, తెలంగాణ పబ్లికేషన్స్‌(నమస్తే తెలంగాణ)లో రూ.4.16 కోట్ల మేర పెట్టుబడులున్నాయి. కేసీఆర్‌కు 95 గ్రాములు, ఆయన భార్యకు 2,841 గ్రాముల మేర బంగారం ఉన్నాయి. వీరికి జూబ్లీహిల్స్‌లోని నందినగర్‌లో 584 చదరపు గజాల ఇల్లు, తీగలగుట్టపల్లిలో 2,141 చదరపు గజాల ఇల్ల్లు, మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలో 7,865 చదరపు గజాల ఇల్లు, 65.25 ఎకరాల భూమి ఉండగా.. వాటి విలువను రూ.1.62 కోట్లుగా చూపించారు. చరాస్తుల విలువను రూ.25.62 కోట్లుగా చూపించారు. వాహనాల విషయంలో కారు లేకున్నా.. ఐదు ట్రాక్టర్లు, మూడు చిన్న ట్రాక్టర్లు, ఒక్కోటి చొప్పున టాటా ఏస్‌, డీసీఎం, మినీబస్సు, బొలేరో, హార్వెస్టర్‌ ఉన్నట్లు కేసీఆర్‌ తన అఫిడవిట్‌(Affidavit)లో పేర్కొన్నారు.

కాగా.. 2018లో దాఖలు చేసిన అఫిడవిట్‌(Affidavit)లో కేసీఆర్‌ వార్షికాదాయం రూ.1.10 కోట్లు కాగా.. ప్రస్తుతం మరో రూ.50 లక్షల మేర ఆదాయం పెరిగింది. సీఎం కేసీఆర్ తన పేరు మీద ఒక్క సెంటు భూమి కూడా లేదని తెలిపారు. తన భార్య పేరు మీదా భూమిని చూపించలేదు. అయితే.. కుటుంబ ఆస్తిగా 62 ఎకరాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అందులో 9 ఎకరాల వ్యవసాయేతర భూమిగా ఉన్నట్టు తెలిపారు. 

తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి, దేశంలోనే అత్యంత ధనిక పార్టీల్లో ఒకటైన బీఆర్‌ఎస్(BRS) పార్టీని నడిపిస్తున్న కేసీఆర్ తనకు భూములు, కార్లు లేవని పేర్కొనడం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  కాగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఈ సారి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు, బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్(Etela Rajender) సైతం పోటీ చేస్తున్నారు.