Revanth Reddy: కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్న రేవంత్ రెడ్డి

బంగారు తెలంగాణ సాధ్యం కాలేదని విమర్శ

Courtesy: Twitter

Share:

Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల వేడి (Election Heat) తారా స్థాయికి చేరింది. నామినేషన్ల (Nominations) పర్వం ముగిసి పోలింగ్ (Polling) కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడును (Speed) పెంచాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ (Congress) విజయభేరి సభలు, కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటున్నారు. మరో పక్క ముఖ్యమంత్రి కూడా బీఆర్ఎస్ (BRS) ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. వీరిద్దరూ చేసే పొలిటికల్ కామెంట్లు (Political Comments) హీట్ పుట్టిస్తున్నాయి. దీంతో ఎన్నికల వేడి మరింత పెరుగుతోంది. ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీయే విజయం (Win) సాధిస్తుందంటే తమ పార్టీయే విజయం సాధిస్తుందని వారు ధీమాగా ఉన్నారు. 

ఒకే దగ్గరి నుంచి పోరు.. 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గజ్వేల్ నుంచి మరో సారి పోటీకి దిగారు. ఆయన తనకు అచ్చొచ్చిన తన సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. కేవలం గజ్వేల్ నుంచి మాత్రమే కాకుండా ఈ సారి కొత్తగా కామారెడ్డి (KamaReddy) నుంచి కూడా బరిలో నిలిచారు. ఆయన కామారెడ్డి నుంచి బరిలో నిలవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)  కూడా కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సారి ముఖ్యమంత్రిని ఎలాగైనా కామారెడ్డిలో ఓడించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. కామారెడ్డి (KamaReddy) నుంచి కాంగ్రెస్ తరఫున ఎప్పుడూ పోటీ చేసే షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్భన్ (Nizamabad Urban) సీటును కేటాయించి మరీ కామారెడ్డి సీటును రేవంత్ రెడ్డి (Revanth Reddy)  తీసుకోవడం విశేషం. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ (Master Plan) ను అమలు చేసేందుకు ప్రయత్నించింది. ఆ మాస్టర్ ప్లాన్ వల్ల తమ భూములు పోతున్నాయని అనేక మంది రైతులు ఆరోపించారు. తర్వాత ప్రభుత్వం ఆ మాస్టర్ ప్లాన్ ను రద్దు (Cancel) చేసేందుకు రైతులతో సమావేశం అయింది. కానీ ఆ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయించేందుకు రైతులు బాగా కష్టపడ్డారు. ఇది ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుందా? అని అంతా అనుకుంటున్నారు. 

ఉద్యోగాలేవీ..

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ (Separate Telangana)ను ఆనాడు అనేక మంది పోరాటాలు చేసి సాధించుకున్నరు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల కల నెరవేరలేదు. కేవలం కొద్ది మంది మాత్రమే ప్రత్యేక తెలంగాణ వల్ల లాభపడ్డారని (Benefit) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)  అన్నారు. ఉద్యోగావకాశాలు లేకుండా యువత చితికిపోతుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన కుటుంబ సభ్యులందరికీ మంత్రి పదవులు (Ministers) ఇచ్చి ఉపాధి కల్పించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా తన బంధువులకు కూడా మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. కేవలం తన కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే మంత్రి పదవులు వచ్చాయని అంతే కానీ తెలంగాణ యువతకు మాత్రం ఉద్యోగాలు (Jobs) రాలేదని ఆయన దుయ్యబట్టారు. కేవలం ఆయన పోటీ చేసే నియోజకవర్గం అనే కాకుండా రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి చోట ఆయన కేసీఆర్ ప్రభుత్వం వల్ల ప్రజలు మోసమోయారని నొక్కి చెబుతున్నారు. ఈ ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. 

ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు గ్యారంటీలను (6 Guarantees) ప్రకటించింది. ఆరు గ్యారంటీలను ప్రకటించి వాటిని వేగంగా ప్రజలల్లోకి తీసుకెళ్తోంది. ఈ నెల 30 తారీఖున జరిగే పోలింగ్ లో ప్రజలు తమకే ఓట్లేస్తారని కాంగ్రెస్ నేతలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ గోస పడిందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాల వారికి మేలు జరిగిందని, మరో సారి సంక్షేమ పాలన అనేది కేవలం కాంగ్రెస్ (Congress) తోనే సాధ్యం అవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా అనేక మంది కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. అనేక మంది కుల సంఘాల నాయకులతో కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. క్రైస్తవ సంఘాల (Christian Communities) ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు,  స్వయం సహాయక సంఘాలకు 25 పైసల వడ్డీ, రైతులకు ఉచిత విద్యుత్ (Free Current), వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీని ప్రజలకు అందజేశారని గుర్తు చేశారు. మరోమారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటన్నింటినీ మళ్లీ అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.

రూ. 500కే సిలిండర్

కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) అందజేస్తామని ప్రకటన చేసింది. ఈ ప్రకటన గురించి రేవంత్ రెడ్డి అన్ని సభల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో సిలిండర్ రూ. 400 మాత్రమే ఉండేదని, మళ్లీ కాంగ్రెస్ ను దీవిస్తే గ్యాస్ సిలిండర్ ను రూ. 500 కే అందజేస్తామని ఆయన చెబుతున్నారు. కేసీఆర్-మోదీ పాలనలో సిలిండర్ ధర విపరీతంగా పెరిగిందని ఆరోపిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలో మాట్లాడుతూ.. పలు హామీలను ఇచ్చారు. అక్కడి ఓటర్లను లోకల్ సెంటిమెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నేను మీ బిడ్డను అని అన్నారు. తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్‌ఎస్ నేతలు మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి పట్ల జాగ్రత్త వహించాలని రేవంత్ ప్రజలకు సూచించారు. ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేసింది కాంగ్రెస్సేనని, బంగారు తెలంగాణను కూడా కాంగ్రెస్ ఒక్కటే సాకారం చేయగలదని అన్నారు. అందుకోసమే కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని ఓటర్లను (Voters) రేవంత్ రెడ్డి కోరారు.