War: ఇజ్రాయిల్ అధ్యక్షుడిని కాల్చి చంపాలంటున్న కాంగ్రెస్ ఎంపీ

యుద్ధాన్ని ఆపాలంటూ కాంగ్రెస్ విజ్ఞప్తి..

Courtesy: Twitter

Share:

War: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. హఠాత్తుగా జరిగిన హమాస్ (Hamas) ఎటాక్ (Attack) కారణంగా ఎన్నో జీవితాలు కుప్పకూలాయి. ఇప్పుడు ఇరువైపుల నుంచి యుద్ధం (War) కొన్ని వేల జీవితాలను బలిగొంది. మరోవైపు కేరళ (Kerala) కి చెందిన కాంగ్రెస్ (Congress) ఎంపీ రాజ్మోహన్ ఉన్నితాన్ ఇజ్రాయిల్ అధ్యక్షుడిని కాల్చి చంపాలంటూ కేరళ (Kerala)లో, శాంతి కోసం జరిగిన ఒక ర్యాలీ సందర్భంగా మాట్లాడటం జరిగింది. 

ఇజ్రాయిల్ అధ్యక్షుడిని చంపాలి: 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య కేరళ (Kerala)లోని కాసరగోడ్‌లో జరిగిన శాంతిని నెలకొల్పాలి అంటూ జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ (Congress) ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితాన్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) యుద్ధ నేరస్థుడని, విచారణ లేకుండా కాల్చి చంపాలని ఆయన చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, యుద్ధ నేరాలలో నేరస్తులుగా ఉన్న వారి కోసం న్యూరేమ్‌బెర్గ్ ట్రయల్స్ అని పిలిచేవారు. న్యూరేమ్‌బెర్గ్ ట్రయల్స్‌లో, ఎటువంటి విచారణ లేకుండానే యుద్ధ నేరస్థులను కాల్చి చంపే ఒక రూల్ ఉంటుంది. న్యూరేమ్‌బెర్గ్ మోడల్ ట్రయల్ నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని.. బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) యుద్ధ నేరస్థుడిగా ప్రపంచం ఎప్పుడో గుర్తించింది అని.. విచారణ లేకుండానే నెతన్యాహు (Benjamin Netanyahu)ను కాల్చి చంపడానికి ఇది సరైన సమయం, ఎందుకంటే అతని క్రూరత్వం తారస్థాయికి చేరుకుంది అని, కాంగ్రెస్ (Congress) ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితాన్ చెప్పాడు. 

యుద్ధాన్ని ఆపాలంటూ కాంగ్రెస్ విజ్ఞప్తి..: 

ఇజ్రాయిల్ హ‌మాస్ యుద్ధం (War) కారణంగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. యుద్ధం (War) మొదలై ఇప్పటికే నెల కావస్తున్నప్పటికీ యుద్దం (War)  ఇంకా కొనసాగుతున్న వైనం కనిపిస్తోంది. ఇటువంటి హింసను ఆపేందుకు ఇటీవల కాంగ్రెస్ (Congress), భారత ప్రభుత్వం తరఫునుంచి అమెరికా, ఇజ్రాయిల్, యూరప్ యూనియన్లకు ప్రభుత్వాలకు ఒత్తిడి తీసుకురావాలి అంటూ విజ్ఞప్తి చేస్తుంది. ఎంతో మంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు యుద్ధం (War) కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, యుద్ధం (War)లో గాయపడిన వారికి చికిత్స పొందేందుకు హాస్పిటల్లో సౌకర్యాలు కూడా కొడవయ్యాయని, ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని, హింస కారణంగా మానవ విలువలు దిగజారిపోతున్నాయని, ఈ పరిస్థితి ముందుకు వెళ్లకుండా ఇతర దేశ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, భారత ప్రభుత్వం తరఫున నుంచి ఒత్తిడి తీసుకురావాలంటూ కాంగ్రెస్ (Congress) విజ్ఞప్తి చేసింది. 

ఇదిలా ఉండగా మరోవైపు హమాస్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం 43వ రోజుకి చేరుకుంది. కానీ ఇప్పటివరకు యుద్ధం ఆగాలి అటు, శాంతి నెలకొల్పాలి అంటూ ఇరువైపుల నుంచి ఎటువంటి ప్రతిపాదిక లేకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ (Israel)-హమాస్ (Hamas) యుద్ధంలో కాల్పుల విరమణ (ceasefire)కు పిలుపునివ్వాలని, ఇటీవల మసాచుసెట్స్‌లోని యుఎస్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్‌ను పాలస్తీనా మహిళ నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బోస్టన్‌లోని ఒక రెస్టారెంట్‌లో, మహిళ తనను తాను పాలస్తీనా శరణార్థిగా వారెన్‌కు పరిచయం చేసుకుంటూ, గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడుల్లో తన కుటుంబంలోని 68 మంది సభ్యులు చనిపోయారని చెప్పడం కనిపిస్తుంది. ఆమె వారెన్‌ను, 'కాల్పు విరమణకు ముందు ఇంకా ఎంతమంది చనిపోవాలి?' అని అడుగుతుంది. తమ కుటుంబంలో శోకం.. ఇంక ఎంతమంది చూడాలి అంటూ, ఆ మహిళ బాధతో వస్తున్న ఉక్రోషంతో నిలదీయడం వీడియోలో కనిపిస్తుంది.