Kerala: కొచ్చి కన్సర్ట్ తొక్కిసలాటలో నలుగురు మృతి

పోలీసులు ఏం చెప్తున్నారంటే..

Courtesy: Twitter

Share:

Kerala: కేరళ (Kerala)లో ఇటీవల బాంబు పేలుడు కారణంగా ప్రతి ఒక్కరు ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఆ భయం ఇంకా పోకముందే మరో సంఘటన కేరళ (Kerala)లో చోటు చేసుకోవడం అందరినీ భయానికి గురి చేస్తోంది. కొచ్చిన్ యూనివర్శిటీ కన్సర్ట్ (Concert) లో జరిగిన తొక్కిసలాట (Stampede)లో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో 60 మందికి పైగా గాయపడిన ఘటనపై కేరళ (Kerala) ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో, శనివారం జరిగిన కొన్ని ఉత్సవాలని పోలీసులు ఆపేయడం జరిగింది. 

కన్సర్ట్ తొక్కిసలాటలో నలుగురు మృతి: 

క్యాంపస్‌లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగిన సంగీత కన్సర్ట్ (Concert)  లో తొక్కిసలాట (Stampede) జరిగింది. అకస్మాత్తుగా వర్షం కురువడంతో ప్రేక్షకులు మెట్లపై నుంచి ఆడిటోరియంలోకి వెళ్లారని, దీంతో తొక్కిసలాట (Stampede) జరిగి మరణాలు సంభవించాయని పోలీసు అధికారి తెలిపారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) MR అజిత్ కుమార్ మాట్లాడుతూ, ఒక స్కూల్లో ఇంజినీరింగ్ కాలేజీ (College) ఫంక్షన్ జరుగుతున్నట్లు అనుమానం ఉందని.. ఆహ్వానితులను నలుపు టీ-షర్టులతో రావాలని కోరారని.. అకస్మాత్తుగా వర్షం కారణంగా ప్రజలు సైట్‌ల దగ్గర ఉన్నవారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని.. అదే సమయంలో మెట్లపై ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కిందపడిపోవడంతో అనుకోకుండా తొక్కేసిలా జరిగి ఉండొచ్చని వెల్లడించారు.నలుగురిని ఆసుపత్రికి తరలించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు...అంతే కాకుండా మొత్తం 46 మంది గాయపడినట్లు నివేదించారు.

నికితా గాంధీ ప్రదర్శన సమయంలో తొక్కిసలాట (Stampede) జరిగిందని ప్రాథమిక నివేదికలు సూచించగా, విషాదం సంభవించినప్పుడు, సింగర్ ఇంకా తన పర్ఫామెన్స్ ప్రారంభించలేదని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి, ఇలా జరుగుతుందని ఊహించలేదని, నిజంగా ఇది విషాదకరమైన సంఘటన అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు సింగర్. 

ఇదిలా ఉండగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ.. క్యూ కట్టలేక...వర్షం కారణంగా లోపలికి దూసుకెళ్లారని..మొదట కొందరు కింద పడ్డారని..మరికొందరు అక్కడికి చేరుకునే సరికి.. అంబులెన్స్‌లో ఆసుపత్రికి విద్యార్థులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. 

ప్రత్యక్ష సాక్షి:

సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఇది జరిగిందని..ఇక్కడికి వచ్చేసరికి ముగ్గురు నలుగురు విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లారని, చినుకులు పడుతూనే ఉన్నాయని.. విద్యార్థులు లోపలికి దూసుకెళ్లారని, ఏటవాలుగా అడుగులు వేయడం మరియు నెట్టడం వల్ల ఇది జరిగింది" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

ఈ సంఘటన కారణంగా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు సహా నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో 60 మందికి పైగా కలమస్సేరి మెడికల్ కాలేజీ (College) హాస్పిటల్ మరియు సమీపంలోని మరికొన్ని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

ఇటీవల జరిగిన బాంబు పేలుళ్లు:

కేరళ (Kerala)లో ఇటీవల జరిగిన మతపరమైన కార్యక్రమంలో పలుచోట్ల పేలుళ్లు (explosions) జరగడంతో ఇప్పటికి ముగ్గురు మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు. కొచ్చి కన్వెన్షన్ (convention centre) సెంటర్‌లో యెహోవాసాక్షుల ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే కనీసం మూడు పేలుళ్లు (explosions) జరిగాయి. పేలుళ్లు (explosions) జరిగినప్పుడు కన్వెన్షన్ (convention centre) సెంటర్‌లో 2,000 మంది ఉన్నారు. మొదటి బాంబు (Bomb) దాడి సుమారు ఉదయం 9.47 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 27న ప్రారంభమైన మూడు రోజుల క్రిస్టియన్ (Christian) మీటింగ్స్ (Meetings) జరుగుతుండగా, చివరి రోజున హఠాత్తుగా ఈ బాంబు (Bomb) పేలుళ్లు (explosions) సంభవించాయి.

 కేరళ (Kerala)లో సంభవించిన బాంబు (Bomb) దాడుల కారణంగా, గాయపడిన వారు జిల్లాలోని వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పేలుళ్లు (explosions) జరిగిన కొన్ని గంటల తర్వాత, 48 ఏళ్ల మార్టిన్ బాధ్యత వహిస్తూ లొంగిపోయాడు. అయినప్పటికీ ఈ విషయం గురించి మరింత దర్యారం చేయడం జరిగింది. ఈ దాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ని ఉపయోగించారని, కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని  కేరళ (Kerala) పోలీసులు తెలిపారు.