KTR: కేటీఆర్ మామా.. హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్ తీసుకురండి ప్లీజ్..

చిన్నారి రిక్వెస్ట్‌కు కేటీఆర్ అదిరిపోయే రిప్లై

Courtesy: Twitter

Share:

KTR: తెలంగాణ(Telangana) ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) సోషల్ మీడియాలో(Social Media) చాలా యాక్టివ్గా ఉంటారు. రాజకీయ అంశాలతో పాటు వర్తమాన విషయాలు, నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఆపదలో ఉన్న వారికి కూడా సాయం అందిస్తుంటారు. పక్క ఎన్నికల హడావిడీలో బిజీ బిజీగా గడుపుతున్న కేటీఆర్‌.. తాజాగా ఎక్స్లో (ట్విటర్‌) చిన్నారి అడిగిన ప్రశ్నకు స్పందించారు. హైదరాబాద్కు డిస్నీలాండ్ (Disney Land) తీసుకురండి.. అంటూ చిన్నారి చేసిన రిక్వెస్ట్ మంత్రి కేటీఆర్ను (Minister KTR) ఆకట్టుకుంది. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారంటే?

తెలంగాణలో(Telangana) రేపు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఫోకస్ అంతా రిజల్ట్ డేట్(Result Date) పైనే ఫోకస్ చేస్తున్నారు. కాగా, నిన్నటితో అన్ని పార్టీల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు అన్ని పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. క్రమంలో జనాలకు హామీల వర్షం కురిపించారు. ఇదే సమయంలో చిన్నారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ పంపింది. పాపకు కేటీఆర్(KTR) రిప్లై కూడా ఇవ్వడంతో వీడియో సోషల్ మీడియా (Social Media)వేదికగా వైరలవుతోంది. అలాగే నవ్వులు కూడా పూయిస్తోంది.

మంత్రి కేటీఆర్(Minister KTR) సోషల్ మీడియాలో(Social Media) చాలా యాక్టివ్గా ఉంటారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా చిన్నారి అడిగిన ప్రశ్న కేటీఆర్ను ఆకట్టుకుంది. వెంటనే ఆయన స్పందించారు. ఇటీవలకేటీఆర్ తాతకు ఓటేస్తానంటూఅనన్య అనే చిన్నారి తల్లితో మారాం చేస్తూ మాట్లాడిన ముద్దు మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో చిన్నారి మంత్రి కేటీఆర్ని(Minister KTR) ఒక రిక్వెస్ట్ చేసింది. ‘కేటీఆర్ మామా.. హైదరాబాద్కు డిస్నీ ల్యాండ్ (Disneyland) తీసుకురా ప్లీజ్అంటూ ముద్దుగా అడుగుతున్న వీడియోను ఆమె తండ్రి సురేంద్ర వినాయకం (Surendra Vinayakam) ట్విట్టర్లో పోస్టు చేశారు. వీడియోపై మంత్రి కేటీఆర్(Minister KTR) స్పందించారు. ‘ప్రామిస్ చేయలేను కానీ బేటా.. తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానుఅంటూ కేటీఆర్ చిన్నారికి రిప్లై ఇచ్చారు. పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డిస్నీ లాండ్ (Disneyland) పిల్లలకు కలల ప్రపంచం. కాలిఫోర్నియాలో(California) ఉంది. రెండు రకాల థీమ్ పార్కులలో ఉన్న డిస్నీ లాండ్ (Disney Land) పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్కడ పిల్లల కోసం ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి. రకరకాల గేమ్స్, రైడ్స్, షోలు, పెరేడ్లు ఉంటాయి. గుహలోంచి వెళ్లే రైలు, రంగుల రాట్నం, ఫైర్ వర్క్స్ ఇలా ఎన్నో.. కనిపించిన ప్రతీది పిల్లలకు నిజమనే భ్రాంతిలో ముంచేస్తుంది. పిల్లలు ఎంతగానో ఇష్టపడే డిస్నీ లాండ్ హైదరాబాద్కు (Hyderabad) తీసుకురమ్మని అడిగిన చిన్నారి కోరిక తీరుతుందేమో చూద్దాం.

నవంబర్ 30 తెలంగాణ అసెంబ్లీలోని (Telangana Assembly) 119 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా పిలిచే భారత రాష్ట్ర సమితి (BRS) మూడోసారి కూడా అధికారంలో కొనసాగాలని కోరుతోంది. తిరిగి పుంజుకునేందుకు కాంగ్రెస్(Congress), అధికారంలోకి రావడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్య వ్యక్తులలో బీఆర్ఎస్ (BRS) నాయకుడు మరియు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(Chandrashekar Rao), అతని కుమారుడు కేటీ రామారావు, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), మరియు బీజేపీ సభ్యులు బండి సంజయ్(Bandi Sanjay) కుమార్, డి అరవింద్, మరియు సోయం బాపురావు ఉన్నారు. ఇది అనేక పార్టీలు విజయం కోసం పోటీపడుతున్న పోటీ రాజకీయ దృశ్యం.