Malla Reddy: ఎన్నికల జోరు పెంచిన మల్లారెడ్డి

Malla Reddy: తెలంగాణ (Telangana)లో ఇప్పటికే ఎన్నికలు (Elections) దగ్గర పడుతున్న వేళ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. BRS మంత్రి నల్ల మల్లారెడ్డి (Malla Reddy) సమావేశాలలో ప్రసంగిస్తూ తన తన చమత్కారమైన మాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రసంగాలలో నవ్వులను పూయిస్తూ, ప్రజలకు దగ్గరవుతున్నాడు మల్లారెడ్డి (Malla Reddy). మల్లారెడ్డి ప్రసంగాల జోరు:  మల్కాజిగిరిలో జరిగిన ఒక సమావేశంలో, నల్ల మల్లారెడ్డి (Malla Reddy) ఇటీవల కాంగ్రెస్ […]

Share:

Malla Reddy: తెలంగాణ (Telangana)లో ఇప్పటికే ఎన్నికలు (Elections) దగ్గర పడుతున్న వేళ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. BRS మంత్రి నల్ల మల్లారెడ్డి (Malla Reddy) సమావేశాలలో ప్రసంగిస్తూ తన తన చమత్కారమైన మాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రసంగాలలో నవ్వులను పూయిస్తూ, ప్రజలకు దగ్గరవుతున్నాడు మల్లారెడ్డి (Malla Reddy).

మల్లారెడ్డి ప్రసంగాల జోరు: 

మల్కాజిగిరిలో జరిగిన ఒక సమావేశంలో, నల్ల మల్లారెడ్డి (Malla Reddy) ఇటీవల కాంగ్రెస్ (Congress) వైపు మారిన మైనంపల్లి హనుమంత రావుపై విరుచుకుపడ్డారు. అతన్ని ‘మైనంపిల్లి’ అని పిలిచారు. అక్కడితో ఆగకుండా అతన్ని ‘బఫూన్ మంత్రి’ అని పిలిచారు.

మైనంపల్లి (Mynampally Hanumantha Rao) ఇంటిపేరు గల ప్రజల మర్యాదలను కూడా విమర్శించారు మల్లా రెడ్డి. అతను ఎప్పుడూ అనేక బౌన్సర్లు.. నల్ల కార్లలో దొంగ చాటుగా తిరుగుతూ ఉంటాడు అంటూ విమర్శించారు మల్లారెడ్డి (Malla Reddy). నిజానికి కాంగ్రెస్ (Congress) నేత మైనంపల్లి హనుమంతు (Mynampally Hanumantha Rao) తనను తాను పహల్వాన్‌గా భావిస్తాడు, కాని అతనికి తనకున్నంత దమ్ము ఉందా అని మల్లా రెడ్డి ప్రశ్నించారు. నిజానికి అతనో ‘మచ్చర్ పహల్వాన్’ అని.. హేళన చేయడంతోపాటు మైనంపల్లి హనుమంత రావు (Mynampally Hanumantha Rao)ను ఇమిటేట్ చేయడం కూడా జరిగింది. 

మైనంపల్లి (Mynampally Hanumantha Rao) బీఆర్‌ఎస్‌ (BRS)కు ద్రోహం చేశారని, పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని మల్లారెడ్డి (Malla Reddy) ఆరోపించారు. మైనంపల్లి (Mynampally Hanumantha Rao) పార్టీని వీడడంతో మల్కాజిగిరిలోని అన్ని బీఆర్‌ఎస్ కేడర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొంత ఊరట పొందారని అన్నారు మల్లారెడ్డి (Malla Reddy). 2018 ఎన్నికల్లో తన గెలుపు కోసం శ్రమించినప్పుడు కూడా ప్రతిపక్షాల కుట్ర జరిగిందని ఆరోపించారు.

స్పందించిన మైనంపల్లి హనుమంత రావు: 

దీనిపై మైనంపల్లి (Mynampally Hanumantha Rao) స్పందిస్తూ, మల్లారెడ్డి (Malla Reddy) ‘కల్చర్‌లెస్ ఫెలో’ అని అన్నారు. అతను ‘మాస్టర్ ఆఫ్ ఆల్-జాక్ ఆఫ్ ఆల్’ అని. అతను పాఠశాల క్రికెట్, వాలీబాల్ జట్లకు నాయకత్వం వహించడానికి మాత్రమే ఉన్నాడని పేర్కొన్నాడు. తన ఇంటి పేరునీ మైనంపిళ్లి అంటూ ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha Rao). “డ్యాన్స్ తప్ప, మీకు ఏమీ తెలిదు” అంటూ మల్లారెడ్డి (Malla Reddy) పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మైనంపల్లి (Mynampally Hanumantha Rao). అంతేకాకుండా సమీపిస్తున్న ఎన్నికల్లో హరీష్ రావు ఓడిపోతారని, మల్లారెడ్డి (Malla Reddy) జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు మైనంపల్లి హనుమంత రావు (Mynampally Hanumantha Rao). 

తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ : 

అసెంబ్లీ ఎన్నికలు (Elections) సమీపిస్తున్న వేళ ప్రతి పార్టీ కూడా తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలంగాణ (Telangana)లోని అసెంబ్లీ ఎన్నికల తేదీని ఖరారు చేసిన వైనం కనిపిస్తోంది. అయితే ఎన్నికల జోరు కొనసాగిస్తున్న వేళ, బిఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ (Shock) తగిలిన సంఘటన ఎదురయింది. సుమారు 1000 మంది పైగా బిఆర్ఎస్ (BRS) నేతలు కాంగ్రెస్ (Congress) కండువ వేసుకున్నారు. 

కోదాడలో కాంగ్రెస్ (Congress) కు మద్దతు తెలుపుతూ, నాలుగుసార్లు ఎమ్మెల్యే (MLA)గా గెలిచిన వి.చందర్‌రావు (Chander Rao) తో పాటు సుమారు 1,000 మంది ద్వితీయశ్రేణి బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ (Congress) లో చేరారు. ఆయన భార్య పద్మావతి రెడ్డి 2014లో కోదాడ నుంచి పోటీ (Race) చేసి గెలుపొందారు. కాంగ్రెస్ (Congress)లో చేరిన వారిలో డీసీసీబీ మాజీ చైర్మన్ బూర పుల్లారెడ్డి, ఎమ్మెల్యే (MLA)గా పోటీ (Race) చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీ ఉన్నారు. 2018లో స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందిన బొల్లం మల్లయ్య యాదవ్‌ను మార్చాలనే తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌ (BRS) తన స్థానంలో నిలబెట్టిందని వాపోయారు. కోదాడలో 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ (Congress) విజయం సాధిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.